Mahesh Babu Review on Rao Bahadur: రావు బహదూర్‌పై మహేష్ బాబు రివ్యూ
సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత బ్యానర్ ఘట్టమనేని మహేష్ బాబు (GMB) ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం రావు బహద్దూర్. ఈ సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై చింత గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, వికాస్ ముప్పాల, మలయాళ నటి దీపా థామస్, బాలా పరసార్, ఆనంద్ భారతీ, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు రచయితగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా వెంకటేష్ మహా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బొల్లెబోయిన, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ పర్మార్, మ్యూజిక్: స్మరణ్ సాయి, ప్రొడక్షన్ డిజైనర్: రోషన్ సింగ్, క్యాస్టూమ్ డిజైనర్: శిల్పా జీఎన్ఎస్, సౌండ్ డిజైనర్: అశ్విన్ రాజశేఖర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా జూలై 3వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై వారణాసి స్టార్ మహేష్ బాబు తన రివ్యూను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అంచనాలు పెంచారు. మహేష్ ఈ మూవీ గురించి ఏం చెప్పారంటే..

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న వారణాసి సినిమా షూటింగులో బిజీగా ఉన్న మహేష్ బాబు కొంత సమయం తీసుకొని రావు బహద్దూర్ సినిమాను ప్రైవేట్ స్క్రీనింగ్‌తో స్పెషల్‌గా ఇటీవల చూశారు. ఈ సినిమా గురించి ఆయన తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ట్విట్టర్‌లో మంచి హైప్ క్రియేట్ చేశారు. ఆ పోస్టును తన అభిమానులు, సినీ ప్రేక్షకులకు వైరల్ చేస్తున్నారు.
మహేష్ బాబు తన ట్వీట్‌లో.. రావు బహద్దూర్ చిత్రం కేవలం ఒక సినిమా కాదు. నీ హృదయాన్ని గట్టిగా బయటకు లాగేస్తుంది. సరికొత్తగా, భావోద్వేగమైన డ్రామాతో మనసును అతలాకుతలం చేస్తుంది. ఈ సినిమా కోసం దర్శకుడు వెంకటేష్ మహా స్టన్నింగ్ వరల్డ్‌ను క్రియేట్ చేశారు. సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే.. ఆయన తప్ప మరొకరు చేయలేరనే విధంగా.. మహా సృష్టించిన వరల్డ్‌ను టేకోవర్ చేశాడు అని ప్రశంసలు గుప్పించారు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మలయాళ నటి దీపా థామస్ తన పెర్ఫార్మెన్స్‌తో మెరుపులు మెరిపిస్తారు. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు కూడా టెర్రిఫిక్. టెక్నికల్ టీమ్ వర్క్ అవుట్‌స్టాండింగ్. ఈ సినిమాను అద్బుతంగా తీర్చిదిద్దడంలో టీమ్ బ్రిల్లియెంట్‌గా పనిచేసింది. సినిమా యూనిట్ మొత్తాన్ని చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అని మహేష్ బాబు అన్నారు.
రావు బహద్దూర్ సినిమాను చూసి కొత్త అనుభూతికి లోనయ్యాను. మీరు కూడా అలాంటి అనుభూతిని ప్రత్యక్ష్యంగా అనుభవించాలని నేను కోరుకొంటున్నాను. ఈ సినిమా బిగ్ స్క్రీన్ మీద జూలై 3వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను తప్పకుండా చూడండి అని మహేష్ బాబు తన ట్విట్‌లో రివ్యూను అందించారు.


Click it and Unblock the Notifications

