twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ranga Ranga Vaibhavanga review రొటీన్ ప్రేమకథ, ఫ్యామిలీ డ్రామా.. వైష్ణవ్ తేజ్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    |

    Rating: 2/5

    ఉప్పెన చిత్రంతో భారీ విజయాన్ని అదుకొన్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ పంజా తన రెండో సినిమా కొండపొలం సినిమాతో ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయారు. ఇక సక్సెస్, ఒక ఫ్లాప్‌ తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రంగ రంగ వైభవంగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ సినిమాతో పరిచయమైన కేతీకా శర్మ జంటగా నటించింది. అర్జున్ రెడ్డి చిత్రం తమిళ రీమేక్‌తో దర్శకుడిగా మారిన గిరీసాయ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వైష్ణవ్, గిరీసాయ, కేతికకు ఎలాంటి విజయాన్ని అందించింది? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయంలోకి వెళితే..

    రంగ రంగా వైభవం కథ..

    రంగ రంగా వైభవం కథ..

    రిషి (వైష్ణవ్ తేజ్), రాధ (కేతికా శర్మ) ఫ్యామిలీ ఫ్రెండ్స్. చిన్నతనంలోనే ఇగో కారణంగా వారి మధ్య చిన్న గొడవ చోటుచేసుకొంటుంది. దాంతో వారిద్దరూ కలిసి ఉంటూనే రిలేషన్ పరంగా దూరంగా ఉంటారు. రిషి తండ్రి (నరేష్), రాధ తండ్రి (ప్రభు) కుటుంబాల మధ్య విడదీయలేనంత స్నేహం ఉంటుంది. రాధ అన్న అర్జున్ (నవీన్ చంద్ర) ఐఐటీలో చదివి రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇలా రెండు కుటుంబాలు అన్యోన్యతతో ఉంటుండగా.. ఓ పెళ్లి అంశం కారణంగా రెండు కుటుంబాలు విడిపోవాల్సి వస్తుంది.

     కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు

    రిషికి, రాధాకు చిన్నతనంలో ఎందుకు గొడవలు వచ్చాయి? రిషికి, రాధాకు మధ్య ఉన్న గొడవ కారణంగా ఎలాంటి సమస్యలు వచ్చాయి? పెళ్లి కారణంగా విడిపోయిన కుటుంబాలను కలిపే ప్రయత్నంలో రిషి, రాధాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. నవీన్ రాజకీయంగా ఎలాంటి స్థితికి చేరుకొన్నారు. చివరకు రెండు ఫ్యామిలీలు కలవడానికి రిషి, రాధా ఏం చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే రంగ రంగ వైభవంగా సినిమా కథ.

    మూవీ ఎలా ఉందంటే?

    మూవీ ఎలా ఉందంటే?

    రంగ రంగ వైభవంగా సినిమా విషయానికి వస్తే... పవన్ కల్యాణ్ ఖుషి, నాగార్జున నిన్నే పెళ్లాడుతా సినిమాను కలిపి చేసిన చిత్రంగా తొలి పావుగంటలోనే అర్ధమవుతుంది. అయితే ఈ సినిమా రొటీన్ సీన్లు, పసలేని కథ, కథనాలు వల్ల ఆద్యంతం బోర్‌గా, సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. కొంతలో కొంత ఫస్టాఫ్ బాగుందనిపించినా.. సెకండాఫ్‌లో కథ పరంగా మెరుగైన సన్నివేశాలు రాసుకోలేకపోయవడం, మెరుగైన కథనంతో ముందుకు వెళ్లకపోవడం సినిమాకు పెద్ద మైనస్. కథ, కథనాలు అంతా ఊహించినట్టు ఉండటం వల్ల ఫీల్‌గుడ్‌గా అనిపించదు. ఎక్కడ కొత్తదనం లేకుండా చప్పగా కథ సాగిపోతుంది. కాకపోతే.. చివరి పది నిమిషాలు ఏదో బెటర్‌గా ఉన్నదనిపిస్తుంది. కానీ అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయిందనే స్పష్టమవుతుంది.

    వైష్ణవ్ తేజ్ పెర్ఫార్మెన్స్

    వైష్ణవ్ తేజ్ పెర్ఫార్మెన్స్

    ఉప్పెన భారీ సక్సెస్, కొండపొలం సినిమాలో క్రిటిక్ ప్రశంసల తర్వాత వైష్ణవ్ తేజ్ ఎలాంటి కొత్తదనం లేని కథతో ప్రేక్షకులను, మెగా ఫ్యాన్స్‌ను నిరాశపరిచారనే చెప్పవచ్చు. రొటీన్ ప్రేమ కథా, డైలాగ్స్, సన్నివేశాలు పేలవంగా ఉండటం వల్ల వైష్ణవ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోయింది. సాదాసీదాగా సాగే కథా ప్రవాహంతో వైష్ణవ్, కేతికాలు అలా సాగిపోయారు. వైష్ణవ్, కేతికా మధ్య లవ్ సీన్లు కూడా గొప్పగా అనిపించవు. ప్రభు, నరేష్, నవీన్ పాత్రలు కూడా ఆకట్టుకొనేలా ఉండవు. ఓవరల్‌గా ఫెర్ఫార్మెన్స్‌కు ఎలాంటి స్కోప్ లేని కథతో వైష్ణవ్ భారీ సాహసామే చేశాడని చెప్పవచ్చు.

    సాంకేతిక విభాగాల పనితీరు..

    సాంకేతిక విభాగాల పనితీరు..

    సాంకేతిక విభాగాల పరంగా కూడా రంగ రంగ వైభవంగా సినిమా ఆకట్టుకోలేకపోయింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కూడా అంతంత మాత్రమే. అందుకు కారణం పేలవమైన కథ, సన్నివేశాలే కారణం. పాటలకు కూడా పెద్దగా ప్లేస్ మెంట్ లేకపోయింది. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు గిరీశాయ తనకు వచ్చిన మంచి ఆఫర్‌ను, అవకాశాన్ని పేలవమైన, డమ్మీ కథతో చేజార్చుకొన్నాడనే చెప్పవచ్చు. బీవీఎన్ ప్రసాద్‌కు మంచి కథలతో సినిమాలు రూపొందించిన ట్రాక్ ఉంది. కానీ ఈ సినిమా విషయంలో జడ్జిమెంట్ ఎక్కడో మిస్ అయిందనే చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ.. కథలో సరుకు లేకపోవడం నిరాశ కలిగించే అంశం.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    కథ, కథనాల్లో కొతదనం లేని, ఎమోషన్స్ పెద్దగా పండని చిత్రం రంగ రంగ వైభవంగా. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను, యూత్‌ను టార్గెట్ చేసిన సినిమా ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయిందని చెప్పవచ్చు. కథ, కథనాలు, సన్నివేశాల పరంగా, వైష్ణవ్ తేజ్, కేతికా క్యారెక్టర్ల పరంగా జాగ్రత్తలు తీసుకొని ఉంటే మంచి సినిమా అయి ఉండేది. అద్బుతమైన స్టార్ కాస్టింగ్‌ను ఉపయోగించుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ, బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరిస్తే ఈ సినిమా విజయం సాధించే అవకాశం ఉంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    వైష్ణవ్ తేజ్ పంజా ఫెర్ఫార్మెన్స్

    మైనస్ పాయింట్స్
    దర్శకత్వం
    స్క్రీన్ ప్లే

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ, నవీన్ చంద్ర, తులసి, నాగినీడు, ఆలీ, సుబ్బరాజు తదితరులు
    రచన, దర్శకత్వం: గిరీసాయ
    నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
    సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
    సినిమాటోగ్రఫి: శ్యామ్ దత్
    రిలీజ్ డేట్: 2022-09-02

    English summary
    Vaisshnav Tej's Ranga Ranga Vaibhavanga movie hits the theatres on September 2nd. Here is the Telugu filmibeat exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X