twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వహ్వా అనేంత లేదు కానీ....(రామ్ చరణ్ ‘ధృవ’ రివ్యూ)

    రామ్‌చరణ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ‘ధృవ’ . ఈ చిత్రం ఈ రోజు రిలీజయ్యి డివైడ్ టాక్ తెచ్చుకుంది.

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది..ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరీ రీమేక్ రైట్స్ తీసుకున్నాం...మార్పులు చేర్పులు చేస్తే ఒరిజనల్ లో జరిగిన మ్యాజిక్ జరుగుతుందా..ఆ రేంజిలో హిట్ అవుతుందా అనే సందేహం ఒక ప్రక్క... వేరే భాషలో సక్సెస్ అయిన సబ్జెక్టు..మన జనాలకు నచ్చాలంటే మనవాళ్ల అభిరుచులు, నేటివిటీ ని పరిగణనలోకి తీసుకోవద్దా అనే సందేహం మరో ప్రక్క పీకుతుంది.

    దానికి తోడు ...మాతృకలో ఓకే స్దాయిలో ఉన్న హీరో చేసిన సబ్జెక్టుని మనకు స్టార్ హీరో తో రీమేక్ చేస్తే మరో సమస్య. ఇమేజ్ ప్రాబ్లం ..హీరోయిజం ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేస్తే కథ,కథనం దెబ్బ తినచ్చు. వీటిన్నటినీ దాటుకుంటూ, సమన్వయ పరుచుకుంటూ రీమేక్ సినిమా చేయటం ఛాలెంజే.

    ఆ ఛాలెంజ్ ని తన కెరీర్ లో తొలి సారి ఫేస్ చేసారు స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి. 'తని ఒరువన్’ టైటిల్ తో తమిళంలో వచ్చి ఘన విజయం సాధించిన చిత్రాన్ని ధృవ టైటిల్ తో తెలుగులో రీమేక్ చేసారు...అదీ రామ్ చరణ్ లాంటి మెగా హీరోతో, దానికి తోడు విలన్ పాత్రకే ప్రాధాన్యత ఉన్న చిత్రం ఇది. దాన్ని తెలివిగా తెలుగుకు మార్చుకోవాలి లేకపోతే ఫ్యాన్స్ హర్టవుతారు..ఫలితం తారుమారుపుతుంది. ఆ మెగా ఛాలెంజ్ లో సురేంద్ర రెడ్డి సక్సెస్ అయ్యారా...లేదా అనే విషయం చూద్దాం.

    ఎలా జరిగింది

    ఎలా జరిగింది

    ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉన్న ధృవ (రామ్ చరణ్)చాలా తెలివైన వాడు. తను పేపర్లో చదివే వార్తలకు, బయిట జరుగుతున్న ఇన్సిడెంట్స్ కు మధ్య ఉన్న లింక్ లను గుర్తించగలగిన వాడు. అంతేకాకుండా ట్రైనింగ్ లో ఉండగానే రిస్క్ చేసి, తన ఫ్రెండ్స్ తో కలిసి సీక్రెట్ గా రాత్రిళ్లు.. సిటీలో జరిగే చిన్నపాటి క్రైమ్స్ ని అరికడుతూ నేరస్థుల్ని పోలీసులకు పట్టుబడేలా చేస్తుంటారు.

    మూలం ఎవరు ..

    మూలం ఎవరు ..

    అలా వాళ్ళు కష్టపడి పోలీసులకు అప్పగించిన నేరస్తుల్లో ఒకడు చట్టంలో లొసుగులు ఆధారంగా సులభంగా తప్పించుకుని బయట తిరగడం గమనించిన ధృవ, అతని స్నేహితులు అదంతా ఎలా జరిగింది బాధపడతారు. తర్వాత కారణం అన్వేషిస్తాడు ధృవ. అసలు వీటిన్నటి వెనకే ఓ మాస్టర్ క్రిమినల్ మైండ్ ఉందని గమనిస్తాడు.

    ప్రెట్టీ క్రైమ్స్ కు కారణమైన

    ప్రెట్టీ క్రైమ్స్ కు కారణమైన

    మరో ప్రక్క ..ధృవ తాను ఎన్నాళ్లగానో రీసెర్చ్ చేస్తున్న ఒక విషయం కొలిక్కి వచ్చిందని గుర్తిస్తాడు. పైకి కనిపించే ఆ చిన్న చిన్న క్రైమ్ లు వెనక పెద్ద కుట్ర ఉందని అర్దం చేసుకుంటాడు. తన ఫ్రెండ్స్ కు దాని గురించి చెప్పి, దాన్ని సాల్వ్ చేసి ఈ చిన్న చిన్న నేరాలన్నింటికీ కారణమైన పెద్ద క్రిమినల్ ని పట్టుకోవాలన్నదే తన లక్ష్యమని చెప్పి ఆ క్రిమినల్ కోసం వెతుకుతుంటాడు.

    విలన్ ఏం చేస్తూంటాడు

    విలన్ ఏం చేస్తూంటాడు

    అలా మెయిన్ క్రిమినల్ కోసం వెతుకుతున్న ధృవకు అనుకోకుండా సిద్దార్థ అభిమన్యు (అరవింద స్వామి) అనే సైంటిస్ట్ పై అనుమానం వస్తుంది. తన అవసరాల కోసం అబిమన్యు మెడికల్ ఫీల్డ్ ని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేస్తున్నాడని అర్దం చేసుకుంటాడు. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది.. అతన్ని ఆధారాలతో అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తూండు ధృవ. యుద్దం మొదలైంది.

    పిల్లి-ఎలుక ఆట మొదలు

    పిల్లి-ఎలుక ఆట మొదలు

    ఓ పెద్ద ఫార్మా ఎంపైర్ ని నిర్వహిస్తున్న సిద్దార్ద ... ఓ ఫారిన్ ఫార్మా కంపెనీ వారు ప్రొడ్యూస్ చేసే ఓ జనరిక్ డ్రగ్ కు చెందిన కాంటాక్ట్ డీల్ పనిలో ఉంటాడు. అయితే ఆ డీల్ ని ఆపటానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారని అతనికి అర్దం అవుతుంది. తన డేగ కళ్లతో అలా తనకు అడ్డు పడుతోంది ధృవ అని తెలుసుకుంటాడు. పిల్లి-ఎలుక ఆటకు తెరలేపుతాడు. అక్కడ నుంచి ఇద్దరి తెలివైన వాళ్ల మధ్య మైండ్ గేమ్ ప్రారంభం అవుతుంది.

    ఆ తర్వాత ఏం జరిగింది

    ఆ తర్వాత ఏం జరిగింది

    పేదవారి ప్రాణాలను కాపాడటం కోసం అతి తక్కువ రేటుకే జనరిక్ మందులను అందించే అగ్రిమెంట్ ను అడ్డుకొని దేశం మొత్తం తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలనుకున్న విలన్ సిద్దార్థ్ విషయం ఎలా రివీల్ అయ్యింది. ధృవ... సిద్దార్ధ్ ను ఎలా అడ్డుకున్నాడు..? ఎంతో తెలివిగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సిద్దార్ధ్ ని ఎలా దెబ్బ తీసాడు? చివరకు ధృవ అనుకున్నది సాధించాడా..? సిద్దార్ధ్ అభిమన్యు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.

    ఆ అరగంట సేపు ..

    ఆ అరగంట సేపు ..

    ఓ సైంటిస్ట్ (అరవింద్ స్వామి)...అంత క్రూరత్వం ఉన్న విలన్ గా మారటానికి గల కారణం ఏమిటనేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అలాగే పోస్ట్ ఇంటర్వెల్ దగ్గర వచ్చే అరగంట సాగినట్లు అనిపించింది. ఆ విషయంలో మరికాస్త శ్రద్ద తీసుకోవాల్సింది.

    ఈ టాక్ తో ఏ స్దాయిలో ..

    ఈ టాక్ తో ఏ స్దాయిలో ..

    కమర్షియల్ పాయింటాఫ్ వ్యూలో ..ధృవ చిత్రం తమిళంలో నిర్మించిన బడ్జెట్ కు రెట్టింపు బడ్జెట్ తో రూపొందింది. అక్కడ ప్లస్ అయ్యిందే తక్కువ బడ్జెట్ లో రూపొంది ఎక్కవ కలెక్షన్స్ వసూలు చేయటమే కాన్సెప్టు. దాన్ని ఇక్కడ మార్చి బడ్జెట్ ని మార్చి, హై స్టాండర్డ్స్ లో నిర్మించారు. దానికి తగినట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసారు. అయితే ఇప్పుడు సినిమాకు వస్తున్న డివైడ్ టాక్ తో ఏ స్దాయి విజయం అందుకుంటుంది అనేదే పెద్ద ప్రశ్న.

    సినిమాలో మర్చిపోలేనివి ఇవీ..

    సినిమాలో మర్చిపోలేనివి ఇవీ..

    హెలెట్స్ విషయానికి వస్తే...రామ్ చరణ్ హార్డ్ వర్క్ మేజర్ హైలెట్ అని చెప్పాలి. అలాగే సినిమా అంత స్లీక్ గా రావటానికి కారణమైన గ్రాండియర్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ , సురేంద్రరెడ్డి స్టైలిష్ మేకింగ్ ని, ఫాస్ట్ నేరేషన్ కొత్త అనుభూతి ఇస్తాయి. అలాగే పాటల్లో రకుల్ ప్రీతి సింగ్ ని ఏ రేంజిలో గ్లామర్ గా ప్రెజెంట్ చేయాలో అ స్దాయిలో అదరకొట్టారు. అలాగే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అరవింద్ స్వామి స్క్రీన్ ప్రెజెన్స్ ని మర్చిపోలేం.

    అవసరం లేదు కానీ

    అవసరం లేదు కానీ

    ఇలాంటి సినిమాల్లో కామెడీని ఆశించటం పద్దతి కాదు కానీ, అలవాటు పడిపోయిన ప్రాణాలు..రిలీఫ్ కోసం...కామెడీ కోసం తపిస్తూంటాయి. తెలుగు సినిమా అంటే...కథతో,సీన్స్ తో సంభందం లేకుండా ఫైట్స్, టెన్షన్ ఎలిమెంట్స్ వచ్చాక ఖచ్చితంగా కామెడీ రావాలనే వారికి ఈ సినిమా నిరాశపరుస్తుంది. అయితే దర్శకుడు ఆ లోటుని పూడ్చాలని పోసాని తో కొంత ట్రై చేసాడు.

    సెటప్ మెల్లిగా ..

    సెటప్ మెల్లిగా ..

    ఈ సినిమాని తమిళ సినిమా స్క్రీన్ ప్లే యాజటీజ్ గా ఫాలో అయ్యిపోయారు. దాంతో ఇంటర్వెల్ వరకూ ...సెటప్ మెల్లిగా సాగుతుంది. ప్రతీ చిన్న డిటేలింగ్ కు ప్రధాన్యత ఇచ్చుకుంటూ వెళ్లారు. అంతేకాని మన రెగ్యులర్ ఫార్మెట్ లో విలన్ ని ,హీరోని ఎస్టాబ్లిష్ చేసి, వారి మద్య ఘర్షణను ఎస్టాబ్లిష్ చేసి సాగదు. మెల్లిగా కథలోకి వెళ్తారు. అదే తెలుగులోనూ ఫాలో అయ్యారు.

    ధ్రిల్లర్ ఫార్మెట్

    ధ్రిల్లర్ ఫార్మెట్

    ఈ సినిమాలో కథ కంటే స్క్రీన్ ప్లేకే పెద్దపీట. ‘నీ శత్రువుని చూసి నీ కెపాసిటీ ఏంటో అంచనా వేయొచ్చు' అనే సూత్రాన్ని నమ్మిన ఓ యువ ఐపీఎస్‌ అధికారి, బలమైన శత్రువుని ఎంచుకొని అతని ఆట కట్టించడమే ఈ సినిమా కథ. బలమైన శత్రువుని ఎదుర్కొనే క్రమమే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక సాదాసీదా కథకి, శక్తిమంతమైన స్క్రీన్ ప్లే ని జోడించారు. దీంతో ప్రతి సీన్ ఎత్తులు పైఎత్తులతో సాగి థ్రిల్స్ కలిగిస్తుంది.

    థ్రిల్స్ కోసం ..బలైంది

    థ్రిల్స్ కోసం ..బలైంది

    ఫస్టాఫ్ లో హీరో తన శత్రువుని ఎంచుకొని, అతని డెన్‌లోకి అడుగుపెట్టే సన్నివేశాలతో తీర్చిదిద్దారు. సెకండాఫ్ అంతా విలన్ కి, హీరోకి మధ్య మైండ్‌గేమ్‌తో సాగుతుంది. అయితే ధ్రిల్లర్ ఎలిమెంట్స్ ని పేర్చుకునే ప్రాసెస్ లో చాలా చోట్ల ఫీల్ మిస్సంది. అరవింద్‌ స్వామి క్యారక్టర్ ఎంటర్ అయ్యేదాకా సినిమా స్పీడు ఎత్తుకోదు.

    సురేంద్రరెడ్డి నుంచి ఊహించం

    సురేంద్రరెడ్డి నుంచి ఊహించం

    తమిళంలో హిట్ అయిన సినిమా కాబట్టి దాన్ని చెడగొట్టకూడదనో, మరేంటో తెలియదు కానీ... ఎక్కువ సీన్స్ ‘తని ఒరువన్‌'లో ఉన్నట్టుగానే మక్కీకి మక్కీ దింపేసారు దర్శకుడు. సురేంద్రరెడ్డి వంటి టాలెంటెడ్ డైరక్టర్ నుంచి ఇలాంటిది ఊహించలేం. ఆయన తరహా మార్పులు ఉంటాయనుకుంటాం. కానీ డబ్బింగ్ తరహాలో అవే సీన్స్ ఉండేటట్లు అయితే రీమేక్ ఎందుకు అనిపిస్తుంది.

    అష్టదిగ్బందనం

    అష్టదిగ్బందనం

    అయితే సురేందర్‌రెడ్డి సాంకేతికంగా సినిమాని తనదైన శైలి స్టైలిష్‌ మేకింగ్‌తో తీర్చిదిద్దారు. ‘అష్టదిగ్బంధనం' కాన్సెప్ట్‌ను బాగా ప్లాన్‌ చేశారు.దానికి థియోటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా మాత్రం మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ని చూసిన అనుభూతికి గురిచేస్తుంది.

    తగ్గిస్తే బాగుండేది

    తగ్గిస్తే బాగుండేది

    ఈ సినిమా రెండు గంటల నలభై నిముషాల రన్ టైమ్. అంత రన్ టైమ్ లో కామెడీ ట్రాక్ లేదు, పాటులు నాలుగే. సెకండాఫ్ ను ఇంకాస్త తగ్గించి మన తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టు స్పీడ్ కాస్త పెంచి ఉంటే బాగుండేదనిపిస్తుంది. అప్పటికీ రేసీ యాక్షన్ థ్రిల్లర్ కావటంతో ఇదో సమస్య గా హైలెట్ కాలేదు.

    నటుడుగా ఎదిగారు

    నటుడుగా ఎదిగారు

    ఈ సినిమా కోసం తన లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న రామ్ చరణ్, యువ ఐపీఎస్‌ అధికారి ‘ధృవ' పాత్రలో స్టైలిష్‌గా కనిపిస్తూనే ఆ పాత్రలో ఒదిగిపోయాడు. సిక్స్ ప్యాక్ బాడీతో, సరికొత్త బాడీలాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. తన గత సినిమాలతో పోలీస్తే నటుడిగాను ఈ సినిమాతో తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు. తెలివైన శత్రువుతో పోరాడే సమయంలో ఎదురయ్యే మానసిక సంఘర్షణను అద్భుతంగా చూపించాడు.

    పెద్దగా ప్రాధాన్యత లేదు

    పెద్దగా ప్రాధాన్యత లేదు

    హీరోయిన్ గా చేసిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అందంగా కనిపించింది తప్ప నటించడానికి మాత్రం పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. పరేషానురా... పాటలో ఆమె ఒంపుసొంపులు కుర్రకారుకి కిక్కెక్కించేలా ఉన్నాయి. అప్పటికీ దర్శకుడు ఆమెలోని గ్లామర్ యాంగిల్ ని బాగానే ఉపయోగించుకున్నాడు. రకుల్ ప్రాతకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా.. ఉన్నంతలో మంచి నటన కనబరించిందనే చెప్పాలి.

    ఫెరఫెక్ట్ ఎంపిక

    ఫెరఫెక్ట్ ఎంపిక

    అరవింద్‌స్వామి పాత్ర ఈ సినిమాకి కీలకం. తమిళంలోనూ ఆయనే ఈ సినిమాకు ఆయువు పట్టులా నిలిచారు. స్టైలిష్‌ విలన్‌గా చక్కగా నటించారు. సెకండాఫ్ లో ఆయనపైనే ఎక్కువ సీన్స్ ఉన్నాయి. ఎక్కడ అతి లేకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్ తో సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు.

    వీళ్లంతా తమ తమ ..

    వీళ్లంతా తమ తమ ..

    అరవింద్‌ స్వామి తండ్రిగా పోసాని కనిపిస్తారు. రామ్‌చరణ్‌ స్నేహితుల్లో ఒకరిగా నవదీప్‌ కనిపిస్తారు. తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు నవదీప్‌. సినిమాలో ఏకైక రిలీఫ్ పోసాని మాత్రమే. అందరూ కథలో బాగమయ్యారు తప్ప విడిగా కనిపించకపోవటం డైరక్టర్ గొప్పతనం.

    అద్బుతమైన విజువల్స్

    అద్బుతమైన విజువల్స్

    సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. సురేందర్‌రెడ్డి సాంకేతికంగా సినిమాని తనదైన శైలి స్టైలిష్‌ మేకింగ్‌తో తీర్చిదిద్దారు. పీ.ఎస్.వినోద్‌కు తనదైన ఫ్రేమింగ్, లైటింగ్ వాడుతూ అద్బుతమైన విజువల్స్ అందించాడనే చెప్పాలి. ముఖ్యంగా ట్రైనింగ్ సమయంలో తీసిన సీన్స్, సాంగ్స్ విషయంలో కెమరా వర్క్ చాలా బాగుంది.

    వంక పెట్టలేం

    వంక పెట్టలేం

    హిప్‌ హాప్‌ తమిళ సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి. ఎడిటింగ్ బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీని అభినందించకుండా ఉండలేం. ఇక గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కు వంక పెట్టడానికి లేదు.

    చిత్రం టీమ్ ఇదే

    చిత్రం టీమ్ ఇదే

    నటీనటులు: రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, అరవింద్‌ స్వామి, పోసాని కృష్ణమురళి, నాజర్‌, నవదీప్‌ తదితరులు.
    సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ,
    కళ: నాగేంద్ర,
    ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌,
    కూర్పు: నవీన్‌ నూలి,
    నిర్మాతలు: అల్లు అరవింద్‌, ఎన్‌.వి.ప్రసాద్‌,
    దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి.
    నిడివి: 2 గంటల 39 నిమిషాలు
    విడుదల: 9, డిసెంబర్ 2016.

    ఫైనల్ గా ...టెక్నికల్ గా చాలా ఉన్నతంగా ఉన్న ఈ సినిమా..ఇప్పటికే మాతృక అయిన తమిళ సినిమా చూసేసిన వారిని పెద్దగా ఆకట్టుకోదు. అలాగే టిపికల్ రామ్ చరణ్ మాస్ సినిమాని ఊహించుకోకుండా...వెళ్తే ఓ కొత్త చిత్రం చూసిన అనుభూతి వస్తుంది...నిరాశపరచదు.

    English summary
    Dhruva deals with routine story, but the intelligent screenplay makes it an interesting watch. The movie starts on a slow note, but the narration turns intense and fast-paced towards the interval. The second half of the film has a fast-paced narration and it is high on action quotient. The climax is good.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X