రాక్షసుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Recommended Video

Rakshasudu Movie Review || రాక్షసుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

Rating:
3.0/5
Star Cast: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, శరవణన్, వినోద్ సాగర్
Director: రమేష్ వర్మ పెన్మత్స

నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి శ్రీనివాస్ ఇప్పటి వరకు అన్నీ కమర్షిల్ సినిమాలే చేస్తూ వచ్చాడు. అయితే ఆ ప్రయత్నాలన్నీ ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడంతో ఈ సారి జోనర్ మార్చి రంగంలోకి దిగాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రాక్షసుడు' ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో విజయం సాధించిన 'రాక్షసన్' చిత్రానికి ఇది రీమేక్. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వం వహించారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాక్షసుడు' ఏ మేరకు మెప్పింది, సినిమా కథ కమామిషు ఏమిటి? అనేది సమీక్షిద్దాం.

కథ ఏమిటంటే...

కథ ఏమిటంటే...

అరుణ్(బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ఫిల్మ్ మేకర్ అవ్వాలనే డ్రీమ్‌తో ఇండస్ట్రీకి వచ్చి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సైకోలు, ఉన్మాదులు, మతిస్థిమితం సరిగా లేని వ్యక్తులు చేస్తున్న హత్యలపై రీసెర్చ్ చేసి ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేయాలనేది అతడి కోరిక. చాలా మంది నిర్మాతలను కలిసి తన వద్ద ఉన్న కథ గురించి చెప్పినా అందరూ బావుందని మెచ్చుకునే వారే తప్ప ఇలాంటి కథలు కమర్షియల్‌గా వర్కౌట్ కావు అని ఏదో ఒక సాకుతో తిరస్కరిస్తూ ఉంటాడు. ఇటు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక పోవడం, మరో వైపు కుటుంబ సభ్యుల ఒత్తిడితో చేసేది ఎస్ఐ ఉద్యోగంలో చేరుతాడు.

అసలు కథ ఇక్కడే మొదలవుతుంది

అసలు కథ ఇక్కడే మొదలవుతుంది

అరుణ్ ఉద్యోగంలో చేరిన తర్వాత 16 ఏళ్ల అమ్మాయి అత్యంత కిరాతకంగా హత్య చేయబడుతుంది. అప్పటికే ఇలాంటి నేరాలపై పరిశోధన చేసిన ఉన్న అరుణ్... ఇది సైకో చేసే హత్యగా గుర్తిస్తాడు. మొదట అతడు చెప్పింది డిపార్టుమెంటు వారు నమ్మక పోయినా... వరుసగా అలాంటి నేరాలే జరుగుతుండటంతో డిపార్టుమెంట్ కూడా అరున్ దారిలోకి వస్తుంది. ఆ సైకోను పట్టుకునే క్రమంలో ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. చివరకు పోలీస్ డిపార్ట్‌మెంటే ఇబ్బందులో పడుతుంది. మరి ఈ కేసు అరుణ్ ఎలా చేధించాడు? ఆ సైకో ఎవరు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అనేది తర్వాతి కథ.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే బెల్లంకొండ శ్రీనివాస్ ఆకట్టుకున్నాడు. అతడి బాడీ లాంగ్వేజ్‌కు తగిన విధంగా ఒక మంచి పాత్ర చేసే అవకాశం వచ్చింది. విఫలమైన ఫిల్మ్ మేకర్‌గా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. అనుపమ పరమేశ్వరన్ చిన్న పాత్రలో నటించినా... ఉన్నంతలో మెప్పించింది. విలన్ పాత్రలో కనిపించిన శరవణన్ పర్వాలేదనిపించాడు. రాజీవ్ కనకాల, ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

గిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. సంగీతం పర్వాలేదనే విధంగా ఉంది. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ ఓకే. అమర్ రెడ్డి ఎడింటింగ్ విషయంలో ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే బావుండేది. సెకండాఫ్‌లో ఇంకాస్త క్రిస్పీగా ఎడిటింగ్ చేస్తే బావుండేది.

కథ, స్క్రీన్ ప్లే

కథ, స్క్రీన్ ప్లే

‘రాక్షసుడు' కథ పరంగా చూస్తే గొప్ప కథ అని చెప్పలేం కానీ ట్విస్టులు ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ఈ సినిమాకు ప్రధాన బలం స్క్రీన్ ప్లే. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉత్కంఠగా ముందుకు సాగించడంలో, ప్రేక్షకుడు కథకు ఎంగేజ్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.

ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

  • ఉత్కంఠగా సాగే స్క్రీన్ ప్లే
  • కథలోని ట్విస్టులు, సస్పెన్స్ ఎలిమెంట్స్
  • బెల్లంకొండతో పాటు మెయిన్ కాస్ట్ పెర్పార్మెన్స్
  • బ్యాగ్రౌండ్ స్కోర్
  • మైనస్ పాయింట్స్

    • విలన్ పాత్ర అంత బలంగా లేపోవడం
    • సెకండాఫ్‌లో కథను సాగదీయడం
    • క్లైమక్స్ ఆకట్టుకునే విధంగా లేక పోవడం
    • ఫస్టాఫ్, సెకండాఫ్ ఎలా ఉందంటే...

      ఫస్టాఫ్, సెకండాఫ్ ఎలా ఉందంటే...

      సినిమా మొదలవ్వడమే ఒక అమ్మాయి దారుణ హత్యతో మొదలవుతుంది.అరుణ్ ఫిల్మ్ మేకర్‌గా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తుంటాడు. అక్కడ సక్సెస్ కాలేక కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఎస్ఐ ఉద్యోగం చేయడం, ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడం లాంటి అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది. సెకండాఫ్ విలన్‌ను పట్టుకునే ప్రయత్నాలు, విలన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌తో కాస్త ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ప్రీ క్లైమాక్స్ ముందు కథను సాగదీయడంతో ఇంకా ఎంతసేపు అనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ సింపుల్‌గా ఉండటం కూడా కాస్త మైనస్ అని చెప్పొచ్చు.

      డైరెక్షన్

      డైరెక్షన్

      రమేష్ వర్మ పెన్మత్స డైరెక్షన్, సినిమాను హ్యాండిల్ చేసిన విధానం బావుంది. ఆయా పాత్రలకు నటీనటులను ఎంపిక, వారి నుంచి తనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అయితే సెకండాఫ్ విషయంలో కాస్త శ్రద్ధ పెడితే బావుండేది.

      చివరగా...

      చివరగా...

      క్రైమ్ సస్పెన్స్, సైకో థ్రిల్లర్ జోనర్లో సాగే చిత్రాలు ఇష్టపడే వారికి ‘రాక్షసుడు' ఒక మంచి ఆప్షన్. సినిమా మొదలైన కొద్దిసేపటికే కథకు ఎంగేజ్ అవుతారు. కమర్షియల్ అంశాలు ఆశించకుండా వెళితే బెటర్.

      నటీనటులు, టెక్నీషియన్స్

      నటీనటులు, టెక్నీషియన్స్

      తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, శరవణన్, వినోద్ సాగర్, వినోదిని, సూర్య, రాధా రవి, సుజానే జార్జ్ తదితరులు.

      రచన: సాగర్
      ఆర్ట్: గాంధీ నడికొడికర్
      కెమెరా: వెంకట్ సి.దిలీప్
      సంగీతం: జిబ్రాన్
      నిర్మాత: సత్యనారాయణ కొనేరు
      దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స
      విడుదల తేదీ: ఆగస్టు 2, 2019

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X