Ramanna Youth Review తెలంగాణ యాస, భాషతో మరో కామెడీ చిత్రం.. రామన్న యూత్ ఎలా ఉందంటే?

Rating:
2.5/5

నటీనటులు:అభయ్ నవీన్, అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు
రచన, దర్శకత్వం: అభయ్ నవీన్.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ ఎంఎస్ కే
సంగీతం: కమ్రాన్
ఎడిటర్: రూపక్ రొనాల్డ్ సన్, అభయ్ నవీన్
సినిమాటోగ్రఫీ: ఫహాద్ అబ్దుల్ మజీద్
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్ బైరి, ప్రతిభ రెడ్డి
సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్లపల్లి
ఆర్ట్: లక్ష్మీ సింధూజ
రిలీజ్ డేట్: 2023-09-15

సిద్దిపేట్‌కు సమీపంలోని ఆంక్షాపూర్‌లో రాజు (అభయ్ బేతిగంటి) లీడర్‌గా ఎదగాలని కలలు కనే యువకుడు. తమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రంగుల రామన్న (శ్రీకాంత్ అయ్యంగార్‌)కు వీరాభిమాని. గ్రామంలో పెద్దగా ఉండే అనిల్ (తాగుబోతు రమేష్)ను స్పూర్తిగా తీసుకొని తన ఇద్దరు దోస్తులతో రామన్న యూత్ అసోసియేషన్‌ను పెడుతాడు. తనకు తానుగా లీడర్ అని స్వయంగా ప్రకటించుకోవడమే కాకుండా ఊరిలోనే హైలెట్ అయ్యేలా ఫ్లెక్సీ పెడుతాడు. ఇది నచ్చని అనిల్ సోదరుడు (విష్ణు) జెలసీతో రగలిపోతాడు.

Ramanna-Youth-Review

రాజు పెట్టిన ఫ్లెక్సీని చూసిన అనీలన్న బ్రదర్ ఎందుకు ఈర్ష్య పడ్డాడు? అనీల్ సోదరుడు ఈర్ష్యతో రాజును ఎలా ముప్పు తిప్పలు పెట్టాలని చూశాడు? తన పేరున యూత్ అసోసియేషన్ పెట్టిన రాజును మాజీ ఎమ్మెల్యే రామన్న ఆదరించాడా? రామన్నను కలుసుకోవడానికి రాజు బ్యాచ్ చేసిన ప్రయత్నాలు ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు? రాజు లీడర్‌గా ఎదిగాడా? తన ప్రియురాలు (అమూల్యారెడ్డి)తో రాజు ప్రేమ ఫలించిందా? చివరకు రాజు బ్యాచ్, గ్రామంలోని ఇతర యువకులు నేర్చుకొన్న గుణపాఠం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే రామన్న యూత్ సినిమా కథ.

తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదుగుతున్న అభి తన ప్రతిభాపాటవాలను పరీక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం బాగుంది. అయితే కథనాన్ని, క్యారెక్టర్లు బాగానే రాసుకోవడం బాగానే ఉంది కానీ కథ లేకుండా చిన్న పాయింట్‌తో సినిమాను నడిపించే ప్రయత్నమే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సీన్ల పరంగా, క్యారెక్టర డిజైన్ పరంగా బాగుంది. కానీ ప్రేక్షకుడిని ఓ ఎమోషనల్ పాయింట్‌తో కనెక్ట్ చేసే బలమైన కథను రాసుకోలేకపోయాడనిపిస్తుంది. సొంత అనుభవాలను పేర్చుకొని సినిమాను రూపొందించారని సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఒక చిన్న పాయింట్‌ ఆధారంగా క్యారెక్టర్లతో హాస్యాన్ని బాగానే పండించాడు. తెలంగాణ యాస, భాషపై పట్టు దర్శకుడిలో కనిపించిన ప్లస్ పాయింట్. బలమైన, భావోద్వేగమైన పాయింట్‌తో కథను ముగించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. అభయ్, అనిల్ గీలా, ఇతరులతో కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌తో కామెడీ ట్రాక్‌తో మెప్పించారనే చెప్పాలి. ఎప్పుడూ తాగుబోతుగా కనిపించే రమేష్.. ఈసారి ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌తో ఆకట్టుకొన్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్ సీరియస్ రోల్‌లో ఒకే అనిపించారు. సినిమాకు కీలకమైన క్యారెక్టర్‌గా మారిన పాత్రలో విష్ణు, ఉన్న కాసేపు యాదమ్మ రాజు నవ్వించిన తీరు బాగుంది. రాజు ఫ్రెండ్ క్యారెక్టర్‌కు ఫాదర్‌గా నటించిన ఆనంద చక్రపాణి, విష్ణు గీలాకు తండ్రిగా నటించిన వేణు పొలసాని తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. మిగితా క్యారెక్టర్లలో తెలంగాణ యువతీ,యువకులుగా నటించిన వారు తమ పాత్రలో ఒదిగిపోయారు. రీల్స్ పిచ్చి ఉన్న తెలంగాణ మహిళగా జబర్దస్త్ రోహిణి కనిపించినప్పుడల్లా నవ్వించారు.

ఎమోషనల్, బలమైన కథను రాయడంలో తడబాటుకు గురైన అభయ్.. సాంకేతిక అంశాలపై తనకు ఉన్న పట్టును చూపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. తొలి చిత్ర దర్శకుడిగా కొన్ని విషయాల్లో అభయ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మ్యూజిక్, సౌండ్, సినిమాటోగ్రఫి తదితర అంశాలను సినిమాను మరింత రిచ్‌గా మార్చాయి. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫహాద్ సినిమాటోగ్రఫి, నాగార్జున తాళ్లపల్లి సౌండ్ డిజైన్ అంశాలు బాగున్నాయి.

రామన్న యూత్ సినిమా విషయానికి వస్తే.. లాజిక్‌లు, మైండ్‌ను ఉపయోగించాల్సిన పని లేకుండా మన ఇంటి పక్కన వాళ్లు మనతో మాట్లాడినట్టు ఉండే తెలంగాణ ప్రాంతపు పాత్రలతో సరదాగా మూవీ సాగిపోతుంది. తెలంగాణ నేటివిటి, అమాయకత్వాన్ని తన పాత్రల్లో నింపిన దర్శకుడు అభయ్ ప్రయత్నం బాగుంది. పాత్రలతో మరింత ఎమోషన్స్ పండేలా సీన్లు రాసుకొని ఉంటే బాగుండేది. శ్రీకాంత్ అయ్యంగార్, ఆనంద చక్రపాణి, వేణు పొలసాని లాంటి నటులను పూర్తిగా ఉపయోగించు కోలేకపోయారనిపిస్తుంది. సినిమాను పూర్తిగా పొలిటికల్ సెటైర్‌గానైనా చేయాల్సి ఉండేదనిపిస్తుంది. అటు సెటైరిక్‌గా కాకుండా, ఇటు పాజిటివ్‌కు మధ్యన దర్శకుడు ఊగిసలాడినట్టు అనిపిస్తుంది. నటీనటులు కొత్తవారైనప్పటికీ వారి ఫెర్ఫార్మెన్స్ బాగుంది. టేకింగ్, ఎడిటింగ్, ఇతర సాంకేతిక విభాగాలు అన్నీ బాగున్నాయి. కానీ రైటింగ్ సరిగా కుదర లేదనిపిస్తుంది. తెలంగాణ నేటివిటితో వచ్చే సినిమాలు, సింపులు కామెడీని ఆశించే వారికి రామన్న యూత్ నచ్చే అవకాశం ఉంది. సమయం తెలియకుండా క్లీన్ మూవీ చూశామనే విధంగా ఓ టైమ్ పాస్ సినిమా రామన్న యూత్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X