Rama Banam Review కమర్షియల్ ఫార్మాట్‌తో సాగే క్లీన్ ఫ్యామిలీ డ్రామా.. బ్రొమాన్స్ వర్కవుట్ అయిందా?
Rating: 2.75/5
నటీనటులు: గోపిచంద్, జగపతిబాబు, కుష్బూ, డింపుల్ హయతి, నాజర్, సచిన్ ఖేడ్కర్, ఆలీ, వెన్నెల కిషోర్, తరుణ్ అరోరా, గెటప్ శ్రీను, సత్య, రాజా రవీంద్ర, సప్తగిరి తదితరులు
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల
దర్శకత్వం: శ్రీ వాసు
కథ: భూపతి రాజా
డైలాగ్స్: మధుసూదన్ పద్మావతి
మ్యూజిక్: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫి: వెట్రి పళనిస్వామి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్టంట్స్: రవి వర్మ
రిలీజ్ డేట్: 2023-05-05
రామబాణం కథ ఏమిటంటే?:కుటుంబ విలువలకు, నీతి నియమాలకు కట్టుబడే రాజారాం (జగపతి బాబు) హోటల్ బిజినెస్ నిర్వహిస్తూ ఆర్గానిక్ ఫుడ్ పెడుతుంటాడు. వ్యాపారంలో పోటీని తట్టుకోలేక పాపారావు (నాజర్) అధికారులతో చేతులు కలిపి సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే రాజారాం సోదరుడు విక్కీ ( గోపిచంద్) ఓ త్రీవమైన చర్యకు పాల్పడుతాడు. దాంతో విక్కీని రాజారాం మందలిస్తాడు. ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చిన మంచి దారినే నడువాలని కోపగించుకొంటాడు. అయితే అన్నయ్య దారిలో నడవడం ఇష్టం లేక ఇంటి నుంచి విక్కీ చిన్నతనంలో పారిపోతాడు. అలా కలకత్తాకు పారిపోయిన విక్కీ 14 ఏళ్ల తర్వాత మళ్లీ సొంత ఇంటికి వస్తాడు.

రామబాణం కథలో ట్విస్టులు:రాజారాంకు పాపారావు ఇబ్బంది పెడితే విక్కీ తీసుకొన్న నిర్ణయం ఏమిటి? విక్కినీ ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇంటి నుంచి కోల్ కత్తాకు పారిపోయిన విక్కీ ఎలాంటి జీవితాన్ని లీడ్ చేశాడు. కోల్‌కత్తాలో భైరవి (డింపుల్ హయతి)తో ప్రేమ కథ ఎలా సాగింది? కోల్ కతాలో ముఖర్జీ అనే మాఫియా డాన్‌తో జరిగిన గొడవలు ఏంటి? కోల్‌కతా నుంచి విక్కీ ఎందుకు ఇంటికి వచ్చాడు? 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన విక్కీని రాజారాం కుటుంబ సభ్యులు ఎలా రిసీవ్ చేసుకొన్నాడు. రాజారాంను కష్టాల్లో పడేసిన పాపారావు, పాపారావు (తరుణ్ అరోరా)ను ఎలా ఎదిరించాడు. తన కుటుంబానికి ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించాడు అనే ప్రశ్నలకు సమాధానమే రామబాణం సినిమా కథ.

రామబాణం ఎలా సాగింది?:విక్కీ ఫ్యామిలీ జీవించే విధానాన్నిఎమోషనల్ సన్నివేశాలతో ఆలస్యం చేయకుండా దర్శకుడు శ్రీ వాస్ నేరుగా కథలోకి తీసుకెళ్లాడు. కోల్‌కత్తాలో విక్కీ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసి.. చకచకా భైరవితో పాటలు, ప్రేమ కథను పూర్తి చేశాడు. మళ్లీ చిన్న ట్విస్టుతో విక్కీని తన ఫ్యామిలీ వద్దకు చేర్చి కథను భావోద్వేగంగా మలిచే ప్రయత్నం చేశాడు. అయితే కథ ఎమోషనల్ రైడ్‌కు సిద్దమైన ప్రతీసారి వెన్నెల కిషోర్ కామెడీ బ్రేక్ వేసినట్టు అనిపిస్తుంది. జీకేతో ఫ్యామిలీ వైరాన్ని మెయిన్ ప్లాట్‌గా చేసి కథ నడిపించే ప్రయత్నం చేశాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌తో కథలో మాస్ ఎలిమెంట్స్ జొప్పించిన విధానం బాగుంది. కాకపోతే రొటీన్, రెగ్యులర్ సన్నివేశాలతో కొత్తదనం కనిపించదు. ఈ సినిమా ఎమోషనల్ రైడ్‌పై అధారపడటం వల్ల క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అందించే ప్రయత్నం చేశారు.

దర్శకుడి టేకింగ్ గురించి:అన్నదమ్ముల కథ అనగానే ఇద్దరి మధ్య కాన్‌ఫ్లిక్ట్‌తో స్టోరీలు నడుస్తాయి. కానీ కోల్‌కతా ఎపిసోడ్‌తో సినిమాను మాస్, క్లాస్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు శ్రీవాసు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు డైలాగ్స్ బలంగా మార్చడంలో దర్శకుడు అనుసరించిన తీరు బాగుంది. డైలాగ్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాయని చెప్పవచ్చు. బ్రొమాన్స్ బ్యాక్ డ్రాప్‌తో పక్కా కమర్షియల్ మూవీగా రూపొందించడంలో శ్రీవాసు తన మార్క్ చాటుకొన్నాడు. ఇంటర్వెల్‌కు ముందు ఎపిసోడ్ బాగుంటుంది. కానీ కథాపరంగా ఇష్యూస్ ఇంపాక్ట్‌గా ఉండవు. మూస తరహాలో కథను సాగించడం కొత్త మైనస్ అనిపిస్తుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి:విక్కీగా గోపిచంద్ చేసిన క్యారెక్టర్‌లో పలు రకాల వేరియేషన్స్ కనిపిస్తాయి. మాస్, క్లాస్ కలబోసిన క్యారెక్టర్‌తో కొన్ని సన్నివేశాల్లో చెలరేగిపోయాడు. ఫైట్స్, లవ్ ట్రాక్‌లో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌ను మెయింటెన్ చేశాడు. ఫ్యామిలీ ఎసిసోడ్‌లో మంచి ఎమోషన్స్ పలికించాడు. ఇక జగపతి బాబు మరోసారి హుందాగా ఉండే పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా మొత్తం కామ్ అండ్ కంట్రోల్‌గా బిహేవ్ చేసిన ఆయన క్లైమాక్స్‌లో మాస్ ఎలిమెంట్స్‌తో అరిపించాడు. కుష్బు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. డింపుల్ హయతీకి పెర్ఫార్మెన్స్ పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఏమీ చేయలేక గ్లామర్‌కే పరిమితమైంది. తరుణ్ అరోరా, నాజర్ రెగ్యులర్, రొటీన్ మాస్ ఎలిమెంట్స్‌తో ఫర్వాలేదనిపించారు. కమెడియన్లందరూ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. సత్య, గెటప్ శ్రీను, సప్తగిరి కాసేపు నవ్విస్తారు.

సాంకేతిక నిపుణుల గురించి:రామబాణం సినిమాలో తెర వెనుక విషయాలకు వస్తే.. ఈ సినిమాకు మధుసూదన్, అబ్బూరి రవి అందించిన డైలాగ్స్ బాగున్నాయి. ఈ సినిమా వరకు మాటలు చాలా సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. ుఇక సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. తెరను కలర్‌పుల్‌గా చూపించడంతోపాటు మంచి ఫీల్‌ను కలిగించాడు. ఆర్ట్ విభాగం వర్క్ చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు సీన్‌లో వాడిన కలర్ ప్యాలెట్ బాగుంది. మాస్ ఎలిమెంట్స్, కమర్సియల్ సినిమాకు కావాల్సిన ఫైట్స్‌ను బాగా డిజైన్ చేశారు. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు బాగుంది.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?:కుటుంబ విలువలు, ఉమ్మడి కుటుంబం, ఆర్గానిక్ ఫుడ్ అనే కాన్సెప్ట్‌తో లవ్, యాక్షన్, అన్నదమ్ముల అనుబంధాలు బ్యాక్ డ్రాప్‌గా రామబాణం తెరకెక్కింది. ప్రస్తుతం వస్తున్న సినిమాల మధ్య ఈ చిత్రం అవుట్ డేటేడ్ కథగా అనిపిస్తుంది. కాకపోతే జగపతి బాబు, గోపిచంద్ బాండింగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. కుష్బూ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. డింపుల్ హయతి గ్లామర్ పరంగా ఒకే అనిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూశామని ఫీలింగ్ కలుగుతుంది. అతిగా ఆశిస్తే కొంత నిరాశపడే అవకాశం లేకపోలేదు. కొత్తదనం లేని.. కలర్‌ఫుల్‌గా, ఎమోషనల్ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మాత్రం చెప్పవచ్చు.
బలం, బలహీనతలు
ప్లస్ పాయింట్స్
గోపిచంద్, జగపతి బాబు బ్రొమాన్స్
సెంటిమెంట్, ఎమోషన్స్
ఫైట్స్
మైనస్ పాయింట్స్
అవుట్ డేటెడ్ కథ, కథనాలు
రొటీన్ విలనిజం
జబర్దస్త్ తరహా కామెడీ


Click it and Unblock the Notifications











