Rakasa Movie Public Talk: రాకాస మూవీ పబ్లిక్ టాక్.. మెగా డాటర్ మూవీ ఎలా ఉందంటే..?

Rakasa Movie Public Talk: 'కమిటీ కుర్రోళ్లు' సక్సెస్ తరువాత మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన లెటెస్ట్ మూవీ 'రాకాస'. లవ్, కామెడీ, అడ్వెంచర్, ఫాంటసీ ఎలిమెంట్స్ ను సమన్వయం చేస్తూ దర్శకురాలు మానస శర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై ఉమేశ్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన జంటగా నటించగా, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాగా, ఈడూరోలు రాజు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించగా, అన్వర్ అలీ ఎడిటింగ్ చేశారు. ముందుగా విడుదలైన టీజర్,ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలకు పెంచేశాయి. దీంతో సినిమా రిలీజ్‌కు ముందే పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో 'రాకాస' ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ 'రాకాస' సినిమాపై పబ్లిక్ టాక్ ఎలాంటి? ప్రేక్షకుల అభిప్రాయాలు, సోషల్ మీడియా రివ్యూల వివరాల్లోకి వెళితే..

Rakasa Movie Public Talk  Niharika Konidela s Fantasy Comedy Gets Positive Buzz

సంగీత్ శోభన్ మూవీ ప్రీమియర్స్ నుంచే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కథ ఒక సాధారణ గ్రామీణ నేపథ్యంలో ప్రారంభమై, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా మలుపులు తిరుగుతుంది. అమెరికా నుంచి తన ప్రియురాలిని వెతుక్కుంటూ వచ్చిన వీరబాబు (సంగీత్ శోభన్), అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కొని, గ్రామస్తుల తీర్పుతో ఒక పాడుబడిన కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ కోటలో రాక్షసుడు ఉన్నాడనే భయంతో నిండిన వాతావరణంలో కథ ముందుకు సాగుతుంది. ఈ పాయింట్ చుట్టూ దర్శకురాలు మానస శర్మ ఫాంటసీ, కామెడీ, ఎమోషన్‌లను మిక్స్ చేసి ఎంటర్టైనర్ సోర్టీగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుందని ప్రేక్షకులు అభిప్రాయం.

పబ్లిక్ టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తిగా కామెడీతో నిండిపోయి, సరదాగా సాగిపోతుందట. ముఖ్యంగా గెటప్ శ్రీను కామెడీ టైమింగ్, సంగీత్ శోభన్‌తో కలిసి వచ్చే సన్నివేశాలు థియేటర్లలో నవ్వుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. అయితే అసలు సినిమా స్ట్రెంత్ సెకండ్ హాఫ్‌లోనే కనిపిస్తుంది. కథకు అవసరమైన ఫాంటసీ, ఇంటెన్స్ ఎలిమెంట్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆసక్తిగా కూర్చోబెడుతున్నాయి. 'ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది' అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

నటీనటుల విషయానికి వస్తే సంగీత్ శోభన్ ఈ సినిమాను తన భుజాలపై మోసాడని ప్రేక్షకులు తమ అభిప్రాయపడుతున్నారు. కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్ని రకాల సన్నివేశాల్లో అతని పెర్ఫార్మెన్స్ నేచురల్‌గా కనిపించింది. చాలా మంది ప్రేక్షకులు 'ఇది సంగీత్ వన్ మ్యాన్ షో' అని అభిప్రాయపడుతున్నారు. వెన్నెల కిషోర్‌తో కలిసి వచ్చిన సన్నివేశాలు సెకండ్ హాఫ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే నయన్ సారికతో ఉన్న లవ్ ట్రాక్ కూడా సరదాగా సాగింది. గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, రోహిణి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారట.

టెక్నికల్ అంశాలు కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారాయి. అనుదీప్ దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా ఫాంటసీ సన్నివేశాల్లో మంచి ఎఫెక్ట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ కోట సన్నివేశాలను, మిస్టీరియస్ వాతావరణాన్ని అద్భుతంగా చూపించింది. ఎడిటింగ్ కూడా సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా ఫాస్ట్‌గా నడిపించడంలో సహాయపడింది. వీఎఫ్ఎక్స్ కూడా ఆశించిన స్థాయిలో ఉండటంతో సినిమా విజువల్‌గా రిచ్‌గా కనిపించింది. నిర్మాణ విలువలు కూడా నిహారిక కొణిదెల స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయని టాక్.

మరికొందరూ 'రాకాస'పై వచ్చిన స్పందన చూస్తే ఎక్కువగా పాజిటివ్ వైపు మొగ్గు చూపుతోంది. 'ఫుల్ ఎంటర్‌టైనర్', 'నవ్వులు పూయించే సినిమా', 'ఫ్యామిలీతో చూసే పర్ఫెక్ట్ మూవీ' అంటూ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొన్ని సీన్స్ ఇప్పటికే చూసినట్లుగా అనిపించడం, కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడం వంటి చిన్న విమర్శలు వినిపిస్తున్న అవి సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌ను పెద్దగా ప్రభావితం చూపలేవని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా చూస్తే 'రాకాస' ఒక నాన్‌స్టాప్ కామెడీ ఎంటర్‌టైనర్. లాజిక్స్ వెతక్కుండా, ఫుల్ ఫన్‌తో సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ సీజన్‌లో వినోదాత్మక సినిమాలు కోరుకునే ప్రేక్షకులకు 'రాకాస' సరైన ఛాయిస్‌గా మారే అవకాశం ఉంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. 'రాకాస' థియేటర్‌లో నవ్వులు పూయించే ఫన్ రైడ్. సెకండ్ హాఫ్ బలం, కామెడీ ట్రాక్, సంగీత్ శోభన్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నిలబెట్టాయి. ఈ వారం ఎంజాయ్ చేయదగ్గ సినిమాల్లో 'రాకాస' తప్పకుండా ఉండాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X