twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దొంగతనం రాని రంగ అనబడే దొంగ(మూవీ రివ్యూ)

    By Nageswara Rao
    |

    బ్యానర్: గాడ్ ఫాదర్ ఫిలింస్
    తారాగణం: శ్రీకాంత్, విమల రామన్, రమ్యకృష్ణ, శివాజీరాజా, తిరుపతి ప్రకాష్,
    సుధాకర్(జి.వి), జయప్రకాష్ రెడ్డి, తెలంగాణా శకుంతల, చలపతిరావు తదితరులు...
    కధ: సుధాకర్ (జి.వి)
    మాటలు: సుధాకర్ (జి.వి)
    ఎడిటింగ్: గౌతమ్ రాజు
    ఆర్ట్: బంగార్రాజు
    సంగీతం: చక్రి
    నిర్మాత: సి.ఆర్.మనోహర్
    దర్శకుడు: సుధాకర్ (జి.వి)
    విడుదల తేది: 30/12/2010

    అనంతపురం జిల్లాలో ఉన్న పులిచర్లలో ఒక ఫ్యాక్షనిస్టు చేసే అరాచకాలకు సింహపురిలోని ఒక వ్యక్తి ప్రజల తరపున తిరగడతాడు. తిరగబడినతన్ని ఫ్యాక్షనిస్టు చంపితే విదేశాల్లో ఉన్న అతని కొడుకు తండ్రి బాధ్యతని చేపడతాడు. గర్భవతి అయిన అతని భార్య ఇది ఇష్టం లేక పదేళ్ళ కొడుకుతో పాటు పుట్టింటికి వెళ్ళబోతే నా కొడుకు భానుప్రసాద్(శ్రీకాంత్) ఇక్కడే ఉండి, నా తండ్రి ఆశయాలను సాధిస్తాడు. నీ కడుపులో పెరుగుతున్న వాణ్ణి నీ ఇష్టం వచ్చినట్టు పెంచుకో అంటాడు భర్త. ఇలా ఆమె పుట్టింటికి వెళుతుండగా ఆమెపై దాడి జరుగుతుంది.

    ఆ దాడి నుండి పారిపోతూండగా నెప్పులు వచ్చి ఒక మగబిడ్డను కని తన పక్కనున్నమనిషి(తెలంగాణాశకుంతల)కి ఇచ్చి మనిషిలా పెంచమని కన్నుమూస్తుంది. ఆ బిడ్దను తీసుకుని హైదరాబాద్ లోని స్టువర్ట్ కాలనీకి వెళ్తుంది ఆ మనిషి(తెలంగాణాశకుంతల). అక్కడ ఆ పిల్లాడు రంగ (శ్రీకాంత్)దొంగగా మారతాడు. పోలీసుల అరాచకాలు చిన్నప్పుడు చూసిన ఆ రంగ అచ్చంగా పోలీసుల ఇళ్ళలోనే దొంగతనాలు చేస్తుంటాడు. అతను ఒక నేరం మీద కోర్టుకి వెళ్ళగా అక్కడ అతని మీద బాంబుదాడి జరుగుతుంది.

    ఆ దాడిలో అతను చనిపోతాడు. అతనే భానుప్రసాద్. అతను అచ్చం తనలానే ఉండటంతో రంగ ఆశ్చర్యపోతాడు. భానుప్రసాద్ మనుషులు రంగను సింహపురి తీసుకెళ్ళి భాను ప్రసాద్ భార్య (రమ్యకృష్ణ)ముందుంచుతారు. ఆమె రంగను భాను ప్రసాద్ గా నటింపజేస్తుంది. రంగ ద్వారా తన భర్త ఆశయాల సాధనకు ఆమె కృషి చేస్తుంది. రంగ తన అన్న ఆశయాలను సాధించాడా లేదా అన్నది తెరమీద చూడాల్సిందే.

    దర్శకత్వం గురించి చెప్పాలంటే జివి గతంలో దర్శకత్వం వహించిన హీరో చిత్రం కంటే ఇది బెటరనిపిస్తుంది. సినిమా కథ మంచిదే కానీ కథనంలోని కొన్ని లోపాల వల్ల సినిమా మీద ఆసక్తి తగ్గిస్తుంది. కథనం బాగుండి ఉండుంటే ఇది సూపర్ హిట్‍ చిత్రం అయ్యుండేది. కథలోని మలుపులు బాగున్నాయి. సినిమా తొలి సగం అంతా ఎంటర్ టైన్ మెంట్ మీద సాగి సెకండ్ హాఫ్ లో కథలోకి ప్రవేశిస్తుంది. ఫ్యాక్షన్ సినిమాల కోవలో ఇది మరొక సినిమాగా చేరింది. నిర్మాత ఖర్చుకి ఎక్కదా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణపు విలువలు కూడా బాగా ఉన్నాయి ఈసినిమాలో.

    ఇక ఈసినిమాలో నటన విషయానికి వస్తే శ్రీకాంత్ రంగ ది దొంగగా, భాను ప్రసాద్ గా, మళ్ళీ భాను ప్రసాద్ గా నటించే రంగగా మూడు వేరియేషన్లను చక్కగా చూపించారు. విమలా రామన్ కు నటించే అవకాశం అంతగా లేని గ్లామరస్ పాత్ర. భాను ప్రసాద్ భార్య గా రమ్యకృష్ణ చక్కని నటన ప్రదర్శించింది. ఆమె కళ్ళతోనే తన భావాలను పలికించిన తీరు బాగుంది. తెలంగాణా శకుంతల లిమిటెడ్ గా నటించి ఆకట్టుకుంటుంది. శివాజీరాజా, జయప్రకాష్ రెడ్డిల నటన ఆద్యం చాలా బాగుందనిపిస్తుంది. సంగీతం విషయానికి వస్తే రెండు పాటలు మాత్రమ బాగున్నాయి. మిగిలిన ట్యూన్లన్నీ ఏక్కడో విన్నట్టుగానే ఉన్నాయి. రి-రికార్డింగ్ బాగుంది.

    ఈసినిమాలోని మాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. పాటల్లో సాహిత్యం ఫరవాలేదు. ఓపెనింగ్ సాంగ్ లో మాత్రం కొంచెం ద్వందార్థాలు ఎక్కువైనట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు, యాక్షన్ సీన్లలో ఫొటోగ్రఫీ బాగుంది. గౌతమ్ రాజు ఎడిటింగ్ బాగుంది. డాన్స్ విషాయనికి వస్తే ఈ చిత్రంలోని అన్ని పాటల్లో కొరియోగ్రఫీలో కొత్తదనం చూపించేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్ని వేశాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండి బాగున్నాయి. చివరగా ఎవరికైతే ఫ్యాక్షన్ సినిమాలంటే బాగా ఇష్ట పడతారో వారికి మాత్రం ఈసినిమా బాగుందని పిస్తుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X