Rakasa Movie Twitter Review: రాకాస మూవీ ట్విట్టర్ రివ్యూ
కమిటీ కుర్రోళ్లు లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన రెండో చిత్రం రాకాస. లవ్, కామెడీ, అడ్వెంచర్, ఫాంటసీ ఎలిమెంట్స్ మేళవింపుగా మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా రాకాసను నిర్మించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.
టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాసపై హైప్ నెలకొంది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా రాకాస మూవీ గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే ఏప్రిల్ 2వ తేదీన అమెరికాతో పాటు ఇండియాలో ఈ సినిమా ప్రీమియర్స్‌ను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాకాస సినిమాపై నెటిజన్లు అందించిన టాక్ ఏమిటీ? క్రిటిక్స్ రివ్యూ ఏమిటీ? అనే వివరాలు పరిశీలిస్తే..

రాకాస ఫస్ట్ హాఫ్ బాగుంది. సంగీత్ శోభన్ బ్రో తన పర్ఫార్మెన్స్‌తో ఇరగదీశాడు. గెటప్ శ్రీను భాయ్ తన టీజ్‌తో కుమ్మేశాడు అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు
రాకాస ఎంటర్‌టైనింగ్ సినిమా. ఫస్టాఫ్‌ను మించి సెకండాఫ్ అద్భుతంగా వినోదాన్ని పంచింది. ప్రతి ఒక్కరూ తమ నటనతో అలరించారు. ప్రత్యేకించి సంగీత్ శోభన్, వెన్నెల కిషోర్‌లు ఇరగదీశారు. నయన్ సారిక, గెటప్ శ్రీనులకు కూడా మంచి స్కోప్ దొరికింది. స్టోరీ యూనిక్‌గా ఉంది, కథను బాగా ఎగ్జిక్యూట్ చేశారు. క్లైమాక్స్‌లో ఫన్, ఇంటెన్స్‌గా ఉంది. ఎమోషనల్ టచ్‌తో అనుదీప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. మానస శర్మ డైరెక్షన్ స్టాండ్ ఔట్‌గా ఉంది. నిహారిక కొణిదెల నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాను థియేటర్‌లలో చూడటం మిస్ అవ్వొద్దని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
రాకాస నీట్‌గా తీసిన హార్రర్ కామెడీ. లెక్కలేనన్ని నవ్వులు పంచుతుంది. ఫస్టాఫ్, సెకండాఫ్ రెండూ హిలేరియస్ మూవ్‌మెంట్స్‌తో నిండిపోయాయి. అలాగే కథ కూడా చక్కగా చెబుతూ, ఎగ్జిక్యూట్ చేశారు. కొన్ని పాత్రలను ఇంకాస్త మెరుగ్గా తీర్దిదిద్దాల్సింది. మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్లుగా ఉంటాయి. అవి మినహా మొత్తం మీద సినిమా చాలా సరదాగా గడిచిపోతుందిని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
రాకాస.. ఫాంటసీ, హార్రర్, కామెడీల అద్భుత సమ్మేళనం. సినిమా అంతటా ఎంతో వినోదాత్మకంగా సాగింది. అలాగే స్క్రీన్ ప్లే స్టార్టింగ్ నుంచి ఎండిగ్ వరకు ఆసక్తికరంగా సాగింది. గెటప్ శ్రీను టైమింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. మొత్తం మీద థియేటర్‌లలో చూడదగ్గ మంచి సినిమా ఇది అని ఓ అభిమాని కామెంట్ చేశాడు.
మంచి కామెడీతో ఈ సినిమా ఫన్‌గా ఉంది. సాంగ్స్, బీజీఎం చాలా బాగున్నాయి. స్నేక్ డ్యాన్స్ హైలైట్. క్లైమాక్స్ సూపర్. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. రాకాసకు నా రేటింగ్ 3.5/5 అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.
రాకాస ఫాంటసీ, కామెడీ కుటుంబంతో చూడదగిన వినోదాత్మక చిత్రం. ఈ సినిమాలో తన మాయ ప్రపంచాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ఈ సినిమాకు కామెడీ పెద్ద బలం. ప్రతి కామెడీ సీన్ ప్రేక్షకులను ఖచ్చితంగా నవ్విస్తుంది. మేజిక్ మూవ్‌మెంట్స్, హిలేరియస్ సన్నివేశాలు ఎక్కడా అతి లేకుండా సరదాగా కుదిరాయి. సాంకేతికంగా సినిమా ఎంతో ఉన్నతంగా ఉంది. వీఎఫ్ఎక్స్‌ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. నిర్మాణ విలువలు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. స్క్రీన్ ప్లే ఎక్కడా విసుగు పుట్టించకుండా పరిగెత్తింది. సంగీత్ శోభన్ నటన ఈ సినిమా స్పెషల్ అట్రాక్షన్‌లలో ఒకటిగా నిలుస్తుంది. రాకాస అన్ని వయసుల వారికీ ఖచ్చితంగా నచ్చడంతో పాటు సమ్మర్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది అని ఓ అభిమాని రివ్యూ ఇచ్చాడు.
రాకాస మంచి చిత్రం. సంగీత్ శోభన్ స్టోరీ సెలక్షన్ పర్ఫెక్ట్. నిహారిక కొణిదెల ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫస్టాఫ్‌ని సెకండాఫ్ డామినేట్ చేసింది. ఓవరాల్‌గా చూడటానికి మంచి ఎంటర్‌టైనర్ అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.
హ్యాపీగా చూసేయొచ్చు సినిమా. సెకండాఫ్ బాగా వర్కవుట్ అయ్యింది. సంగీత్ శోభన్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను పంచ్‌లతో ఇరగ్గొట్టేశారు. ఈ సినిమాకు నా రేటింగ్ 3.25/5. టైటిల్స్ అయిపోయాక కూడా వచ్చే సీన్‌కి ఆడియన్స్ కూర్చొన్నారు అంటే డైరెక్టర్‌గా మానస సక్సెస్ అయినట్లేనని ఓ అభిమాని రివ్యూ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications