Rakasa Movie Review: రాకాస మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, రోహిణి, అన్నపూర్ణ తదితరులు
దర్శకత్వం: మానస శర్మ
నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేశ్ కుమార్ బన్సాల్
మ్యూజిక్: అనుదీప్ దేవ్
సినిమాటోగ్రఫి: రాజు ఎదురోలు
ఎడిటింగ్: అన్వర్ అలీ
బ్యానర్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2026-04-03
వీరబాబు అలియాస్ ఈరబాబు (సంగీత్ శోభన్) అమెరికా నుంచి తన సొంత ప్రియురాలు సుకన్యను వెతుక్కొంటూ తన సొంత గ్రామానికి వస్తాడు. ప్రియురాలు దక్కకపోవడంతో సుబ్బలక్ష్మీ (నయన్ సారిక)తో ప్రేమలో పడుతాడు. అయితే సోము (వెన్నెల కిషోర్) హత్య కేసులో వీరబాబు ఇరుక్కొంటాడు. ఆ హత్య కేసు బాధ్యుడైన ఆయనను గ్రామంలోని రాక్షసుడు నివసిస్తున్నాడని భావించే పురాతన కోటలోకి పంపించి బలి ఇవ్వాలని గ్రామ పెద్ద (బ్రహ్మాజీ), గ్రామస్తులు తీర్పు ఇస్తారు.
అలా కోటలోకి ప్రవేశించిన వీరబాబుకు రాక్షసుడు ఎదురయ్యాడా? ఆ కోటలో రాక్షసుడు ఉండటం వెనుక ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ప్రియురాలు సుకన్యను ఎందుకు దక్కించుకోలేకపోయాడు? చిన్ననాటి స్నేహితురాలు సుబ్బలక్ష్మీతో ఎలా ప్రేమలో పడ్డారు? పురాతన కోటలోకి వెళ్లిన తర్వాత వీరబాబు పరిస్థితి ఏమిటి? ఆ కోటలో నిజంగా రాక్షసుడు ఉన్నాడా? పాడుబడిన కోటలోకి వెళ్లిన వీరబాబు రాక్షసుడిని సంహరించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే రాకాస కథ.

దర్శకురాలు మానస శర్మ ఎంచుకొన్న చందమామ కథకు కామెడీ, ఫన్ ఎలిమెంట్స్ జోడించి ఫాంటసీగా ఈ సినిమాను రూపొందించిన విధానం బాగుంది. ఈ సినిమాకు సన్నివేశాలు, వాటికి తోడు డైలాగ్స్ చక్కగా కుదరడంతోపాటు ఫాస్ట్‌గా సాగే స్క్రీన్ ప్లే తోడవ్వడం పాజిటివ్ అంశాలుగా మారాయి. దర్శకురాలి విజన్‌కు తగినట్టుగా సంగీత్ శోభన్, గెటప్ శ్రీను కామెడీ ట్రాక్, అలాగే సంగీత్-వెన్నెల కిషోర్ కాంబినేషన్ సీన్లు థియేటర్‌లో ఆడియెన్స్‌ను నవ్వుల్లో ముంచెత్తడమే కాకుండా కేక పెట్టించేలా చేస్తాయి.
రాకాస సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే.. మెయిన్ హాస్యం, వినోద అల్లరితో సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్‌కు కావాల్సిన బేస్‌ను పక్కాగా వేసుకొనేందుకు మానస శర్మ అనుసరించిన పంథా పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. సినిమా టేకాఫ్ అందుకొన్న తర్వాత క్లైమాక్స్ వరకు ఎక్కడా డ్రాప్ కాకుండా శరవేగంగా సీన్లు పరుగులు పెట్టాయి. ఆద్యంతం నవ్విస్తూ చివర్లో ఎమోషన్స్ పండించాయి. సెకండాఫ్ ఈ సినిమాకు ప్రాణం. గ్రిప్పింగ్‌గా కథ చెప్పిన తీరు ఆడియెన్స్‌ను కనెక్ట్ అయ్యేలా చేసిందని చెప్పాలి. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను సూపర్ హిట్ చేసేందుకు దోహదపడ్డాయి.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సంగీత్ శోభన్ వన్ మ్యాన్ షోతో సినిమాను పూర్తిగా తన భుజాలపై మోశాడు. ఫస్టాఫ్‌లో గెటప్ శ్రీను, సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్‌తో సీన్లలో సహజసిద్దమైన నటన, డైలాగ్ డెలీవరి, హావభావాలు ప్లస్ పాయింట్స్‌గా మారాయి. ఇక సంగీత్, నయన్ సారిక మధ్య లవ్ ట్రాక్, ఫన్ డ్రామా కూడా హైలెట్‌గా నలిచింది. బ్రహ్మజీ, తనికెళ్ల భరణి, రోహిణి ఇతరులు తమ పాత్రలతో గుర్తుండిపోతారు.
ఇక ఈ సినిమాకు అత్యంత బలం అనుదీప్ మ్యూజిక్ బ్యాక్ బోన్‌గా నిలిచింది. ఇక రాజు ఎదురోలు సినిమాటోగ్రఫి ఈ సినిమా మూడ్‌ను, స్టోరీ ఎన్విరాన్‌మెంట్ లైవ్లీగా మార్చింది. అన్వర్ అలీ ఎడిటింగ్ కూడా స్టోరీని, సీన్లను బాగా ఎలివేట్ చేసింది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్, నిర్మాత నిహారిక కొణిదెల అనుసరించిన నిర్మాణ విలువలు బేషుగ్గా ఉన్నాయి. నటీనటుల ఎంపిక, కథ, కథనాలపై చేసిన కసరత్తు చూస్తే నిహారికకు సినిమాపై ఉన్న తపన, ప్యాషన్ ఏమిటో తెలుస్తుంది.
రాకాస చిత్రం విఠలాచార్య తరహా సోషియో ఫాంటసీ చిత్రం. కొత్తగా చెప్పుకోవడానికి కథ, కథనాలు ఏమీ ఉండవు. తెలిసిన కథనే తెర మీద ప్రజెంట్ చేసిన తీరుకు మానస శర్మకు, కథను నమ్మి పాత్రల్లో లీనమై నటించిన యాక్టర్లను అభినందించాలి. నాన్ స్టాప్ కామెడీతో సినిమా పరుగులు పెడుతుంది. లాజిక్స్ వెతక్కుండా బుర్రకు పని చెప్పకుండా సీటులో రిలాక్స్‌గా ఈ సినిమాను రెండున్నర గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ వారం చూడాలనుకొనే సినిమాల్లో రాకాసను తప్పకుండా చేర్చుకోవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలు ఉండటం వల్ల ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొనే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











