»   » ప్రేమ నుంచి పెళ్లి వరకు (రారండోయ్ వేడుక చూద్దాం మూవీ రివ్యూ)

ప్రేమ నుంచి పెళ్లి వరకు (రారండోయ్ వేడుక చూద్దాం మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

2016లో ప్రేమమ్ లాంటి ఫీల్ గుడ్ మూవీని, సాహసం శ్వాసగా సాగిపో ఫ్లాఫ్‌ను సొంతం చేసుకొన్న అక్కినేని నాగార్జున 2017లో రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది చైతూ ఖాతాలో భారీ హిట్‌ను చేర్చేందుకు స్వయంగా అక్కినేని నాగార్జున నిర్మాతగా మారి సొంత బ్యానర్‌ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందించారు. చైతూ, అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌ ఈ చిత్రంలో జోడి కట్టారు. విడుదలకు ముందే ఈ జోడికి మంచి రెస్పాన్స్ వచ్చింది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ట్రైలర్‌లో ఆకట్టుకొన్నది. ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నిరకాల పాజిటివ్ టాక్‌ను కూడగట్టుకొన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ ఇదే..

కథ ఇదే..

కృష్ణ (జగపతిబాబు), ఆది (సంపత్) ప్రాణ స్నేహితులు. కానీ ఓ విషయంలో వారిద్దరూ విడిపోతారు. కృష్ణ కూమారుడు శివ (నాగచైతన్య), ఆది కూతురు భ్రమరాంబ (రకుల్ ప్రీత్ సింగ్) ఓ పెళ్లి కలుసుకొంటారు. వారి మధ్య ఏర్పడిన పరిచయం వారిని చాలా దగ్గరికి తీస్తుంది. భ్రమరాంబ అంటే శివకు చెప్పలేనంత ఇష్టం. తన మనసులోని ప్రేమను చెబితే భ్రమరాంబ ఎక్కడ దూరం అవుతుందనే భయంతో కృష్ణ తనలోనే ఉంచుకొంటాడు. అయితే బ్రమరాంబ మరో రకంగా ఉంటుంది. తన కోసం ఆకాశం నుంచి రాజకుమారుడు వస్తాడు. పూలబాటపై నడిపిస్తాడు. పడవ లాంటి కారులో ఊరేగిస్తాడు లాంటి భ్రమల్లో బతుకుతూ ఉంటుంది. ఆ భ్రమల్లో బతికే బ్రమరాంబ శివ ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంది. ఓ సందర్భంలో శివ తన మనసులోని ప్రేమను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో శివ ప్రేమను భ్రమరాంబ అపార్థం చేసుకొంటుంది. తన తండ్రి ఇష్టం మేరకు తన బావను పెళ్లి చేసుకోవడానికి సిద్దపడుతుంది.


ముగింపు ఇలా..

ముగింపు ఇలా..

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భ్రమరాంబను ఎలా ఒప్పించి పెళ్లి చేసుకొంటాడు? శివ ప్రేమను భ్రమరాంబ అర్థం చేసుకోవడానికి ఎలాంటి పరిస్థితులు దోహదపడ్డాయి. కృష్ణ, ఆది స్నేహాన్ని దెబ్బ తీసిన మూడో వ్యక్తి ఎవరు. కృష్ణ, ఆది ఎందుకు విడిపోయారు? మళ్లీ వారిద్దరూ ఎలా ఒక్కటయ్యారు? శివ, భ్రమరాంబలు రారండోయ్ మా పెళ్లి వేడుకకు ఆహ్వానించడానికి అనుకూలించిన పరిస్థితులు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా.


ఫస్టాఫ్ సాగతీత..

ఫస్టాఫ్ సాగతీత..

రారండోయ్ వేడుకు చూద్దాం సినిమా రెండు కుటుంబాలు మధ్య చోటుచేసుకొన్న అపోహలు, అపార్థాలు, ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సంఘర్షణ అంశాలను కథగా అల్లుకొని రూపొందించారు. అన్ని సినిమాల్లో మాదిరిగానే ఎలాంటి కొత్తదనం లేకుండా దర్శకుడు రొటీన్‌గా కథను నడిపించాడు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో ఉండే భావోద్వేగాలు, ప్రేమ, అప్యాయత, అనురాగాలు పాత్రల్లో చక్కగా కనిపిస్తాయి. అలాంటి అంశాలు ఈ చిత్రంలో ఉన్నప్పటికీ వాటిలో సహజత్వం లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయంతో కొంత టైంపాస్ అయినా.. మధ్యలో చైతూ, రకుల్‌ల మధ్య సన్నివేశాలు అంత పండకపోవడం, అసందర్భంగా పాటలు రావడం ఇబ్బందికరంగా మారింది. చిత్ర తొలిభాగంలో ఎడిటింగ్‌పై మరి కాస్త దృష్టిపెడితే కొంత క్రిస్ప్‌గా ఉండటానికి అవకాశం ఉండేది.


సెకండాఫ్ ఆసక్తి..

సెకండాఫ్ ఆసక్తి..

రెండో భాగంలో అసలు కథ ఆసక్తికరంగా ఉంటుందనుకొన్న వారికి నిరాశే మిగిలింది. జగపతిబాబు, సంపత్ విడిపోవడం వెనుక ఉన్న ట్విస్ట్ ఎఫెక్టివ్‌గా లేకపోవడం మరింత నీరసంగా మారింది. కథకు ముగింపు ఏమిటో అనేది చాలా రోటిన్. చిన్నపిల్లాడిని అడిగినా ఏం జరుగుతుందో ఊహించివచ్చు. అది సమస్య కాదు. క్లైమాక్స్ వరకు సినిమాపై పట్టు సడలకుండా ప్రేక్షకుడిని ఎలా తీసుకెళ్లాడన్న దానిని బట్టే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు కల్యాణ్ కృష్ణ తడబాటుకు గురయ్యాడు. చైతూ, రకుల్ మధ్య రొమాన్స్‌ను మరింత పండించాల్సింది. నిన్నే పెళ్లాడుతా కథతో స్ఫూర్తి పొందినట్టు కనిపించే ఈ సినిమాపై కథనంపై దృష్టిపెట్టినట్టయితే చైతూ ఖాతాలో మరో భారీ హిట్ చేరేది. అన్నివర్గాల (బీ, సీ సెంటర్ల పక్కనపడితే) ప్రేక్షకులు ఆదరించడంపైనే ‘రారండోయ్' ఏ రేంజ్ హిట్ అనేది ఆధారపడి ఉంటుంది.


చాలా ఈజ్‌గా చైతూ

చాలా ఈజ్‌గా చైతూ

నాగచైతన్యకు ఇప్పటివరకు క్లాస్ హీరో అనే ఇమేజ్ ఉంది. అయితే ఆ ఇమేజ్ నుంచి బయట పడటానికి చైతూ చేసిన ప్రయత్నం బాగుంది. అయితే అటు మాస్ కాకుండా, ఇటు క్లాస్‌కు మధ్యలో శివ పాత్ర నలిగిపోయింది. అందుకు కారణం పాత్రను సరైన రీతిలో తీర్చిదిద్దకపోవడమే. గత చిత్రాలతో పోల్చుకుంటే చైతూ చాలా ఈజ్ కనిపించాడు. కీలక సన్నివేశంలో చైతూ చెప్పిన డైలాగ్స్‌కు ప్రేక్షకుల చప్పట్లు పడటం ఖాయం. నటుడిగా చైతూలో పరిణతి కనిపించింది. ఇక స్టార్ హోదా రావాలంటే సరైన చిత్రాలు ఎంచుకోవడమే చైతూ ముందున్న ఎకైక మార్గం.


రకుల్ ప్రీత్ సింగ్ కూల్..

రకుల్ ప్రీత్ సింగ్ కూల్..

రకుల్ ప్రీత్ సింగ్ నటన సినిమా సినిమాకు మరింత మెరుగుపడుతున్నది. ‘రారండోయ్' సినిమా భారాన్ని ఎక్కువ భాగం రకుల్ మోసిందనే చెప్పవచ్చు. అంతటి బరువైన పాత్రకు న్యాయం చేకూర్చేందుకు రకుల్ శాయశక్తులా ప్రయత్నించింది. రకుల్ పాత్రకు తగినట్టు ధరించిన క్యాస్టూమ్స్ చాలా బాగా ఉన్నాయి. నేటి అమ్మాయిలు ఫాలో అయి కొత్త ట్రెండ్ సృష్టించేంతగా రకుల్ కోసం క్యాస్టూమర్ నీరజ కోన ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు. రకుల్ కెరీర్‌లో భ్రమరాంబ పాత్ర గుర్తుండిపోయే రోల్ అని చెప్పవచ్చు.


మరోసారి జగపతి నుంచి..

మరోసారి జగపతి నుంచి..

చైతూ తండ్రిగా కృష్ణ పాత్రలో జగపతిబాబు హుందాతనం ఉన్నట్టువంటి కారెక్టర్‌ను పోషించాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు సినిమాల్లోని పాత్రల ఛాయలు ఆది క్యారెక్టర్‌లో కనిపిస్తాయి. జగ్గుభాయ్‌కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. రారండోయ్ చిత్రం జగపతిబాబు కోణంలో నడిచే సినిమా. తన పాత్ర పరిధి మేరకు జగపతిబాబు మరోసారి మంచి నటనను కనబరిచాడు.


అనేక కోణాల్లో సంపత్

అనేక కోణాల్లో సంపత్

ఈ చిత్రంలో సంపత్ కు మంచి పాత్ర లభించింది. ప్రేమానురాగాలను కురిపించే తండ్రిగా, చెల్లిని కోల్పోయిన అన్నగా, తనకు అన్యాయం జరిగిందని రగిలిపోయే విలన్ ఛాయలున్న పాత్రలో సంపత్ జీవించాడు. కేవలం విలన్ పాత్రలకే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించే సత్తా ఉందని నిరూపించుకునే అవకాశం సంపత్‌కు దక్కింది.


దేవీ శ్రీ మ్యాజిక్..

దేవీ శ్రీ మ్యాజిక్..

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆడియోపరంగా (1) భ్రమరాంబకి నచ్చేశాను (2) తకిట తకజం (3) రారండోయ్ వేడుక చూద్దాం (4) నీ వెంట నేనుంటే పాటలు వినసొంపుగా ఉన్నాయ. ఇక తెరమీదకు వస్తే పాటలకు సంగీతం ప్రాణం పోసింది. నడిరేయిలో ప్రశాంతమైన సముద్రంలో విహారం చేసినట్టు పాటలు ఆహ్లాదకరంగా సాగిపోయాయి. ఆదిత్య మ్యూజిక్ అందించిన ఆడియో క్వాలిటీ బాగున్నది.
రారండోయ్ వేడుకను చూసేందుకు ప్రధాన కారణాలు

రారండోయ్ వేడుకను చూసేందుకు ప్రధాన కారణాలు

నాగచైతన్య మాస్ లుక్స్రకుల్ గ్లామర్


చైతూ, రకుల్ బ్రేకప్ సీన్


వెన్నెల కిశోర్ కామెడీ


దేవీ శ్రీ మ్యూజిక్


జగపతి, సంపత్ యాక్టింగ్


కల్యాణ్ మలి ప్రయోగం..

కల్యాణ్ మలి ప్రయోగం..

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి లాంటి అగ్రతారలతో సొగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో తొలి చిత్ర దర్శకుడిగా కల్యాణ్ కృష్ణ మంచి మార్కులే కొట్టేశాడు. మలి చిత్రాన్ని మళ్లీ అదే అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లో తీస్తున్నారనే సరికి కల్యాణ్‌పై మరింత అంచనాలు పెరిగాయి. ఈ సారి యువ జంటను పెట్టి ప్రేమ కథను తెరకెక్కించాడు. అయితే కథపై బాగా కసరత్తు చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించవు. రారండోయ్ సినిమా చూస్తుంటే చాలా సాదాసీదా ప్రేమ కథను తీశాడని అర్థమవుతుంది. చైతూ, రకుల్ లాంటి పెయిర్‌ మధ్య రొమాన్స్ అసలు చోటు లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం సీన్ వెతుక్కోవాల్సిన పరిస్థితి తెరమీద కనిపించింది. ఇంటర్వెల్ పాయింట్ చూస్తే సినిమా పరిస్థితి ఏంటో అంచనా వేయవచ్చు.మాస్‌ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఫైట్స్‌ను దర్శకుడు ఇరికించినట్టు అనిపిస్తుంది. నాగ చైతన్య, జగపతిబాబు, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మధ్య వచ్చే సన్నివేశాలపైనే దర్శకుడు దృష్టి పెట్టిన దర్శకుడు మిగతా విషయాలను కాస్త పట్టించుకుని ఉంటే ఇంకా బాగుండేది.


ద్వితీయ విఘ్నం

ద్వితీయ విఘ్నం

మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టి రెండో సినిమాతో తడబాటుకు గురైన దర్శకులు చాలా మందే ఉన్నారు. సినీ పరిశ్రమలో ఈ సమస్యను ద్వితీయ విఘ్నం (సెకండ్ సినిమా సిండ్రోమ్) అంటారు. సోగ్గాడే చిన్నినాయనా చిత్రంతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకొన్న కల్యాణ్ కృష్ణ.. రారండోయ్ వేడుక చూద్దాం విషయంలో తడబాటుకు గురయ్యాడని చెప్పవచ్చు. తన రెండో చిత్రం యావరేజ్ అని చెప్పుకోవాల్సి వచ్చింది.


స్క్రీన్ ప్లే‌ తడబాటు..

స్క్రీన్ ప్లే‌ తడబాటు..

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కథ ఎలా ఉన్నా.. కథనంలో కొత్తదనం ఉండాలి. ప్రేమ కథలకు బలమైన స్క్రీన్‌ప్లే ఆయువు పట్టు. పరిశ్రమలో చాలా సినియర్ అయిన సత్యానంద్ పక్కా స్క్రీన్ ప్లే అందించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు.


మరిన్ని కత్తెర్లు..

మరిన్ని కత్తెర్లు..

ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. తొలిభాగంలో చాలా సాగతీత కనిపిస్తుంది. తొలిభాగంలో కొన్ని కత్తెర్లు పడితే కొంతైనా ఆసక్తి పెరుగవచ్చు. కొన్ని పాటలు రాంగ్ టైమింగ్‌లో వచ్చాయనే ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనంలో బలం లేకపోవడంతోనే ఎడిటింగ్‌లో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.


విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ..

విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ..

పల్లెటూరు, పట్టణ వాతావరణాన్ని మేలవించి చక్కటి దృశ్యాలను అందించేందుకు సినిమాటోగ్రాఫర్‌‌గా ఎస్వీ విశ్వేశ్వర్ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. సన్నివేశాల్లో దమ్ము లేకపోయినా.. తన ప్రతిభతో ప్రకృతి అందాలను బాగా తెరకెక్కించారు.


నాగార్జున ప్రొడక్షన్ వ్యాల్యూస్..

నాగార్జున ప్రొడక్షన్ వ్యాల్యూస్..

ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను రూపొందించడంలో నాగార్జునకు ప్రత్యేకమైన స్టయిల్ ఉంది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై రూపొందింన నిన్నే పెళ్లాడుతా, సొగ్గాడే చిన్నినాయనా చిత్రాలు ఆయన అభిరుచికి అద్దం పట్టాయి. ఎప్పటిలాగానే నాగార్జున తన రేంజ్‌లోనే ఖర్చు పెట్టారు. ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా తీర్చిదిద్దే బాధ్యతను నిర్మాతగా సమర్థవంతంగా పోషించారు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి. ఎడిటింగ్ టేబుల్‌పై చాలా కసరత్తు చేశామని ఇటీవల నాగార్జున చెప్పారు. కథ, కథనంపై మరింత దృష్టిపెడితే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తప్పకుండా నిన్నే పెళ్లాడుతా చిత్రమయ్యేది.


బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

పాజిటివ్ పాయింట్స్
రకుల్ ప్రీత్ సింగ్ అభినయం
నాగచైతన్య యాక్టింగ్


నెటిగివ్ పాయింట్స్
కథ, కథనం
పాత్రల చిత్రీకరణ
ఎడిటింగ్తెర ముందు, తెరవెనుక..

తెర ముందు, తెరవెనుక..

నటీనటులు: అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, సంపత్‌రాజ్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్, చలపతిరావు, సురేఖవాణి, అవంతిక
నిర్మాత: నాగార్జున అక్కినేని
దర్శకత్వం: కల్యాణ్ కృష్ణ కురసాల
స్క్రీన్ ప్లే: సత్యానంద్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి: ఎస్వీ విశ్వేశ్వర్
ఎడిటింగ్: గౌతమ్ రాజ్
ప్రొడక్షన్: అన్నపూర్ణ స్టూడియోస్
రిలీజ్: మే 26, 2017


ట్యాగ్‌లైన్.. చెప్పాల్సిందంతా చెప్పాం.. మాకు సంబంధం లేదు..English summary
Naga Chaitanya, Rakul Preet Singh's Rarandoi Veduka Chuddam movie released on May 26, 2017. This movie has lot expectations from audience. This movie produced by Nagarjuna Akkineni. Music By Devi Sri Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu