Rakasa Movie First Review: రాకాస మూవీ ఫస్ట్ రివ్యూ

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియో బ్యానర్‌పై రూపొందిన చిత్రం రాకాస. కామెడీ, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యువ హీరో సంగీత్ శోభన్, సక్సెస్‌ఫుల్ హీరోయిన్ నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాకు రచనా సహకారంతోపాటు మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశీష్ విద్యార్థి, గెటప్ శ్రీను, వాసూ ఇంటూరి, రోహిణి తదితరులు నటించారు.

ఈ చిత్రం సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫి అన్వర్ అలీ ఎడిటర్‌గా, అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఉమేష్ కుమార్ భన్సల్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న ఫ్యాన్సీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ 'రాకాస‌'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) ఫీడ్ బ్యాక్ ఏంటి? ఈ సినిమాకు జారీ చేసిన సర్టిఫికెట్ ఏంటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Rakasa Movie Review by Censor Board

కామెడీ, ఫాంటసీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందిన రాకాస చిత్రాన్ని ఇటీవల సెన్సార్ బోర్డు సభ్యులు వీక్షించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ విషయంలో స్వల్ప అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ దర్శకురాలు మానస శర్మ, చిత్ర యూనిట్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందారు. దాంతో ఈ చిత్రానికి యూఏ (UA13+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం 13 ఏళ్లకుపై బడిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ రివ్యూ సందర్భంగా జారీ చేసిన సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు.

ఆద్యంతం వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, గెటప్ శ్రీను కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ఫన్ రైడింగ్‌లా ఉంటుంది. కథను ముందుకు తీసుకెళ్లేందుకు వారిద్దరి మధ్య సన్నివేశాలు ఎక్కువగా హెల్ప్ అవుతాయి. ఇక నయన్ సారిక, సంగీత్ మధ్య ఉండే క్యూట్ లవ్ స్టోరి సినిమాకు యూత్‌ఫుల్ ఎలిమెంట్‌గా ఉంటుంది అనే అభిప్రాయం. ఈ సినిమా కేవలం ఫన్, కామెడీ, థ్రిల్లర్ మాత్రమే కాకుండా అంతకుమించిన కథ ఉంటుంది సెన్సార్ నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.

రాకాస సినిమా ఓ ప్రత్యేకమైన జోనర్‌లో సాగే ఫాంటసీ థ్రిల్లర్. ఈ చిత్ర కథ డిమాండ్ మేరకు నిడివిని కూడా బాగా తగ్గించారు. ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని పంచే విధంగా, అలాగే ఎక్కువగా సన్నివేశాలను, కథను సాగదీయకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నిడివి 2 గంటల 13 నిమిషాలకు ఫిక్స్ చేశారు. అంటే ఈ చిత్రం 133 నిమిషాల రన్‌టైమ్‌తో ముగించారు. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ స్టోరీల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X