Rangamarthanda pre release review గుండెను పిండేసే జీవిత సత్యం.. బ్రహ్మానందం.. మీకో సెల్యూట్!

తెలుగు సినిమా రంగంలో అప్పుడప్పుడు గుండెను తట్టి లేపడమే కాకుండా మనం మనుషులం అని తన్ని చెప్పేలా కొన్ని చిత్రాలు వస్తుంటాయి. భారతీయ సంస్కృతికి అత్యంత బలమైన బంధాలు, అనుబంధాలు ఆధారంగా గతంలో ఎన్నో మంచి చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పండించాయి. ఇటీవల తెలంగాణ నేపథ్యంతో వచ్చిన బలగం సినిమా ఎంతో మందిని కదిలించింది. కుటుంబ విలువలు, తల్లిదండ్రులు, కొడుకు, కూతుళ్లు, కోడలు, అల్లుడు లాంటి పాత్రల విలువ చెప్పే కథా నేపథ్యంతో వస్తున్న చిత్రం రంగ మార్తండ. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్‌లో భాగంగా సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలకు, మీడియా వారికి ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా గురించి కొన్ని ముఖ్య అంశాలు మీ కోసం..

రంగ మార్తండ కథ గురించి

రంగ మార్తండ కథ గురించి

నాటక రంగాన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఓ రంగస్థల నటుడు (ప్రకాశ్ రాజ్) జీవితం చివరి అంకంలో నటనకు స్వస్తి చెబుతాడు. జీవితకాలంలో సంపాదించిన తన ఆస్థిపాస్తులను నిస్వార్ధంగా తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కొడుకు, కూతురుకు రాసి ఇచ్చేస్తాడు. నాగరిక ప్రపంచంలో బతుకుతున్నామనే భ్రమలో కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు (అనసూయ, శివాత్మిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్) ఇద్దరు వల్ల ఎలాంటి అవమానాలకు వృద్ద దంపతులు (ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ) గురయ్యారు? జీవితంలో కష్టసుఖాల్లో భాగం పంచుకొన్న స్నేహితుడు (బ్రహ్మానందం)కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే రంగ మార్తండ కథ.

దర్శకుడు కృష్ణవంశీ టేకింగ్

దర్శకుడు కృష్ణవంశీ టేకింగ్


రంగ మార్తండ చిత్రం తెర మీద కథగా చెప్పినట్టు దర్శకుడు కృష్ణవంశీ చిత్రీకరించలేదు. ప్రతీ ఊర్లో, ప్రతీ ఇంట్లో జరిగే కోట్లాది మంది జీవితాలను ప్రత్యక్షంగా చూస్తున్నట్టు తెర మీద మనుషులతో నాటకాన్ని చూపించారు. ఇక సినిమా కోసం నటిస్తున్నాం.. రెమ్యునరేషన్ కోసం పాత్రలో ఒదిగిపోదాం అనే విధంగా కాకుండా.. తమ తమ పాత్రల్లో ప్రతీ నటీనటుడు జీవించేశారని చెప్పవచ్చు. ఆద్యంతం మనసును పండేసి.. గుండెను మెలిపెట్టేలా సన్నివేశాలతో దర్శకుడు కృష్ణవంశీ జీవిత ఫిలాసఫీని చెప్పేశారనిపిస్తుంది.

ప్రకాశ్ రాజ్,  రమ్యకృష్ణ ఫెర్ఫార్మెన్స్

ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ఫెర్ఫార్మెన్స్

ప్రకాశ్ రాజ్ విషయానికి వస్తే.. నటుడిగా ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. కానీ రంగ మార్తండ రాఘవరావుగా విషయానికి వస్తే.. ప్రపంచంలోని ఎంతో మంది తండ్రులు అనుభవించే వ్యధ, ఆవేదన, ఆక్రోషానికి ప్రతీరూపంగా ఆయన తన పాత్రలో కనిపిస్తారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా ప్రకాశ్ రాజ్ భార్యగా రాజు పాత్రలో రమ్యకృష్ణ మరోసారి భావోద్వేగంగా కనిపించారు.

బ్రహ్మనందం నట విశ్వరూపం

బ్రహ్మనందం నట విశ్వరూపం

ఇక బ్రహ్మనందం విషయానికి వస్తే.. చక్రవాణి పాత్రలో ఎన్ని ఆస్కార్స్ ఇచ్చినా కొలువలేని పాత్రలో కనిపించారు. బ్రహ్మనందం అంటే హాస్యానికి ప్రతిరూపం. హాస్య బ్రహ్మగా కీర్తించబడే ఆయన చేయని పాత్రలేదు.. హుందాగా పలు పాత్రల్లో.. వెకిలిగా మరొకొన్ని పాత్రల్లో హాస్య నటుడిగా తన సత్తాను చాటుకొన్నారు. కానీ చక్రపాణి పాత్ర చూసిన తర్వాత ఇప్పటి వరకు మనం చూసిన బ్రహ్మీ వేరు అనేది మనసును తాకుతుంది. చక్రపాణి పాత్రలో బ్రహ్మనంద నట విశ్వరూపం చూపించారు.

మిగితా పాత్రల్లో జీవించిన వాళ్లు..

మిగితా పాత్రల్లో జీవించిన వాళ్లు..

మిగితా పాత్రల్లో శివాత్మిక, అనసూయ, ఆదర్శ్, రాహులు సిప్లిగంజ్ తమ అనుభవానికి మించిన నటనను ప్రదర్శించారు. ఇప్పటి వరకు మనం తెర మీద చూసిన వాళ్లేనా.. ఈ పాత్రల్లో నటించిందనే అనేంతగా ఆశ్చర్యానికి గురిచేస్తారు. నవ్విస్తారు.. ప్రేమను పంచుతారు.. విద్వేషాన్ని కలిగిస్తారు. కోపం తెప్పిస్తారు.. మనసులో తిట్టుకొనేలా ప్రేక్షకుడిని తమ నటనతో ప్రభావితం చేస్తారు.

ఇళయ రాజా మాస్టర్ వర్క్

ఇళయ రాజా మాస్టర్ వర్క్

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు సమతూల్యంతో పనిచేశాయి. ముఖ్యంగా లయరాజ ఇళయరాజా అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుడికి కొత్త అనుభూతికి గురిచేయడమే కాకుండా భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు తెర మీద ఆద్బుతంగా ఆవిష్కరింపజేసేలా దర్శకుడు కృష్ణవంశీ మరోసారి సక్సెస్ అయ్యారు.

చివరగా రంగ మార్తండ గురించి

చివరగా రంగ మార్తండ గురించి

రంగ మార్తండ అనేది జీవిత విలువలను, కుటుంబ బాధ్యతలను గుర్తు చేసే పాఠం లాంటింది. భారత్ జగదైక కుటుంబం అనే విషయాన్ని మరిచిపోతున్న ప్రతీ ఒక్కరికి కొరడాతో కొట్టి చెప్పేలా కొన్ని సీన్లు ఉంటాయి. రంగ మార్తండ సినిమా కానే కాదు.. జీవితం.. ఎన్నో కుటుంబాలను వెంటాడుతున్న చేదు జాపకాలకు సాక్ష్యం రంగ మార్తండ. ప్రతీ ఒక్కరు ప్రతీ కుటుంబ సభ్యుడితో కలిసి చూడాల్సిన చిత్రం. ముఖ్యంగా పిల్లలు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X