Ramayana: The Legend Of Prince Rama Review: రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
మూవీ: రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ
కథ: యుగో సాకో
దర్శకత్వం: కైచీ ససాకీ, రామ్మోహన్
నిర్మాత: అర్జున్ అగర్వాల్
క్రియేటివ్ పార్ట్‌నర్: వీ విజయేంద్ర ప్రసాద్
బ్యానర్స్: గీక్ పిక్చర్స్ ఇండియా, ఏఏ ఫిల్మ్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2025-01-24
ఇతిహాస పురాణాల్లో పవిత్ర గ్రంథం వాల్మికీ రామాయణం ఆధారంగా శ్రీరాముడి జీవిత చరిత్రను ఎన్ని విధాలుగా చెప్పిన కొత్తగా ఉంటూనే ఉంటుంది. రామాయణ కథను ఎన్నిసార్లు విన్నా ఏదో కొత్త అంశం మానవాళికి కొత్త స్పూర్తిని అందిస్తుంది. యుగాలు మారినా, తరాలు మారినా రాముడి జీవితం అందరికి ఆదర్శప్రాయమే. అలాంటి పురాణగాథను నేటి తరం ప్రేక్షకులకు అందించాలనే కృతి నిశ్చయంతో జపాన్, ఇండియా దేశాల సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ అనే సినిమాను కార్టూన్ వెర్షన్‌గా అందించారు. ఈ సినిమా జనవరి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలాంటి అనుభూతిని కలిగించింది? ఈ కథలో కొత్తగా చెప్పిన అంశాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..

రామాయణం కథ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయోధ్యలో రాముడి జననం, మిథిలా నగరంలో సీతా పరిణయం, అరణ్యవాసంలో పంచవటిలో సీతారామ లక్ష్మణుల వనవాసం, సీతాపహరణం, రామ, రావణ యుద్దం, లంకలోని అశోకవనంలో సీతకు విముక్తి లాంటి అంశాలతో ఈ సినిమాను కార్టూన్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం సుమారుగా 450 మంది ఆర్టిస్టులు పనిచేయగా.. సుమారుగా 1 లక్షలకు పైగా హ్యాండ్ డ్రాయింగ్స్‌ను చిత్రించారు.
వాల్మీకి రామాయణం, తులసీదాస్ రచించిన రామచరిత మానస్, కంబన్ రూపొందించిన రామావతారం నుంచి స్పూర్తి పొంది ఈ సినిమాను రూపొందించారు. కార్టూన్ వర్క్ పరంగా ఈ సినిమాను అద్బుతంగా తీర్చి దిద్దారు. క్వాలిటీ పరంగా మంచి అవుట్‌పుట్ తీసుకు రావడంలో వారి కృషి అభినందనీయం. టెక్నికల్‌గా చాలా సౌండ్‌గా, రిచ్‌గా 4K టెక్నాలజీలో అందించారు. క్వాలిటీ పరంగా భారీగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫీల్‌ను అందించారనే చెప్పాలి. కాకపోతే తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ విషయంలో మరింత దృష్టి పెట్టి ఉంటే.. నిజంగానే కార్టూన్ వెర్షన్‌లో మాస్టర్ పీస్ అయి ఉండేదనిపించింది.

రామాయణం సినిమా కోసం ఎంచుకొన్న సన్నివేశాలు.. ఆయా సీన్లలో ఉండే క్యారెక్టర్లకు ప్రాణం పోసిన విధానం బాగుంది. కేవలం పాత్రలే కాకుండా బ్యాక్ గ్రౌండ్ ఎన్విరాన్‌మెంట్‌ను మెయిన్ స్ట్రీమ్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాకుండా అవుట్‌పుట్‌ను అందించారు. సినిమాటోగ్రఫి, మోషన్ పిక్చర్ క్యాప్చర్ బాగుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా సినిమాకు పాజిటివ్‌గా మారింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తెలుగు వెర్షన్ ఇంకా బెటర్‌గా చేయడానికి స్కోప్ ఉంది. కానీ ఆ దిశగా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొన్ని లోపాలు కనిపిస్తాయి. అయినా ఈ సినిమా నేటితరం ఆడియెన్స్‌కు, ముఖ్యంగా పిల్లల్ని విశేషంగా ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగానే ఉన్నాయి.

రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను 1993లోనే రూపొందించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం రిలీజ్ చేశారు. అయినా ఈ సినిమా నేటి టెక్నాలజీని అందిపుచ్చుకొని ఉన్నత విలువలతో రూపొందించారు. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు తప్పకుండా చూపించాల్సిన సినిమా. రాముడు జీవితం స్పూర్తిదాయకంగా, ఆదర్శప్రాయంగా అనుసరించడానికి నేటితరానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications











