Ram Nagar Bunny Twitter Review: రామ్ నగర్ బన్నీ ట్విట్టర్ రివ్యూ
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన సినిమా రామ్ నగర్ బన్నీ. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు.
శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహించారు. అక్టోబర్ 4వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాల్లోకి వెళితే..

నన్ను ట్రోల్ చేసే వారి గురించి ఇప్పటికే నా అభిప్రాయం చెప్పాను. ట్రోల్స్ వల్ల నేను పెద్దగా బాధపడలేదు. వాటిని పాజిటివ్ గా తీసుకున్నా. నేను సినిమాలు చేసేది నన్ను ఇష్టపడే ప్రేక్షకుల కోసం. వారికి నా నటన నచ్చితే చాలు అనుకుంటున్నా. మా మూవీకి అశ్విన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అతను అనిరుధ్ లా గుర్తింపు తెచ్చుకుంటాడని చెప్పగలను అని చంద్రహాస్ అన్నాడు.
చంద్రహాస్ ఆటిట్యూడ్ స్టార్ కాదు. పూర్తిగా విశ్వాసాన్ని ప్రదర్శించే యాక్టర్. ఈ సినిమా అతడికి మంచి సక్సెస్ లభించేలా చేస్తుందని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ చంద్రహాస్ , ఈటీవీ ప్రభాకర్ అని నెటిజన్లు విషెస్ అందజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











