twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rakul Preet Singh's Sardar Ka Grandson Review.. భారత్, పాక్ సరిహద్దు కథ ఎలా ఉందంటే!

    |

    Rating:
    2.5/5
    Star Cast: అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్ అబ్రహం, అదితి రావు హైదరీ, నీనా గుప్తా
    Director: కాశ్వీ నాయర్

    దేశవ్యాప్తంగా అప్రకటిత లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో థియేటర్లు నిరవధికంగా మూతపడ్డాయి. ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీ సాధనాలే వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. థియేటర్‌లో రిలీజ్‌కు వేచి చూడలేని నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ద్వారా ప్రేక్షకలు ముందుకు తెస్తున్నారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే సర్దార్ కా గ్రాండ్‌సన్. రకుల్ ప్రీత్ సింగ్, అర్జున్ కపూర్, అదితిరావు హైదరీ, జాన్ అబ్రహం నటించిన చిత్రం ఎలా ఉందంటే..

    సర్దార్ కా గ్రాండ్‌సన్ కథ ఏమిటంటే..

    సర్దార్ కా గ్రాండ్‌సన్ కథ ఏమిటంటే..

    అమృత్‌సర్‌కు చెందిన రూపిందర్ కౌర్ (నీనా గుప్తా) అలియాస్ సర్దార్ మనవడు అమ్రీక్ సింగ్ (అర్జున్ కపూర్)‌కు రాధ లక్ష్మికి (రకుల్ ప్రీత్ సింగ్) నిశ్చితార్థం జరుగుతుంది. అమెరికాలో ఉండే ఈ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో బ్రేకప్ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తన అమ్మమ్మ సర్దార్‌కు ఆరోగ్య క్షీణించిందని, చావు బతుకుల్లో ఉందని సమాచారం అందుతుంది. దాంతో అమెరికా నుంచి అమృత్‌సర్‌కు వస్తాడు. అయితే పాకిస్థాన్‌లోని లాహోర్‌లోని ఇంటికి వెళ్లాలన్నది నా 70 ఏళ్ల కల. దానిని తీర్చమని అమ్రీక్‌ను కోరుతుంది. కానీ సర్దార్‌కు వీసా ఇవ్వడానికి పాక్ ఎంబసీ నిరాకరిస్తుంది.

    సర్దార్ కా గ్రాండ్‌సన్ ట్విస్టులు

    సర్దార్ కా గ్రాండ్‌సన్ ట్విస్టులు

    లాహోర్ నుంచి రూపిందర్ కౌర్ అమృత్ సర్‌కు ఎందుకు వచ్చింది? లాహోర్‌లో తన భర్త గుర్షర్ సింగ్‌కు ఏమైంది? 70 ఏళ్ల నుంచి లాహోర్‌లోని తన ఇంటికి ఎందుకు వెళ్లాలని అనుకొంది? తన అమ్మమ్మ చివరి కోరికను అమ్రీక్ తీర్చాడా? తన అమ్మమ్మ కోరికను తీర్చడానికి అమ్రీక్ ఎలాంటి సాహసం చేశాడు? అమ్రీక్‌తో రాధ విభేదాలు సద్దుమణిగాయా? అమ్రీక్ చేసిన సాహసంలో రాధ పాత్ర ఏమిటి? చివరకు సర్దార్ కోరిక ఎలా తీరింది అనే ప్రశ్నలకు సమాధానామే సర్దార్ కా గ్రాండ్‌సన్ కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    అమ్రీక్ ప్రవర్తన తీరు వల్ల కలిగే సమస్యల వల్ల విసిగిపోయిన రాధ తన నిశ్చితార్థం ఉంగరాన్ని అతడికి ఇచ్చేసి బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత అమ్రీక్ అమృత్‌సర్‌కు రావడం, తన అమ్మమ్మ ఆరోగ్య పరిస్థితిని చూసి లాహోర్‌కు వెళ్లడం లాంటి అంశాలు వినోదం, ఎమోషన్స్ కలిపి దర్శకుడు చకచకా ముందుకు తీసుకెళ్తాడు. ఓ సంఘటనను ఆధారంగా చేసుకొని లాహోర్‌లో తన అమ్మమ్మ ఇంటిని తీసుకు రావడానికి ప్రయత్నాలు చేపడుతాడు. లాహోర్ ప్రజలు సహకరించినా.. అక్కడ ఉండే ఏ నాయకుడు మాత్రం అందుకు అడ్డుపడుతాడు. తన తాతను శత్రువుగా భావించే ఆ నేతను ఎదిరించి తాత, అమ్మమ్మల ఇంటిని అమృత్ సర్‌కు తీసుకురావాలని ప్లాన్ చేస్తాడు.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక తన తాత, అమ్మమ్మకు సంబంధించిన ఫ్లాష్‌ బ్యాక్‌లో తాత గుర్షర్ సింగ్‌గా జాన్ అబ్రహం, యువ సర్దార్‌గా అదితిరావు హైదరీ మధ్య సన్నివేశాలు బాగుంటాయి. లాహోర్‌లో మత కలహాల అంశం సినిమా కథకు ప్రాణంగా మారుతుంది. అయితే ఈ సినిమాలో బలమైన వివాదాస్పద అంశం, క్లిష్టమైన సమస్య అమ్రీక్ ముందు లేకపోవడం వల్ల కథ తేలిపోయిందనిపిస్తుంది. ఈ సినిమాకు బలమైన పాయింట్ లేకపోవడం, సింగిల్ పాయింట్ ఎజెండా మీదే కథ అంతా నడవడం కొంత బోర్‌గా అనిపిస్తుంది. కాకపోతే మానవ సంబంధాలు అనే పాయింట్ ఆకట్టుకొనే అంశంగా కనిపిస్తుంది.

     దర్శకుడు ప్రతిభ గురించి

    దర్శకుడు ప్రతిభ గురించి

    దర్శకుడు కాశ్వీ నాయర్ రాసుకొన్న పాయింట్‌ను బలమైన కథగా మలచలేకపోయాడనే చెప్పవచ్చు. భారత్, పాక్ సరిహద్దు మధ్య జరిగే కథలో ఎమోషన్స్ లేకపోవడం, హృదయాన్ని పిండివేసే అంశాలు లేకపోవడం వల్ల ఈ కథ సాదాసీదాగా సాగుతుంది. సరిహద్దు ప్రేమ కథను బలంగా చెప్పలేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. దర్శకుడిగా తన పరిధి మేరకు ఓకే అనిపించాడు. జాన్ అబ్రహం, అదితిరావు మధ్య ఉండే సీన్లను బలంగా చెప్పలేకపోవడం వల్లే సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది.

    అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్

    అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్

    అమ్రీక్‌గా అర్జున్ కపూర్ కొన్ని సన్నివేశాల్లో బాగా ఎమోషన్స్ పండించాడు. మరికొన్ని సీన్లలో తన బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకోలేకపోయింది. భావోద్వేగాలను పండించే పాత్రను సరిగా పండించలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక రాధాలక్ష్మీగా రకుల్ సింగ్ పాత్ర లెంగ్త్ బాగానే ఉంటుంది. కానీ ఆ పాత్ర అస్థిత్వం బలంగా కనిపించదు. కథపై ప్రభావం ఎక్కడా ఉండదు. గ్లామర్ పరంగాను ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్‌గా గెస్ట్ పాత్ర మాదిరిగా అనిపిస్తుంది.

    ఇతర పాత్రల్లో నటీనటులు

    ఇతర పాత్రల్లో నటీనటులు

    ఇక అమ్మమ్మ పాత్రలో నీనా గుప్తా తన పాత్రలోని భావాలను పలికించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమెను గుర్తుపట్టనంతగా మేకప్ వేయడంతో దాని మాటున ఆ భావాలు బయటకు కనిపించలేకపోయాయని చెప్పవచ్చు. ఇక యవ్వనపు సర్దార్ పాత్రలో అదితిరావు పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. కాసేపైనా మంచి ఫీలింగ్‌ను క్రియేట్ చేసింది. అలాగే యువ జాన్ అబ్రహం కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు.

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే..

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే..

    సాంకేతిక విభాగాల్లో సినిమాటోగ్రఫి బాగుంది. మహేంద్ర శెట్టి పల్లె వాతావరణాన్ని అలాగే పట్టణ వాతావరణాన్ని చక్కగా కెమెరాలో ఒడిసి పట్టుకొన్నారు. తనిష్క్ బాగ్చీ మ్యూజిక్ పలు సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. మాహిర్ జవేరి ఎడిటింగ్ ఒకేలా ఉన్నాయి. హీరో జాన్ అబ్రహం స్వయంగా ఈ సినిమాను పలువురితో కలిసి నిర్మించడం గమనార్హం. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ నటీనటుల ఎంపిక విషయంలో కాస్త పిసినారిగా వ్యవహారించారనిపిస్తుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    సర్దార్ కా గ్రాండ్‌సన్ చిత్రం మానన సంబంధాలతో కూడిన సరిహద్దు ప్రేమ కథా చిత్రం. ఈ కథలో ప్రేమకు పెద్ద పీట వేయకపోవడం ఓ మైనస్ అనిచెప్పవచ్చు. కాకపోతే భావోద్వేగాలకు మంచి చోటు కల్పించారు. లాక్‌డౌన్ సమయంలో అనేక ఎమోషన్స్‌తో కొట్టుమిట్టాడుతున్న ప్రేక్షకులకు కాస్త ఊరట కల్పించే చిత్రంగా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. కాకపోతే శభాష్.. సర్దార్ కా గ్రాండ్‌సన్ అనే రేంజ్‌లో మూవీ లేదనిచెప్పవచ్చు.

    Recommended Video

    Super Star Krishna And Vijaya Nirmala’s Grandson Sharan New Movie Opening | Filmibeat Telugu
    తెర వెనుక, తెర ముందు...

    తెర వెనుక, తెర ముందు...

    అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్ అబ్రహం, అదితి రావు హైదరీ, నీనా గుప్తా, సోని రజ్దాన్ తదితరులు
    దర్శకత్వం: కాశ్వీ నాయర్
    నిర్మాతలు: జాన్ అబ్రహం, భూషణ్ కుమార్, కిషన్ కుమార్, దివ్య కోస్లా కుమార్ తదితరులు
    మ్యూజిక్: తనిష్క్ బాగ్చీ
    సినిమాటోగ్రఫి: మహేంద్ర శెట్టి
    ఎడిటింగ్: మాహిర్ జవేరి
    ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
    రిలీజ్ డేట్: 2021-05-18

    English summary
    Sardar Ka Grandson Review: Rakul Preet Singh and Arjun Kapoor's latest movie Sardar Ka Grandson released on Netflix.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X