twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోది డ్రామా‌చారి.. (రామాచారి రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    1.5/5
    హైదరాబాద్ : స్వయం వరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న నటుడు వేణు హీరోగా నిలదొక్కుకేక పోయాడనే చెప్పాలి. ఈ మధ్య హీరోగా సినిమా అవకాశాలు లేక పోవడంతో పెద్ద హీరోల చిత్రాల్లో చిన్న చితకా క్యారెక్టర్లు వేసిన వేణు తాజాగా....'రామాచారి' అనే కామెడీ చిత్రం ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రామాచారిగా వేణు ఏమేరకు ప్రేక్షకులను మెప్పించాడో రివ్యూలో చూద్దాం...

    కథ : పోలీస్ ఆఫీసర్ కావాలనేది రామాచారి(వేణు) అనే యవకుడి లక్ష్యం. వివిధ కారణాలతో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోతాడు రామాచారి. దీంతో డిటెక్టివ్‌గా మారి ఆ వృత్తితో సంతృప్తి పడతాడు. అతని స్నేహితులు గంగూలీ(అలీ), చింత(బ్రహ్మానందం) ఈ క్రమంలో రాత్రి ముఖ్యమంత్రి(బాలయ్య)కి అపాయం ఉందనే విషయాన్ని తెలుసుకుంటాడు. ముఖ్యమంత్రిని చంపడానికి జరిగిన కుట్రలో పోలీస్ కమీషనర్ చడ్డ(మురళీ శర్మ) కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. మరి రామాచారి ఈ కుట్రను ఎలా చేధించాడు? అనేది మిగతా కథ.

    Ramachari

    విశ్లేషణ : రామాచారి పాత్రలో వేణు తదనైన నటన కనబరిచి ఆకట్టుకున్నాడు. బ్రహ్మానందం, అలీ, ఎల్బీ శ్రీరామ్, బాలయ్య, మురళీ కృష్ణ తమ తమ పాత్రల మేరుక రాణించారు. హీరోయిన్ కమలినీ ముఖర్జీ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. వేణుతో రొమాంటిక్ సన్నివేశాల్లో కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ కాలేదు.

    ఇక సినిమా కథ, స్క్రిప్టు ప్రేక్షకులను ఏమాత్రం ఆక్టుకోలేక పోయింది. స్క్రీప్లే కూడా బోరింగ్‌గా సాగుతుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మాత్రం నవ్విస్తాయి. ఔట్ డేటెడ్ సీన్స్, కామెడీ డైలాగులు, ఇతర సన్నివేశాలు ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తాయి. దర్శకుడు ఈశ్వర్ రెడ్డి సినిమాను ప్రేక్షక రంజకంగా తీయడంలో పూర్తిగా విఫలం అయ్యాడని చెప్పక తప్పదు. ఇక టెక్నికల్ అంశాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఏ ఒక్క విభాగం పని తీరుకూడా బాగోలేదు.

    ఫైనల్ వర్డ్ : రెండున్నర గంటల సినిమాలో రెండు, మూడు సన్నివేశాలు చూసి నవ్వుకోవడం మినహా మిగతా అంతా పాత చితకాయపచ్చడి లాంటి సోది డ్రామానే.

    నటీనటులు: బ్రహ్మానందం, ఆలీ, ఎల్.బి.శ్రీరామ్, గిరిబాబు, చంద్రమోహన్, రఘుబాబు, వేలు, బాలయ్య, మురళీశర్మ, రాజ్‌ప్రేమి, ప్రభు, అమిత్, హర్షవర్ధన్, ఇందుఆనంద్, లిరిష తదితరులు
    మాటలు: వి.విక్రమ్‌రాజు, డొంగ్రత్, నాగరాజు, రైటర్ మోహన్
    కథ: ఉదయ్‌కృష్ణ, సిబికె థామస్
    పాటలు: రామజోగయ్యశాస్త్రి
    సంగీతం: మణిశర్మ
    ఫొటోగ్రఫీ: కె.ప్రసాద్
    కో ప్రొడ్యూసర్స్: బి.మురళి
    పి.వి.నాగేశ్వరరావు
    నిర్మాత: పి.వి.శ్యాంప్రసాద్
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఈశ్వర్‌రెడ్డి

    English summary
    The movie Ramachari is a come-back movie of the actor Venu, the actor who became famous with the movie Swayamvaram, where he played an arrogant rich guy. He disappeared from Telugu cinema after few movies following that.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X