twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RGV's దెయ్యం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: రాజశేఖర్, స్వాతి దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ
    Director: రాం గోపాల్ వర్మ

    దర్శకత్వం: రాం గోపాల్ వర్మ
    నిర్మాతలు: జీవిత రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్
    బ్యానర్: నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పెగాసస్ సినీ కార్ప్ యల్ యల్ పి
    లైన్ నిర్మాతలు: కొమ్మురి ప్రేమ్‌సాగర్, జె సాయి కార్తీక్ గౌడ్
    ఎడిటర్: సత్య, అన్వర్
    డీవోపీ: సతీష్ ముత్యాల
    సంగీతం: డీఎస్ఆర్
    ప్రొడక్షన్ ఇంచార్జ్: కె రూపేష్
    రిలీజ్ డేట్: 2021-04-16

    దెయ్యం మూవీ కథ ఏంటంటే..

    దెయ్యం మూవీ కథ ఏంటంటే..

    మెకానిక్ గ్యారేజ్‌ను నడిపే శంకర్ (రాజశేఖర్) కూతురైన విజయ అలియాస్ విజ్జి (స్వాతి దీక్షిత్) కాలేజ్ స్టూడెంట్. శంకర్ జీవితం సక్రమంగా సాగుతున్న సమయంలో విజ్జి శరీరంలోకి గురు అనే వ్యక్తి ఆత్మ ప్రవేశిస్తుంది. దాంతో శంకర్ కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఈ క్రమంలో విజ్జి రూపంలో ఉన్న గురు పలు హత్యలకు పాల్పడుతుంటాడు.

    దెయ్యం మూవీలో ట్విస్టులు

    దెయ్యం మూవీలో ట్విస్టులు

    విజ్జి శరీరంలోకి గురు ఆత్మ ఎందుకు ప్రవేశించింది. తన శరీరంలోకి ఆత్మ ప్రవేశించిన తర్వాత విజ్జి చేసిన వీరంగం ఏమిటి? విజ్జి మానసిక పరిస్థితిని చూస్తూ శంకర్ అనుభవించిన మనోవేదన ఏమిటి? విజ్జి శరీరంలో చేరిన దెయ్యాన్ని బయటకు పంపించడానికి శంకర్ ఎలాంటి పాట్లు పడ్డాడు. చివరకు విజ్జి శరీరాన్ని దెయ్యం రూపంలో ఉన్న గురు వదిలాడా? విజ్జి రూపంలో ఉన్న దెయ్యం తన పగ, ప్రతీకారాన్ని ఎలా తీర్చుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే రాంగోపాల్ వర్మ రూపొందించిన దెయ్యం కథ.

    మూవీ ఎలా ఉందంటే.. .

    మూవీ ఎలా ఉందంటే.. .

    దెయ్యం కథలతో వచ్చే సినిమాల్లో ప్రధానంగా పగ, ప్రతీకారం అనే అంశాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిమితులతో ఉన్న సినిమాలో దర్శకుడు రాసుకొనే సీన్లు, డైలాగ్స్, నటీనటుల హావభావాలే ప్రేక్షకుడిని ఆకట్టుకొనేందుకు కీలక పాత్రను పోషిస్తాయి. దెయ్యం విషయానికి వస్తే ఇలాంటి పరిమితులను దాటేందుకు ప్రయత్నాలు చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఆ ప్రయత్నాలు పూర్తిగా సఫలమయ్యాయా అనే ప్రశ్నార్థకంగానే కనిపిస్తాయి. కాకపోతే ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా సెకండాఫ్‌ను నడిపించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఏడేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయడం వల్ల ఉండే లొసుగులు అన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి.

    రాంగోపాల్ వర్మ టేకింగ్

    రాంగోపాల్ వర్మ టేకింగ్

    ఇక దర్శకుడు రాంగోపాల్ వర్మ తనకు కొట్టిన పిండిలా ఉండే హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆయన రెగ్యులర్‌గా అనుసరించే రొటీన్ అంశాలతోనే నేల విడిచి సాము చేసేందుకు ప్రయత్నించాడనిపిస్తుంది. ఈసారైనా రాము నుంచి కొత్తదనం ఆశిస్తూ వెళ్లే ప్రేక్షకులకు పూర్తిస్థాయి సంతృప్తి లభించదు. కాకపోతే కొంత మేరకు థ్రిల్‌ ఫీలయ్యే అవకాశం లభిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు బాగున్నాయని అనిపిస్తుంది. స్వాతి దీక్షిత్‌తో ఒకే ఎక్స్‌ప్రెషన్‌‌తో సినిమా అంతా నడిపించి ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించిన తీరు అభినందనీయం.

    రాజశేఖర్ పెర్ఫార్మెన్స్

    రాజశేఖర్ పెర్ఫార్మెన్స్

    శంకర్‌గా రాజశేఖర్ తన వంతుగా ఆ పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. తాను అత్యంత ఇష్టంగా, ప్రేమించే కూతురుకు ఎదురైన సమస్యను చూసి పరితపించే పాత్రలో మెప్పించారని చెప్పవచ్చు. అయితే స్క్రిప్టులో ఉండే లోపాల కారణంగా పూర్తిస్థాయిలో విజృంభించలేకపోయారని చెప్పవచ్చు. ఓవరాల్‌గా రాజశేఖర్ స్థాయికి తగిన పాత్ర అని చెప్పడం కొంత కష్టమే.

    స్వాతి దీక్షిత్ యాక్టింగ్

    స్వాతి దీక్షిత్ యాక్టింగ్

    విజయగా స్వాతి దీక్షిత్ తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్లో తన హావభావాలతో ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. వైవిధ్యం ప్రదర్శించడానికి పాత్రలో స్కోప్ లేకపోవడం వల్ల పెద్దగా తన ప్రతిభను చాటుకోవడానికి అవకాశం లభించలేదని చెప్పవచ్చు. ఒకట్రెండు ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమాను లాగించాల్సి రావడం ఆ పాత్రకు ఉండే పరిమితులే కారణమని చెప్పవచ్చు.

    సాంకేతిక అంశాలు..

    సాంకేతిక అంశాలు..

    దెయ్యం సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి పలు సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాయి. లైటింగ్, ఎడిటింగ్ అంశాలు సినిమాపై ఆసక్తిని కలిగించేలా చేశాయి. సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం స్థాయిలో ఉన్నాయి. కథ, కథనాల విషయంలో మరింత జాగ్రత పడి ఉంటే ఈ బ్యానర్‌లో ఓ మంచి చిత్రంగా మిగిలి ఉండేదని చెప్పవచ్చు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా


    రాంగోపాల్ వర్మ సినిమాలను, హారర్, థ్రిల్లర్ సినిమాలను ఎంజాయ్ చేసే వారికి దెయ్యం మూవీ తప్పకుండా నచ్చుతుంది. కారణాలేమిటో తెలియదు గానీ.. పలు ప్రశ్నలు ప్రేక్షకుడిని వెంటాడే విధంగా ఉంటాయి. గురుకు జరిగిన అన్యాయం ఏమిటి? రాజశేఖర్ జీవితంలో సుమతి పాత్ర ఏమిటి? రాజశేఖర్‌కు స్వాతి దీక్షిత్ రెండో భార్య కూతురా లాంటి విషయాలు ప్రేక్షకుడిని కన్‌ఫ్యూజ్ చేసేలా ఉన్నాయి. ఏదిఏమైనా ఇలాంటి జోనర్‌ను ఇష్టపడేవారికి వారాంతంలో థియేటర్‌లో ఎంజాయ్ చేసే సినిమా దెయ్యం అని చెప్పవచ్చు. బీ,సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే అంశాలు పుష్కలంగానే ఉన్నాయి.

    Recommended Video

    RGV's Deyyam Teaser Starring Rajashekar
    దెయ్యం

    దెయ్యం

    రాంగోపాల్ వర్మ సినిమాలను, హారర్, థ్రిల్లర్ సినిమాలను ఎంజాయ్ చేసే వారికి దెయ్యం మూవీ తప్పకుండా నచ్చుతుంది. కారణాలేమిటో తెలియదు గానీ.. పలు ప్రశ్నలు ప్రేక్షకుడిని వెంటాడే విధంగా ఉంటాయి.

    English summary
    Deyyam movie written and directed by Ram Gopal Varma. The film stars Rajasekhar and Swati Dixit in pivotal roles. This film has released in April 16, 2021. In this occassion, Telugu filmibeat brings exclusive review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X