Rao Bahadur First Review: రావు బహదూర్ మూవీ ఫస్ట్ రివ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత బ్యానర్ ఘట్టమనేని మహేష్ బాబు (GMB) ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం రావు బహద్దూర్. ఈ సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై చింత గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, వికాస్ ముప్పాల, మలయాళ నటి దీపా థామస్, బాలా పరసార్, ఆనంద్ భారతీ, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు రచయితగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా వెంకటేష్ మహా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బొల్లెబోయిన, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ పర్మార్, మ్యూజిక్: స్మరణ్ సాయి, ప్రొడక్షన్ డిజైనర్: రోషన్ సింగ్, క్యాస్టూమ్ డిజైనర్: శిల్పా జీఎన్ఎస్, సౌండ్ డిజైనర్: అశ్విన్ రాజశేఖర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా జూలై 3వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? రిలీజ్‌కు ముందు ఈ చిత్రానికి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Rao Bahadur Review by Censor Board

రావు బహద్దూర్ సినిమా కథ విషయానికి వస్తే.. రామప్ప (సత్యదేవ్) 60 ఏళ్ల వృద్దుడు. శారీరకంగా ఓ రుగ్మతతో బాధపడుతుంటాడు. వృద్దాప్యంలో ఆయనకు వచ్చిన సమస్యలు ఏమిటి? ఏ లక్ష్యం కోసం బతికేందుకు ప్రయత్నించాడు. ఆ వృద్ధుడి జీవితంలో ఏం జరిగింది? రేణుక (దీప థామస్)తో ఆయన ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? రేణుక లేకుండా రామప్ప ఎందుకు ఒంటరి జీవితాన్ని గడిపాడు? ఆయన యవ్వనంలో జరిగిన సంఘటనలు, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ సమాధానమే రావు బహద్దూర్ సినిమా కథ.

ఎమోషనల్ డ్రామా, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను ఇటీవల సెన్సార్ అధికారులు, ప్రతినిధులు చూశారు. ఈ చిత్రంలో పాత్రల చుట్టూ అల్లిన భావోద్వేగాలు, స్క్రీన్ ప్లే, సంభాషణలపై ప్రశంసించారు. కథను దర్శకుడు వెంకటేష్ మహా నడిపించిన విధానం.. క్లైమాక్స్‌ను ముగించిన విధానం చూసి పెద్దగా అభ్యంతరాలు తెలియజేయకుండానే ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

విభిన్నమైన కథ, యాక్టర్ల విలక్షణమైన నటనతో రూపొందిన ఈ సినిమాకు యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ చిత్రానికి జారీ చేసిన సర్టిఫికెట్ ప్రకారం.. ఈ మూవీని 16 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల అమనుమతితో చూడాల్సి ఉంటుందని సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాలో బలమైన సన్నివేశాలు, పెర్ఫార్మెన్స్ బేస్ మీద సాగడంతో ఈ చిత్రం నిడివి కూడా పెరిగింది. ఈ చిత్రం నిడివి సుమారుగా 2 గంటల 49 నిమిషాలు. అంటే 169 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు.

ఈ సినిమా విడుదలకు ముందు సొంత చేసుకొన్న టాక్ వివరాల్లోకి వెళితే.. సత్యదేవ్‌లో కొత్త నటుడు ఆవిష్కరించనున్నారు. వికాస్ ముప్పల, దీప థామస్ పాత్రలు ఆకట్టుకొనేలా ఉంటాయి. ఈ చిత్రం కోసం అనుసరించిన నిర్మాణ విలువలు, డైరెక్టర్ టేకింగ్, విజన్ గురించి కొన్ని పాజిటివ్ న్యూస్ వస్తున్నాయి. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Read more about: Rao Bahadur mahesh babu satyadev
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X