twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జస్ట్ ఓకే అనిపించాడు...(సూర్య ‘రాక్షసుడు’రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5
    హైదరాబాద్: డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్య నటించిన తమిళ చిత్రం ‘మాస్'. ఈ చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసుడు' పేరుతో విడుదల చేసారు. తమిళంలో జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మేధా క్రియోష‌న్స్‌ అధినేత‌లు మిరియాల రాజాబాబు(కృష్ణారెడ్డి), మిరియాల ర‌వింద‌ర్ రెడ్డి విడుద‌ల చేసారు.

    వెంకట్ ప్రభు దర్శకత్వం వహించడం....సూర్య లాంటి స్టార్ హీరో, ఆయన సరసన నయనతార నటించడంతో ఈ చిత్రంపై ముందు నుండీ అంచనాలు భారీగానే ఉన్నాయి. దెయ్యాలు...ఆత్మలు కాన్సెప్టు తీసుకున్న దర్శకుడు ఈ చిత్రాన్ని రొటీన్‌కి భిన్నంగా తెరకెక్కించాడు.

    కథ విషయానికొస్తే...
    మధుసూదన్ అలియాస్ మాస్ (సూర్య), జెట్ (ప్రేమ్ జీ) ఇద్దరూ చిల్లర దొంగలు. మెసాలు, దొంగతనాలు చేసుకుంటూ జీవితం గడువుతుంటారు. నర్సుగా పని చేస్తున్న మాలిని(నయనతార)ను మాస్ ప్రేమిస్తూ ఉంటారు. ఆమెకు డబ్బు అవసరం కావడంతో ఓ రోజు దొంగతనం చేయబోగా...అపుడు జరిగిన ప్రమాదంలో ప్రేమ్ జీ చనిపోతాడు. దాంతో సూర్య డల్ అయిపోతాడు. తర్వాత కొద్ది రోజులుకు అతనికి ప్రేమ్ జీ కనపడటం ప్రారంభిస్తాడు. అప్పుడు సూర్యకు అర్దమవుతుంది...తనకు దెయ్యాలను చూసే పవర్ వచ్చిందని. ఈ విషయ తెలిసి దెయ్యాలు అతని వెంట పడుతుంటాయి. తమ తీరని కోరికలు, సమస్యలు తీర్చాలని, తమ ఆత్మకు శాంతి చేకూరేలా చేయాలని అతన్ని కోరుతాయి.

    సూర్య దొంగతనాలు ఆపేసి...ఆ దెయ్యాలను రకరకాల ఇళ్లకు పంపి....జనాలను భయ పెడుతూ...వాటిని తరిమేస్తున్నట్లు గేమ్ ఆడుతూ డబ్బు సంపాదిస్తూంటాడు. అయితే ఓ రోజు ఓ దెయ్యాన్ని ఓ ఇంటినుంచి తరుముదామని వెళితే అక్కడ షాక్ కు గురి అవుతాడు. అక్కడ ఉన్న దెయ్యం...అచ్చం అతని పోలికలోనే ఉంటుంది. ఆ దెయ్యం పేరు శివ(సూర్య మరో పాత్ర). శివ ఎదురు పడ్డాక మాస్ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు. అసలు ఈ దెయ్యాలు గోల ఏంటి...తన పోలికలతోనే ఉన్నవాడు ఎవరు అనేది తెలుసుకోవాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.

    Rakshasudu Movie Review

    పెర్ఫార్మెన్స్ పరంగా సూర్య ఇటు మాస్ పాత్రలోనూ, అటు దెయ్యం పాత్రలోనూ అదరగొట్టాడు. సినిమా మొత్తానికి సూర్య వన్ మెన్ షో అని చెప్పొచ్చు. మొదటి క్యారెక్టర్ మాస్ - ఇందులో సూర్య ఒక కన్నింగ్ ఫెలోగా మంచి హావభావాలను పలికించాడు. ఈ పాత్ర మాస్ ఆడియన్సుకు ఆకట్టుకునే విధందా ఉంటుంది. రెండవ క్యారెక్టర్ శివ - ఈ పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. అందులో సూర్య క్లాస్ లుక్ విత్ పోనీ టెయిల్ అండ్ పెర్ఫార్మన్స్ చాలా డీసెంట్ గా ఉంది. నయనతార పాత్రను సినిమాలో జస్ట్ ఒక గ్లామర్ కోసమే వాడుకున్నారు. ఆమె లుక్ బావుంది. ఆమె పాత్రకు పెర్ఫార్మెన్స్ పరంగా అవకాశం లేకున్నా ఉన్నంతలో ఆకట్టుకుంది. ప్రణిత చాలా చిన్న రోల్ చేసింది, ఉన్నంతలో తన పాత్రకి న్యాయం చేసింది. ప్రేంజీ అమరేన్ సినిమా అంతా ట్రావెల్ అవుతూ అక్కడక్కడా నవ్వించాడు.

    ‘రాక్షసుడు' సినిమా చూస్తుంటే తెలుగులో ఆ మధ్య వచ్చిన ‘వారధి' సినిమా గుర్తుకొస్తుంది. దెయ్యాల కాన్సెప్టును కాస్త కొత్త చూపినా రోటీన్ రివేజ్ డ్రామా జొప్పించి బోర్ కొట్టించాడు. కథ రోటీన్ అయినా కనీసం స్క్రీప్లేతో అయినా నెట్టుకొచ్చాడా అంటే అదీ లేదు. అయితే ఒకటి రెండు థ్రిల్లింగ్ పాయింట్స్ ఉండటం కొంత వరకు బెటర్ అనిపిస్తుంది.

    ఇక ఫస్టాప్ చూసిన వారంతా చాలా బోర్ ఫీలయ్యారు. సూర్య సినిమాలను అభిమానించే వారు సైతం బోర్ ఫీలవ్వడం సినిమాలో మొదటి మైనస్, ఇక సెకండాఫ్ విషయానికి వస్తే ఎదో ఆసక్తిని క్రియేట్ చెయ్యాలని కథ ఎటు పడితే అటు మలుపులు తిరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడా ఆసక్తిని మాత్రం క్రియేట్ చేయలేకపోయారు. చాలా సన్ని వేశాల్లో లాజిక్ మిస్సయింది. టోటల్ గా సినిమాలో ఎంటర్టెన్మెంట్ పాళ్లు చాలా లోపించాయి.

    టెక్నికల్ అంశాలు పరిశీలిస్తే సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. యువన్ శంకర్ రాజా అందించిన ఆడియో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బావుంది. శశాంక్ వెన్నల కంటి డైలాగ్స్ కథకు తగిన విధంగా ఉన్నాయి.

    అక్కడక్కడా వచ్చే కొన్ని బోరింగ్ ఎలిమెంట్స్ ని కాస్త పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా సినిమా జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉంది. అక్కడక్కడ థ్రిల్లింగ్ అంశాలు, సూర్య పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే మంచిది.

    English summary
    It is a story of revenge laced around horror and comedy. Rakshasudu tracks to how and why Suriya gets to see spirits. Does he posses any unique powers? What is the connection between him and that special wraith Suriya meets in the process? What Suriya does for that special someone, forms the story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X