Just In
- 15 min ago
బీజేపీలో చేరిన డిస్కో డ్యాన్సర్.. ప్రధాని మోదీతో మిథున్ చక్రవర్తి కలిసి..
- 1 hr ago
జాతిరత్నాలు వెరైటీ ప్రమోషన్స్.. డైరెక్టర్ క్రేజ్ మామూలుగా లేదు!
- 1 hr ago
రాంగ్ రూట్లో వేగంగా డ్రైవింగ్.. దుల్కర్ సల్మాన్‌కు ట్రాఫిక్ కానిస్టేబుల్ షాక్!
- 1 hr ago
RRR కోసం అమెరికా నుంచి 40 మంది: ఎన్టీఆర్, చరణ్‌కు చెమటలు పట్టిస్తారట
Don't Miss!
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- News
viral video: బాలుణ్ని మింగిన భారీ మొసలి -దాన్ని బంధించి, పొట్ట చీల్చి చూడగా...
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'రౌడీ' ఫాదర్ (రివ్యూ)
ఎన్ని ఫ్లాఫ్స్ ఇచ్చినా సాంకేతికంగా ఉన్నతంగా ఉండే రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే ఎప్పుడూ క్రేజే...అందులోనూ యాక్షన్ చిత్రం,అదీ ఈ మధ్య కాలంలో ఫామ్ లో లేని మోహన్ బాబుని ప్రధాన పాత్రలో పెట్టి అనేది అంతకు మించిన ఆసక్తికరమైన అంశం. అయితే వర్మ ఎంత చేసినా, ఏం చెప్పినా యాక్షన్ సినిమా అంటే ఆ గాడ్ ఫాధర్ ని, హర్రర్ సినిమా అంటే ఎగ్జారిస్ట్ ని వదిలిరాడుగా...ఈ సారి కూడా మోహన్ బాబుని గాడ్ ఫాధర్ లాగే చూపించి ఉంటాడు..అంతకు మించి ఏముంటుంది అనే విమర్శలు సైతం వినిపించాయి. అయితే వర్మ అలాంటి విమర్శలు పట్టించుకునే రకం అసలు కాదు...మీరెంత అనుకున్నా నేను గాడ్ ఫాధర్ కే ఫిక్స్ అయిపోయాను అంటూ అదే పాత్రను కొంచెం అటూ మార్చి రాయలసీమ ఫ్యాక్షనిజం లో పెట్టి దింపాడు.
అయితే వర్మ స్టైల్ ఆఫ్ మేకింగ్ (కొన్ని విజువల్స్ ఆయన గత చిత్రాల్లో వే మళ్లీ చూపించినా) మాత్రం సినిమాకు హైలెట్ గా నిలిచింది. అయితే మేకింగ్ చూడటం కోసం ఎంత మంది సినిమాకు వెళ్తారన్నది ప్రశ్న. అలాగే మోహన్ బాబు చాలా కాలం తర్వాత ( పెద రాయుడు, రాయలసీమ రామన్న చౌదరి, ఎమ్.ధర్మరాజు ఎమ్.ఎ తర్వాత) పవర్ ఫుల్ పాత్రలో సీరియస్ టోన్ తో అన్నగా చూపించటం బాగుంది. మంచు విష్ణు గురించి ప్రీ రిలీజ్ లోచెప్పినంత సీన్ మాత్రం లేదు.
అలాగే పరమ రొటీన్ అనిపించే కథ,కథనం, వర్మ పాత సినిమాల్లో కనిపించే డార్క్ మూడ్ సీన్స్ అలాగే కంటిన్యూ అవటం ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఏమీ జరిగినట్లు అనిపించదు. ఏ ఎమోషన్ పెద్దగా రిజిస్టర్ కాదు. అలాగే ప్రస్తుతం తెలుగులో ట్రెండ్ నడుస్తున్న వినోదానికి సినిమాలో కొంచెం కూడా స్ధానం ఇవ్వలేదు. ఇప్పటికే ఎన్నో హై యాక్షన్ తెలుగు సినిమా సన్నివేశాలకు అలవాటు పడిన వారికి ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఎంతవరకూ కిక్కు ఇస్తాయనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది.
అన్న (మోహన్ బాబు) రాయల సీమలో సమాంతర ప్రభుత్వం నడుపుతున్న ఓ లీడర్...పెద్ద దిక్కు. ఆ ప్రాంతంలో తన చెప్పిదే చట్టం..తన మాటే వేదవాక్కు. పొలిటికల్ లీడర్స్, అఫిషియల్స్ ఎందరో ఆయన పనులు చేసి పెడుతూంటారు. అక్కడ జనం చేత దేముడిలా పూజింపబడే ఆయనకు ఇంట్లోనే సమస్య ఎదురౌతుంది. తన ఆశయానికి,ఆకాంక్షలకు ఆయన పెద్ద కొడుకు(భూషణ్) అడ్డం తగులుతూంటాడు. దీన్ని గుర్తించిన అయితే ఆయన శతృవులు(వేదాంతం మూర్తి, జీవా) భూషన్ ని ప్రయోగించి ఆయన్ని దెబ్బ కొట్టాలనుకుంటారు. ఆ సమయంలో చిన్న కొడుకు కృష్ణ (మంచు విష్ణు) పరిస్దితులని చేతులోకి తీసుకుని వారి ప్లాన్ లను ఎలా తిప్పి కొట్టాడు..అన్న సామ్రాజ్యానికి అసలైన వారసుడుగా ఎలా ఎదిగాడు అనేది మిగతా కథ.
విశ్లేషణతో కూడిన మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

హైలెట్...
ఈ మధ్య కాలంలో కామెడీ మూసలో కొట్టుకుపోతున్న మోహన్ బాబు... చాలా కాలా తర్వాత తన నటన, డైలాగులతో అదరకొట్టాడనే చెప్పాలి. ఆయన మాడ్యూలేషన్, బాడీ లాంగ్వేజ్ ఆయన్ని మొదటి వరసలో నిలబెట్టాయి. ధియోటర్ లో ఆయన డైలాగ్స్ కు మంచి స్పందన వస్తోంది. మంచు మనోజ్ పాత్ర అయితే అతని బాడీ లాంగ్వేజ్ ని గమనించి డిజైన్ చేసినట్లుంది కాబట్టి ఎక్కడా అతి అనిపించదు.

సెకండాఫ్ ఇబ్బంది
ఈ మధ్య కాలంలోవర్మ సినిమాలన్నీ ఎదుర్కొంటున్న సమస్యే ఈ సినిమాను ఎదుర్కొంది. ఫస్టాఫ్ లో ఉన్నంత ఉద్వేగం,సెకండాఫ్ కి వచ్చే సరికి మిస్సై పోతోంది. అలాగే దాదాపు ఫస్టాఫ్ లో ఉన్న ఎమోషనల్ కంటెంటే సెకండాఫ్ లోనూ రిపీట్ అవుతూ విసిగిస్తూ వస్తోంది. దాంతో ద్వితియార్దం లో ఏమీ జరిగిన ఫీల్ రావటం లేదు. అదే ఈ తెలుగు సర్కార్ సైతం ఎదుర్కొంది.

ప్రెడిక్టుబుల్ ...
మొదటే చెప్పుకున్నట్లు ఇది పూర్తిగా వర్మ మేకింగ్ మీద ఆధారపడ్డ గాడ్ ఫాధర్ లేదా సర్కార్ కి ఇంకో వెర్షన్ మాత్రమే. కథ మనం ఊహించినట్లే వెళ్తూ, అలాగే అన్నకు ఆయన కొడుకే వారసుడు అని చెప్తూ ముగుస్తుంది. వర్మ సినిమాల్లో ఉండే సీరియస్ డ్రామా ఇందులోనూ కొనసాగింది. సర్కార్ చిత్రం ఆ రేంజి విజయం సాధించటానికి నేషనల్ మార్కెట్ చాలా వరకూ తోర్పడింది. అలా స్లో నేరషన్, కేవలం విజువల్స్ మీదే డ్రామా నడపటం అనేది మన తెలుగులో చాలా తక్కువ. కాబట్టి ఇది కేవలం ఎ క్లాస్ ప్రేక్షకులకు మాత్రమే ఎక్కే నేరేషన్ అనిపిస్తుంది. వారంతా ఈ గాడ్ ఫాధర్, సర్కార్, సర్కార్ రాజ్ చూసేసి ఉన్నారు

అదే ప్లస్...అదే మైనస్
గాఢ్ పాధర్ ని బేస్ గా తీసుకుని కథ చేసినప్పుడు వర్మ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఎందుకంటే గాఢ్ పాధర్ లో ఫెరపెక్ట్ స్ట్రక్చర్ లో భావోద్వేగాలు డిజైన్ చేయబడి ఉండటం కావచ్చు. ఆ డిజైన్ లో కథ అల్లుకున్నప్పుడు రొటీన్ కథ అనిపించవచ్చు కానీ ఎమోషన్స్ పరంగా ఎక్కడా అసంతృప్తి ఎదురుకాదు. అయితే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సినిమాలో అతి పెద్ద ఎమోషన్ అయిన రౌడీ పాత్ర మరణం అనేది పెద్దగా వర్కవుట్ కాలేదనిపిస్తుంది. అలాగే మంచు విష్ణు మొదటి సీన్ నుంచి ఏదైతే ఎక్సపెక్ట్ చేస్తామో అదే జరుగుతూ వస్తుంది. అదే ప్లస్..అదే ఈ సినిమాకు మైనస్.

అదీ వర్మ లెక్క...
వర్మ సినిమాలకు ఫెయిలైనా ఆయన అభిమానులు ఇప్పటికీ ఉండటానికి కారణం ఆయన తనదైన శైలిలో ఎప్పుడూ విజువల్స్ పరంగా చేసే ప్రయోగాలు, మేకింగ్ స్టైలే కారణం. అది ఈ సినిమాలో చాలా చోట్ల కనపడుతుంది. అయితే అది కొన్ని చోట్ల అతిగానూ అనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన ఎంచుకున్న బిజిఎం మాత్రం చాలా సార్లు ఇరిటేట్ చేస్తుంది.

కీ రోల్స్
వర్మ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే తణికెళ్ల భరణి ఈ సారి కూడా తన దైన శైలిలో విజృంభించాడనే చెప్పాలి. వేదాంతం మూర్తిగా ఆయన విలనిజం బాగుంది. అలాగే కన్నడ నటుడు కిషోర్ కూడా తెలుగుకి మంచి విలన్ దొరికాడనిపించేలా పాత్ర డిజైన్ చేసారు. అతనికి ఇక్కడ వరస ఆఫర్స్ వచ్చే అవకాసం ఉంది.

ఛాయాగ్రహణం
వర్మ సినిమాల్లో పనిచేసే కెమెరామెన్స్ ఆయన విజన్ ఆధారంగా చేసుకుంటూ పోతుంటారు కాబట్టి ప్రత్యేకంగా ఇతను అద్బుతంగా చేసాడు అని చెప్పలేం. ఆయన చెప్పినట్లు అద్బుతంగా విజువల్స్ పట్టుకున్నాడు అని చెప్పుకోవాలి. టోటల్ గా కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఛేజ్ సన్నివేశం చాలా బాగా కాప్చర్ చేసారు.

హీరోయిన్...
హీరోయిన్ గా శాన్వికి తనేంటో చూపించుకోవటానికి పెద్దగా అవకాసం లేని సినిమా ఇది. వర్మతో సినిమా చేసాను అని చెప్పుకోవటానికి తప్ప ఈ సినిమా ఆమెకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు.

సంగీతం
ఈ సినిమా ఆడియో పెద్దగా వర్కవుట్ కాలేదు. అదే తెరపైనా కనిపించింది. పాటలు సినిమాకు అడ్డంగా నిలిచాయి తప్పు ఫలితం లేదు. మోహన్ బాబు పాత్రను హైలెట్ చేస్తూ తీసిన పాట మాత్రం బాగుంది. జయసుధ, మోహన్ బాబు సాంగ్ పెట్టకుండా ఉంటే బాగుండేది.

డైలాగులు,ఎడిటింగ్
ఈ సినిమాకు డైలాగులు గంగోత్రి విశ్వనాథ్ చేత రాయించారు. ఆహా,ఓహో అనిపించేలా లేకపోయినా పాత్రకు తగినట్లు బాగున్నాయి. ఎడిటింగ్ కొన్ని చోట్ల బాగా స్లో అనిపిస్తే మరికొన్ని చోట్లు విషయం రిజిస్టర్ కాకుండా పోతుంది.

నిర్మాణ విలువలు
తక్కువ రోజుల్లో వర్మ దీన్ని ఫినిష్ చేయటంతో లిమిటెడ్ బడ్జెట్ లో తీసినా ఆ తేడా కనపడదు. అలాగే వర్మ మేకింగ్ తో సినిమా ఆద్యంతం రిచ్ లుక్ తో కనపడుతుంది.

ఎవరెవరు
బ్యానర్: 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ, ఎవి పిక్చర్స్
నటీనటులు:మోహన్ బాబు, మంచు విష్ణు, శాన్వి, జయసుధ, తణికెళ్ళ భరణి తదితరులు.
సంగీతం: సాయికార్తీక్,
మాటలు: గంగోత్రి విశ్వనాథ్,
కెమెరా: సతీష్ ముత్యాల,
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు: పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్
మోహన్ బాబు అభిమానులు, వర్మ అభిమానులుకు నచ్చే ఈ సినిమా సర్కార్ ని, గాడ్ ఫాధర్ ని మర్చిపోయి చూస్తే బాగుందనిపిస్తుంది. బి,సి సెంటర్లు ఎలా ఉన్నా ఎ సెంటర్ వారిని ఆకర్షించే అవకాసం ఉంది.
(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)