twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ram Asur Review రొమాంటిక్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

    |

    Rating: 2.75/5

    నటీనటులు: అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తీక్, సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాన్వీ సాల్మాన్‌‌, షెర్రీ అగర్వాల్ త‌దిత‌రులు
    సినిమాటోగ్ర‌ఫి: జే ప్ర‌భాక‌రరెడ్డి
    సంగీతం: భీమ్స్ సిసిరోలియో
    ఫైట్స్‌: శ‌ంక‌ర్‌
    నిర్మాత‌లు: అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ,
    క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేష్ త్రిప‌ర్ణ
    రిలీజ్ డేట్: 2021-11-19

    పుష్కలంగా ప్రతిభ ఉన్న యువకుడు రామ్ (రామ్ కార్తీక్) తన ప్రయోగశాలలో రసాయన ప్రక్రియ ద్వారా కృత్రిమంగా వజ్రం చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియ (షెర్రీ అగర్వాల్)తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. కానీ ఉన్నట్టుండి ఓ రోజు రామ్‌కు ప్రియ బ్రేకప్ చెబుతుంది. జీవితంలో ఎంతో సక్సెస్ చూసిన రామ్‌కు రకరకాల వైఫల్యాలను చూస్తుండటంతో స్నేహితుడి సహాయంతో తమిళనాడు వైదీశ్వరున్ కోయిల్‌లోని పండితుడు రామాచారి (శుభలేఖ సుధాకర్)ను కలుస్తాడు. అయితే నర్సీపట్నంలోని సూరి (అభినవ్ సర్దార్)‌ను కలువమని సలహా ఇస్తాడు.

    కృత్రి వజ్రం తయారు చేయడంలో ఏ మేరకు రామ్ సఫలమయ్యాడు? రామ్‌కు ప్రియ ఎందుకు బ్రేకప్ చెప్పింది? సూరిని కలవమని రామ్‌కు ఎందుకు రామాచారి సలహా ఎందుకు ఇచ్చాడు? సూరి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి? సూరి గతం ఏమిటి? సూరికి ప్రియురాలు చాందినీ (చాందిని తమిళారాసన్) ఎందుకు దూరమైంది? సూరి ఎందుకు అసురుడిగా మారారు? రామ్‌కి అసురుడిగా మారిన సూరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయనే ప్రశ్నలకు సమాధానమే రామ్ అసుర్ సినిమా కథ.

    Ram Asur movie review and rating

    రామ్ అసుర్ సినిమా కథ, కథనాల విషయానికి వస్తే.. తొలి భాగంలో రామ్, ప్రియకు మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, వారి మధ్య కెమిస్ట్రీ, తదితర అంశాలు జోష్‌‌గా, రంజుగా సాగుతాయి. అలాగే సూరి, ప్రియ మధ్య ప్రేమ సన్నివేశాలు క్లీన్‌గా షన్నీగా సాగుతాయి. వజ్రాల వేట, వజ్రాల తయారీ అంశాలు సినిమాపై మరింత ఆసక్తిని రేపుతాయి. అలా రామ్, సూరి జీవితాలకు సంబంధించి పక్కాగా రాసుకొన్న సన్నివేశాలు సినిమాకు బలంగా కనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో రామ్ జీవితంలోకి సూరి ప్రవేశించే ఎపిసోడ్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందనే ఫీలింగ్‌ను కలిగిస్తుంది. ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే రెండు మేజర్ ట్విస్టులు సినిమాను మరో మెట్టు ఎక్కిస్తుంది. చక్కటి ఎమోషనల్, యాక్షన్ మేలవించిన సీన్‌తో క్లైమాక్స్ ముగియడం రామ్ అసుర్‌ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిందని చెప్పవచ్చు.

    ప్రేమ, భావోద్వేగం, యాక్షన్, ఫన్ ఎలిమెంట్స్ కలబోసి రెండు రకాల విభిన్న ప్రేమ కథలను రాసుకొని దర్శకుడు వెంక‌టేష్ త్రిప‌ర్ణ చేసిన ప్రయత్నం, కథను తెరకెక్కించిన తీరు అభినందనీయం. యాంగ్రీ యంగ్ మ్యాన్‌‌గా అభినవ్ సర్దార్‌, సాఫ్ట్ రోల్‌లో రామ్ కార్తీక్ పాత్రలను మలిచిన విధానం దర్శకుడి టాలెంట్‌కు నిదర్శనంగా మారింది. రెండు రకాల హై ఎమోషనల్ పాయింట్లను డీల్ చేసిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. ప్రధాన పాత్రలతో చెప్పించిన డైలాగ్స్ సన్నివేశాలకు మరింత ఆకర్షణీయంగా మారాయని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో ఇచ్చిన ట్విస్ట్‌‌తో సినిమా నెక్ట్స్‌ లెవెల్ అనే ఫీలింగ్ కలుగుతుంది. తొలి చిత్ర దర్శకుడైనప్పటికీ.. అనుభవం ఉన్న డైరెక్టర్‌గా కథను డీల్ చేశాడనే ఫీలింగ్‌ను వెంక‌టేష్ త్రిప‌ర్ణ కలిగించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

    Ram Asur movie review and rating

    సూరిగా అభినవ్ సర్దార్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాకు కీలకంగా మారిన రోల్‌ను సునాయసంగా పోషించి మెప్పించాడు. లవర్ బాయ్‌గా, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తన ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొన్నాడు. ఇక లవర్ బాయ్ పాత్రలో రామ్ కార్తీక్ రొమాంటిక్‌గా తెర మీద కనిపించాడు. శృంగార సన్నివేశాల్లో షెర్రీ అగర్వాల్‌తో కలిసి అదరగొట్టాడు. వజ్రాలు తయారు చేసే సైంటిస్ట్‌గా రామ్ కార్తీక్ ఫెర్ఫార్మెన్స్ యూత్‌ ఆకట్టుకొంటుంది. ఇక ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో శాన్వీ సాల్మన్ అద్భుతమైన యాక్టింగ్‌ను కనబరిచాడు. సూరి, రామ్ పాత్రల మధ్య శాన్వీ రోల్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. శాన్వీ రోల్ మాత్రం తెరపైనే చూస్తే ప్రేక్షకులు థ్రిల్లింగ్‌గా ఫీలవ్వడం ఖాయం. శివ పాత్రలో శాన్వీ తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో కొత్తగా కనిపించాడు. విభిన్నమైన పాత్రను అలవోకగా పోషించి మెప్పించాడు. బలరాం రాజుగా సుమన్ పవర్ ఫుల్‌గా కనిపిస్తాడు.

    గ్రామీణ యువతిగా చాందినిగా చాందిని తమిళరాసన్ హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అలాగే ప్రియగా షెర్రీ అగర్వాల్ గ్లామర్ డోస్‌తో కుమ్మేసింది. ఈ రెండు పాత్రల్లో చిన్న ట్విస్టు ఆసక్తికరంగా ఉండటమే కాకుండా కథను మలుపు తిప్పుతాయి.

    Ram Asur movie review and rating

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. జే ప్ర‌భాక‌ర రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. రూరల్, అర్బన్ ఎన్విరాన్‌మెంట్స్‌ను చక్కగా తెరపైన చూపించాడు. 80వ దశకంలో సాగే కథకు సంబంధించిన అంశాలను, వాతావరణాన్ని తెరపైన చూపించాడు. ఇక ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలతో సాగుతుంది. ఫైట్ మాస్టర్ శంకర్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. భీమ్స్ సిసిరోలియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది.

    లవ్, ఎమోషనల్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఇంట్రెస్టింగ్‌గా సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ రామ్ అసుర్. కథలో చిన్న చిన్న లోపాలు ఉన్నా.. డైరెక్టర్ కథను డీల్ చేసిన విధానం బాగుంది. యాక్షన్, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. విభిన్నమై టేకింగ్, స్క్రీన్ ప్లే ఆకట్టుకొనేలా ఉంటాయి. వారాంతంలో యాక్షన్, లవ్, రొమాంటిక్ చిత్రాన్ని చూడాలనుకొనే వారికి రామ్ అసుర్ కేరాఫ్ అడ్రస్. ఎలాంటి అంచనాల లేకుండా వెళితే థ్రిలింగ్ బయటకు రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

    English summary
    Ram Asur Movie is love, romantic, Action, Thriller. This movie directed by Venkatesh Tripura. This movie set to release on November 19th. In this occassion, Telugu filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X