Ram Nagar Bunny Movie Review: రామ్ నగర్ బన్నీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: చంద్రహాస్, విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర, మురళీధర్, సలీమ్ ఫేకు, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని, తదితరులు
నిర్మాతలు: మళయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్)
సినిమాటోగ్రఫీ: అష్కర్ అలీ
మ్యూజిక్ డైరెక్టర్: అశ్విన్ హేమంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్
ఆర్ట్ డైరెక్టర్: రాజశేఖర్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సమర్పణ: దివిజ ప్రభాకర్
రిలీజ్ డేట్: 2024-10-04
రామ్ నగర్‌లో ఉండే ఆటో డ్రైవర్ (మురళీధర్ గౌడ్) కొడుకు బన్నీ (చంద్రహాస్)కు ఎలాంటి బాధ్యత లేకుండా ఫ్రెండ్స్‌తో జులాయిగా తీరుగుతూ లైఫ్‌ను జాలీగా ఎంజాయ్ చేస్తుంటాడు. జీవితంలో అమ్మాయిపై ఒకేసారి ప్రేమ పుడుతుందనే పాయింట్‌కు వ్యతిరేకి అయిన కనిపించిన అమ్మాయిపై మనసు పారేసుకొంటుంటాడు. అయితే తనను ప్రేమించే శైలు (విస్మయ శ్రీ)ని పట్టించుకోడు. కానీ దీపు (రిచా జోషి)ను ప్రేమిస్తాడు. ఆ తర్వాత నైనాను (అంబికా వాణి)ని అమితంగా ఇష్టపడితే.. ఆ యువతి వేరే వ్యక్తితో రిలేషన్ పెట్టుకొని బన్నీకి హ్యాండిస్తుంది. ఆ క్రమంలో తార (రీతూ మంత్ర) వివాహితతో దగ్గర అవుతాడు.

తనను ప్రేమించే శైలును పట్టించుకోకుండా ఇతరులపై బన్నీ ఎందుకు దృష్టిపెట్టాడు. దీపును ప్రేమించి.. ఆ తర్వాత నైనాపై ఎందుకు మోజు పెంచుకొన్నాడు? తన చెల్లెలి పెళ్లి కోసం దాచిన 6 లక్షలను ఇంట్లో నుంచి ఎందుకు దొంగిలించాడు? ఆరు లక్షలు ఖర్చు చేసిన తర్వాత నైనా ఎలా హ్యాండిచ్చింది. తారా ఆంటీతో రిలేషన్ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? అప్పటికే ఎంగేజ్‌మెంట్ అయిన శైలుకు తన మీద ప్రేమ ఉందని తెలిసిన బన్నీ ఏం చేశాడు? తారాను ఎలా వదిలించుకొన్నాడు? శైలు, బన్నీ చివరకు ఒక్కటయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానం రామ్ నగర్ బన్నీ సినిమా కథ.
వెలిగొండ శ్రీనివాస్ రాసుకొన్న కథలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. పవన్ కల్యాణ్ తమ్ముడు, ఇతర లవ్ స్టోరీలను పోలిన అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ స్టోరీలో కొత్తదనం లేకపోయినా.. ప్రతీ సన్నివేశాన్ని చంద్రహాస్ తనదైన రీతిలో ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. చంద్రహాస్‌ను చూస్తే.. తొలి చిత్ర హీరోగా ఎక్కడా అనిపించడు. మంచి ఈజ్‌తో ఫైట్స్, డ్యాన్సులు మాత్రమే చేయకుండా.. డైలాగ్ డెలీవరీతోను ఆకట్టుకొన్నాడు. దాంతో వెలిగొండ శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ మహత్ రాసుకొన్న కథకు పూర్తిగా న్యాయం చేశాడు.

సినిమా రిలీజ్‌కు ముందే యాటిట్యూడ్ స్టార్ అని పేరు తెచ్చుకొన్న చంద్రహాస్.. తన పాత్రకు తగినట్టు యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌ను చక్కగా చూపించి ఆకట్టుకొన్నాడు. ఇక శైలుగా విస్మయ శ్రీ, దీపుగా రిచా జోషి, నైనాగా అంబికా వాణి, తారగా రీతూ తమ పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. మురళీధర్ గౌడ్ మధ్య తరగతి తండ్రిగా తన మార్క్ చూపించారు. సలీం ఫేక్ ఉన్నత సేపు ఫన్ క్రియేట్ చేశాడు.
ఈ సినిమాకు అష్కర్ ఆలీ సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణ. అశ్విన్ హేమంత పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. దివిజ ప్రభాకర్, మలయజ ప్రభాకర్, ఈటీవీ ప్రభాకర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కొన్ని సీన్లు అవసరం లేకున్నా.. లేంగ్తీగా ఉన్నాయి. వాటి నిడివి తగ్గించుకొని ఉండే ఈ సినిమాలో స్పీడ్ కనిపించేదనిపిస్తుంది.

రామ్ నగర్ బన్నీ సినిమా విషయానికి వస్తే.. రెగ్యులర్, యూత్‌పుల్ ఎంటర్‌టైనర్. ఓ కొత్త హీరో తనకు తాను నిరూపించుకోవడానికి ఏవైతే అంశాలు కావాలో అలాంటి ఎలిమెంట్స్‌తో చక్కగా రూపొందించారు. అన్ని అంశాల్లో చంద్రహాస్ రాణించి.. ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకొన్నాడనే చెప్పాలి. మంచి కథ పడితే.. హీరోగా సెటిల్ అయ్యేందుకు ఎక్కువగా ఛాన్స్ ఉంది. తదుపరి సినిమాను బట్టి చంద్రహాస్ కెరీర్ ఎలా ఉంటుందనేది డిసైడ్ అవుతుంది. మాస్ ఆడియెన్స్ కిక్కించే సినిమా రామ్ నగర్ బన్నీ.


Click it and Unblock the Notifications











