Rangabali Review ఫుల్ ఫన్.. సొంత ఊరు ఎమోషన్.. నాగశౌర్య హిట్ కొట్టాడా? రంగబలి రివ్యూ

Rating: 2.75/5

నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, చాకో, శరత్ కుమార్, సత్య, బ్రహాజీ, మురళీ శర్మ, అనంత శ్రీరాం, సప్తగిరి తదితరులు
దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సినిమాటోగ్రఫి: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్
మ్యూజిక్: పవన్ సీహెచ్
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
రిలీజ్ డేట్: 2023-07-07

రాజవరంలోని రంగబలి సెంటర్‌కు చెందిన శ్రీ శౌర్య అలియాస్ షో (నాగశౌర్య) ఎలాంటి ఫ్యామిలీ బాధ్యతలు లేకుండా ఫ్రెండ్స్‌ (సత్య)తో మందు కొడుతూ షికార్లు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేసే యువకుడు. కొడుకు ప్రయోజకుడై తాను నడిపే మెడికల్ షాపును చూసుకోవాలని తండ్రి తపన పడుతుంటాడు. అయితే అల్లరి చిల్లరిగా తిరుగుతున్న శౌర్యను తండ్రి వైజాగ్‌కు పంపిస్తాడు. అలా వైజాగ్‌కు వెళ్లిన శ్రీ శౌర్య మెడికల్ స్టూడెంట్ సహజ (యుక్తి తరేజా)తో ప్రేమలో పడుతాడు. అయితే తన కూతురిని పెళ్లి చేసుకోవాలంటే రంగబలి నుంచి వచ్చేసి వైజాగ్‌లో స్థిరపడాలని సహజ తండ్రి (మురళీ శర్మ) కండిషన్ పెడుతాడు.

Rangabali Movie Review

రంగబలి సెంటర్‌లో ఫ్రెండ్స్‌తో శౌర్య చేసే పనులేంటి? రంగబలి నుంచి శౌర్యను తండ్రి ఎందుకు వైజాగ్ పంపించాడు? వైజాగ్‌కు వెళ్లిన శౌర్య మెడికో సహజతో ఎలా ప్రేమలో పడ్డాడు? శౌర్యకు సహజ తండ్రి ఎలాంటి కండీషన్లు పెట్టాడు? రంగబలి సెంటర్ నుంచి శౌర్య రావడానికి ఎందుకు విముఖత చూపించాడు? రంగబలి సెంటర్ పేరును ఎందుకు మార్చాలని శౌర్య నిర్ణయం తీసుకొన్నాడు. స్థానిక ఎమ్మెల్యే పరుశురాం (చాకో)ను శౌర్య ఎలా ప్రతిఘటించాడు. రంగబలికి రంగారెడ్డి (శరత్ కుమార్)కు సంబంధం ఏమిటి? రంగబలి సెంటర్ అంటే సహజ తండ్రికి ఎందుకు అయిష్టం? చివరకు సహజ తండ్రి కండీషన్లకు శౌర్య తలవొగ్గాడా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానమే రంగబలి సినిమా కథ.

రంగబలి మూవీ శౌర్య, సత్య, ఇతర గ్యాంగ్‌తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మంచి జోష్, సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ వరకు ఎలాంటి ట్విస్టులు లేకుండా హ్యాపీగా చకచక కామెడీతో పరుగులు పెడుతుంది. కమెడియన్ సత్య పండించే కామెడీ సీన్లతో అప్పుడే ఇంటర్వెల్ అయిపోయిందా? అనే రేంజ్‌లో కథను దర్శకుడు పవన్ డీల్ చేశాడని చెప్పవచ్చు.

Rangabali Movie Review

ఇక సెకండాఫ్‌లో రంగబలి సెంటర్ పేరు మార్చాలనే కాన్సెప్ట్‌‌కు సంబంధించిన ట్రాక్ ఫర్వాలేదనిపించే స్థాయిలో వెళ్తుంది. గుర్రం సీన్, శరత్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఇంటెన్స్ ఉండాల్సిన చోట కథ తేలిపోయినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు కామెడీని నమ్ముకోవడం వల్ల రంగబలి కథను పండించే ఎమోషన్స్ మిస్ అయిందనిపిస్తుంది. కానీ కామెడీ సినిమాలను ఆశించే వారికి ఎలాంటి నిరాశ, అసంతృప్తికి గురి చేయదనే ఫీలింగ్ ఓవరాల్‌గా కలుగుతుంది.

తొలి చిత్ర దర్శకుడిగా పవన్ ఎంచుకొన్న పాయింట్‌కు న్యాయం చేశారని చెప్పవచ్చు. కథను వినోదాత్మకంగా నడిపించిన తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఇంకాస్త వర్క్ చేసి ఉంటే డెఫినెట్‌గా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ అయి ఉండేదనిపిస్తుంది.

Rangabali Movie Review

ఇక నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. నాగశౌర్య డిఫరెంట్‌గా కనిపించాడు. క్యారెక్టర్‌కు సంబంధించిన ఎనర్జీ, జోష్‌ను ఫర్‌ఫెక్ట్‌గా పండించాడు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని కథను ముందుకు తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు చూసిన శౌర్య కంటే.. రంగబలి సినిమాలో మరింత మెచ్యురిటీతో కనిపించాడు. సహజగా యుక్తి తరేజా పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నది. రొమాంటిక్ సాంగ్‌లో అందాల ఆరబోతతో యూత్‌కు మంచి కిక్ ఇచ్చేలా పెర్ఫార్మెన్స్ చేసింది.

రంగబలి సినిమాలో సత్య కామెడీ సినిమాకు అత్యంత బలం. ఫస్టాఫ్‌ను పూర్తిగా తన మార్కు కామెడీతో సత్య కమాండ్ చేశాడు. ఆద్యంతం నవ్వులతో థియేటర్‌లో గోల పెట్టించాడు. చాకో, మురళీ శర్మ, శరత్ కుమార్ పాత్రలు సినిమాకు కీలకమే కానీ.. కథపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయారనిపిస్తుంది. లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ కామెడీ ఒకే అనిపిస్తుంది.

Rangabali Movie Review

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ పాయింట్స్. పాటలు ఫర్వాలేదనిపిస్తాయి. రీరికార్డింగ్ సినిమాలోని సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ఇతర విభాగాల పనితీరు ఒకే అనిపిస్తాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సుధాకర్ చెరకూరి అనుసరించిన నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి.

Rangabali Movie Review

లవ్, యాక్షన్, కామెడీ, సొంతఊరు అనే ఎమోషన్‌తో రూపొందిన చిత్రం రంగబలి. సత్య కామెడీ ఈ సినిమాకు అత్యంత పాజిటివ్ అంశం. నాగశౌర్య ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ కొత్తగా ఉంటాయి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. కథపై ఇంకాస్త బెటర్ ఎమోషనల్ డ్రామాగా మారి ఉండేదనిపిస్తుంది. రెండున్నర గంటల సేపు హాయిగా నవ్వుకోవాలనుకొంటే.. రంగబలిని చూడొచ్చు. హాస్యంతో మంచి అనుభూతి కలిగిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మంచి ఫన్‌తో సినిమాను ఎంజాయ్ చేయడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X