»   » నా తల్లి అంటే ఎంత ప్రేమనో.. పవన్‌ అన్నా అంతే... రాంచరణ్ ఎమోషనల్

నా తల్లి అంటే ఎంత ప్రేమనో.. పవన్‌ అన్నా అంతే... రాంచరణ్ ఎమోషనల్

Written By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో మెగా హీరోల హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవన్ స్టార్ రాంచరణ్‌కు ఫ్యాన్స్ గురించే మరీ చెప్పనక్కర్లేదు. రాజకీయపరమైన విభేదాల కారణంగా వారి మధ్య సంబంధాలు బాగా లేవని చెప్పుకొన్నప్పటికీ.. అంతర్గతంగా వారి మధ్య బంధాలు దృఢంగా ఉంటాయని పలు సందర్భాలలో రుజువయ్యాయి. తాజాగా పవన్ గురించి రాంచరణ్ ప్రస్తావించి ఉద్వేగానికి లోనయ్యారు. ఇంతకి రాంచరణ్ ఏమీ మాట్లాడారంటే..

పవన్ అంటే నాకు ప్రాణం..

పవన్ అంటే నాకు ప్రాణం..

బాబాయ్ పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను బాగా ప్రేమించే వ్యక్తుల్లో ఆయన ఒకరు. నేను ఎంతగా ప్రేమిస్తానంటే నా తల్లిని ఎంతగా ప్రేమిస్తానో అంతగా ప్రేమిస్తాను. జీవితంలో నాకు స్ఫూర్తిని ఇచ్చేది మా బాబాయ్ మాత్రమే అన్నారు.

బాబాయ్ అంటే నాకు కొండంత అండ

బాబాయ్ అంటే నాకు కొండంత అండ

పవన్ కల్యాణ్ అంటే నాకు మానసికంగా ఓ బలం. ఆయన ఉన్నారంటే నాకు కొండంత అండ. బాబాయ్ నాకు మధ్య బలమైన అనుబంధం ఉంది. బాబాయ్‌కి కూడా నేను అంటే చాలా ఇష్టం అని రాంచరణ్ అన్నారు.

రంగస్థలం షూటింగ్‌లో బిజీ

రంగస్థలం షూటింగ్‌లో బిజీ

ప్రస్తుతం రాంచరణ్ నిర్మాతగా తండ్రి ఉయ్యాలవాడ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా సొంత చిత్రం రంగస్థలం 1985 సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అటు నిర్మాతగా, ఇటు నటుడిగా రెండు పడవలపై సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నారు. ఇటీవల ఆయన నిర్మించిన ఖైదీ నంబర్ 150 చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

గ్రామీణ యువకుడి పాత్రలో

గ్రామీణ యువకుడి పాత్రలో

ధ్రువ హిట్ తర్వాత ప్రస్తుతం రంగస్థలంలో విభిన్నమైన పాత్రను రాంచరణ్ పోషిస్తున్నాడు. గ్రామీణ ప్రాంత యువకుడిగా పంచెకట్టులో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

English summary
Ram Charan gets emotional while talking about his babai Pawan Kalyan. He said “I love my Babai Pawan Kalyan very much, as much as i love my mother. He is a huge source of inspiration to me, a pillar of strength to me.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu