Rao Bahadur Twitter Review: రావు బహదూర్ మూవీ ట్విట్టర్ రివ్యూ..

Rao Bahadur Twitter Review: సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ ఘట్టమనేని మహేష్ బాబు (GMB) ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'రావు బహద్దూర్'. ఈ సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చింత గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వికాస్ ముప్పాల, మలయాళ నటి దీపా థామస్, బాలా పరసార్, ఆనంద్ భారతీ, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్ బాధ్యతలను దర్శకుడు వెంకటేష్ మహా నిర్వహించడం విశేషం.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా దినేష్ యాదవ్ బొల్లెబోయిన వ్యవహరిస్తుండగా, సినిమాటోగ్రఫీని కార్తీక్ పర్మార్ అందిస్తున్నారు. సంగీతాన్ని స్మరణ్ సాయి స్వరపరుస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌ను రోషన్ సింగ్ రూపొందిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా జీఎన్ఎస్, సౌండ్ డిజైనర్‌గా అశ్విన్ రాజశేఖర్ పనిచేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా జూలై 3వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో రావు బహద్దూర్ సినిమాపై సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రిటిక్స్ అభిప్రాయాలను పరిశీలిస్తే..

Rao Bahadur Twitter Review in Telugu Is Satyadev s Movie Hit the Bull s-Eye

సోషల్ మీడియాలో ఓ అభిమాని 'రావు బహద్దూర్' సినిమాపై తన స్పందనను పంచుకుంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రానికి 3.5/5 రేటింగ్ ఇస్తూ, "ఇది నిజంగా ఓ తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే చిత్రం. రావు బహద్దూర్ మెంటల్ సినిమా రా అయ్యా... ఇలా ఎలా తీశారు? తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూడండి. చాలా కొత్తగా అనిపిస్తుంది. తెలుగు సినిమాల్లో ఇలాంటి ప్రయత్నం ఫస్ట్ టైమ్ అనిపించింది. ఓపెనింగ్ టైటిల్స్ నుంచే మ్యూజిక్, రైటింగ్, యాక్టింగ్ అన్నీ అదిరిపోయాయి. క్రాఫ్ట్స్‌తో పిచ్చెక్కించారు. ఎలాంటి అనుమానం లేకుండా వెళ్లి ఈ కొత్త సినిమాటిక్ అనుభవాన్ని ఆస్వాదించండి. ఇది కచ్చితంగా బ్లాక్‌బస్టర్ సినిమా" అంటూ తన ట్విట్టర్ (ఎక్స్)లో పేర్కొన్నారు.

'రావు బహద్దూర్' సినిమాపై మరో అభిమాని ట్విట్టర్‌లో ప్రశంసలు కురిపించారు. "సత్యదేవ్ టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. రావు బహద్దూర్ కు వస్తున్న అద్భుతమైన స్పందనకు ఆయన నటనే ప్రధాన కారణం. రావు బహద్దూర్ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు వెంకటేష్ మహా కూడా ఇలాంటి భిన్నమైన సినిమాలు మరిన్ని చేయాలి. మొత్తం మూవీ యూనిట్ కు నా అభినందనలు" అంటూ ట్వీట్ చేశారు.

మరో అభిమాని ట్విట్టర్ (ఎక్స్)లో ఎమోషనల్ రివ్యూ రాస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. "నిన్న రాత్రి రావు బహద్దూర్ చూశాను. నిజంగా ఈ సినిమా నాకు చాలా నచ్చింది. తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచే చిత్రాల్లో ఇది కూడా ఒకటి. మూవీ లవర్‌గా మొదటి సన్నివేశం నుంచి చివరి వరకు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. దర్శకుడు ప్రతి విభాగాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశారు. నటీనటుల నటన, సంగీతం, విజువల్స్, ఎడిటింగ్.. ప్రతి అంశం ఎంతో బ్యాలెన్స్‌గా, ప్రభావవంతంగా అనిపించింది" అని పేర్కొన్నారు. అలాగే సత్యదేవ్ నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తూ, "రామప్ప పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. తన కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటి.

అలాగే ఆచార్య పాత్ర కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది" అని రాశారు. మహాతో ఉన్న పాట తనకు చాలా ఫ్రెష్‌గా అనిపించిందని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద హైలైట్ అని కొనియాడారు. "చాలా చోట్ల సైలెంట్ బీజీఎం వాడినా, అవసరమైన చోట ఇచ్చిన స్కోర్ కొత్త అనుభూతిని ఇచ్చింది. కెమెరా వర్క్ టాప్ క్లాస్‌గా ఉంది. ఎడిటింగ్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రామప్ప డ్రీమ్ సీక్వెన్స్, మెదడు నుంచి పురుగు బయటకు వచ్చే సన్నివేశం నెక్స్ట్ లెవల్‌గా అనిపించింది" అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చివరగా, "తెలుగు సినిమాల్లో ఇలాంటి ఫ్రెష్, డేరింగ్, యూనిక్ కథలు మరింత రావాలి. ఇలాంటి టాలెంటెడ్ దర్శకులు, నటులను ప్రేక్షకులు ప్రోత్సహిస్తే ఇంకా ఎన్నో మంచి సినిమాలు వస్తాయి" అంటూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

సత్యదేవ్ సినిమాపై మరో ప్రేక్షకుడు ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమాకు 3/5 రేటింగ్ ఇస్తూ.. "ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక అద్భుతమైన అనుభూతి. భావోద్వేగాలతో కూడిన కథ ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా కట్టిపడేస్తుంది. రాజరిక నేపథ్యం, పీరియాడిక్ సెటప్‌ను ఎంతో అందంగా చూపించారు. నటీనటుల అద్భుతమైన నటన, ఆకట్టుకునే విజువల్స్ ప్రతి సన్నివేశాన్ని మరింత ప్రభావవంతంగా మార్చాయి. మొత్తంగా అన్ని వయసుల ప్రేక్షకులు తప్పక చూడాల్సిన ఎంటర్‌టైనర్" అంటూ ట్విట్టర్‌లో రివ్యూ ఇచ్చారు.

ఈ సినిమాపై మరో అభిమాని ట్విట్టర్ (ఎక్స్)లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ చిత్రానికి 3.5/5 రేటింగ్ ఇస్తూ "సినిమా సాలిడ్‌గా మొదలవుతుంది. కథ నెమ్మదిగా ముందుకు సాగినా, ప్రేక్షకులను ఆసక్తిగా కూర్చోబెడుతుంది. పాటలు కథలో సహజంగా కలిసిపోయాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత తర్వాత ఏమి జరగబోతోందనే ఉత్కంఠను పెంచుతుంది" అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే రెండో భాగంలో కథ మరింత ఆసక్తికరంగా మారుతుందని, ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ఎన్నో సన్నివేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా సత్యదేవ్ నటన సినిమాకు ప్రధాన బలం. తన పాత్రలోని విభిన్న కోణాలను సత్యదేవ్ అద్భుతంగా ఆవిష్కరించాడు. ప్రతి ఎమోషన్‌ను ఎంతో సహజంగా పలికించారు. సినిమాను తన భుజాలపై మోశాడు. క్లైమాక్స్‌లో వచ్చే సర్‌ప్రైజ్ ట్విస్ట్ బాగా వర్కౌట్ అయి సినిమాను హై నోట్‌లో ముగిస్తుంది" అని ప్రశంసించారు. చివరగా.. మొత్తంగా రావు బహద్దూర్ మంచి సినిమాటిక్ అనుభవాన్ని అందించే చిత్రం. సినిమాలో ఎన్నో ఆసక్తికరమైన క్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా సత్యదేవ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ సినిమాగా నిలుస్తోందని అన్నారు.

ఈ సినిమాపై మరో సినీ ప్రియుడు ట్విట్టర్ (ఎక్స్)లో ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే తన స్పందనను పంచుకుంటూ.. రావు బహద్దూర్ ఒక అద్భుతమైన, విభిన్నమైన సినిమాటిక్ అనుభవం. ఏఎంబీ థియేటర్‌లో షో జరుగుతున్న సమయంలో ఎందుకు ఎలాంటి ట్వీట్లు రాలేదని చాలామంది అడిగారు. దానికి సమాధానం ఒక్కటే.. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ పూర్తిగా కథలో లీనమైపోయారు. ఫోన్లు తీసి ట్వీట్ చేయాలనే ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. ప్రేక్షకులను ఆ స్థాయిలో తన ప్రపంచంలోకి తీసుకెళ్లిన సినిమా ఇది" అని పేర్కొన్నారు.

అలాగే దర్శకుడు వెంకటేష్ మహా ను అభినందిస్తూ.. "అసాధ్యంగా అనిపించే కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. సినిమా మొత్తం ఒక ఫీవర్ డ్రీమ్‌లా అనిపించింది. భయానకంగా, హిప్నోటిక్‌గా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త అనుభూతిని అందించింది. రావు బహద్దూర్ కేవలం చర్చించుకునే సినిమా మాత్రమే కాదు.. చాలా కాలం పాటు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే చిత్రం" అంటూ తన ట్విట్టర్ రివ్యూలో రాసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X