twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mission Majnu Review భారత్, పాక్ మధ్య అణు వార్ నేపథ్యంగా.. డిఫరెంట్ పాత్రలో రష్మిక మందన్న!

    |

    Rating:
    2.5/5
    Star Cast: సిద్దార్థ్ మల్రోత్రా, రష్మిక మందన్న, పర్మిత్ సేథి, రజిత్ కపూర్
    Director: శంతను బాగ్చీ

    భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ద నేపథ్యం, సీక్రెట్ ఆపరేషన్స్ నేపథ్యంగా బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గదర్ ఏక్ ప్రేమ్ కహానీ, ఇతర బాలీవుడ్ చిత్రాలను ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేశాయి. అలాంటి ఫీల్ ఉన్న కథతో రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఆపరేషన్స్ నేపథ్యంగా వచ్చిన చిత్రం మిషన్ మజ్ను.

    70వ దశకంలో పోక్రాన్ అణు పరీక్షల తర్వాత రెండు దేశాల్లో చెలరేగిన ప్రకంపనల నేపథ్యంలో చోటుచేసుకొన్న పరిణామాల బ్రాక్ డ్రాప్‌గా మిషన్ మజ్ను వచ్చింది. రష్మిక మందన్న, సిద్దార్థ్ మల్హోత్రా నటించిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందనే విషయంలోకి వెళితే..

    మిషన్ మజ్ను కథ ఏమిటంటే?

    మిషన్ మజ్ను కథ ఏమిటంటే?

    పాకిస్థాన్‌లోని రావల్పిండిలో భారత గూఢచారి అమన్ దీప్ సింగ్ అలియాస్ తారీఖ్ హుస్సేన్ (సిద్దార్థ్ మల్హోత్రా) టైలర్‌గా పనిచేస్తుంటాడు. తన యజమాని కుటుంబం వ్యతిరేకించినా దృష్టిలోపం ఉన్న నస్రీన్ (రష్మీక మందన్న)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు.

    1974లో భారత్‌లో జరిగిన పోక్రాన్ న్యూక్లియర్ పరీక్షల అనంతరం పాకిస్థాన్ అణుబాంబు చేయడానికి సిద్దమవుతుందనే విషయంపై తారీఖ్ హుస్సేన్ నిఘా పెడుతాడు. అణుబాంబు తయారీపై పాకిస్థాన్ ప్రభుత్వంలో జరుగుతున్న వ్యూహాలను టైలర్‌గా పనిచేస్తూ భారత్‌కు అక్కడి రహస్యాలను తారీఖ్ చేరవేస్తుంటాడు. తారీఖ్ చేపట్టిన పనికి మిషన్ మజ్ను అని పేరు పెడుతారు.

    మిషన్ మజ్నులో ట్విస్టులు

    మిషన్ మజ్నులో ట్విస్టులు

    తారీఖ్ హుస్సేన్‌గా మారిన అమన్ దీప్ సింగ్ గతం ఏమిటి? ప్రాణాలకు తెగించి పాక్‌లో ఎందుకు గూఢచారిగా మారాడు? అమన్ దీప్ సింగ్ తండ్రి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? అమన్ దీప్ తండ్రిపై దేశ ద్రోహి అనే ముద్ర ఎందుకు పడింది? అంధత్వంతో బాధపడే నస్రీన్‌‌ను ఎందుకు పెళ్లి చేసుకొన్నాడు? పాక్‌లో అణుబాంబు తయారీకి జరిగే ప్రక్రియ రహాస్యాలను భారత్‌కు చేరవేశాడా? తన భార్య నస్రీన్‌ను పాక్‌ నుంచి దుబాయ్‌కి ఎందుకు పంపించాలనుకొన్నాడు? మిషన్ మజ్ను ప్రాజెక్ట్ వల్ల భారత్‌‌కు ఎలాంటి మేలు జరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే మిషన్ మజ్ను సినిమా.

    పోక్రాన్ అణు పరీక్షల నేపథ్యంగా

    పోక్రాన్ అణు పరీక్షల నేపథ్యంగా

    జపాన్‌లో జరిగిన అణు పేలుళ్లు, పోక్రాన్‌లో భారత్ చేపట్టిన అణు పరీక్షల అంశాలను డాక్యుమెంటరీగా చెప్పడం ద్వారా మిషన్ మజ్ను కథ మొదలవుతుంది. టైలర్‌గా తారీఖ్ పరిచయంతో కథ మొదలవుతుంది.

    ఆ తర్వాత పాక్, భారత్ అణు వివాదాలకు కాస్త విరామం ఇచ్చి.. నస్రీన్‌తో పెళ్లి వ్యవహారం ముగించే పనిని దర్శకుడు చకచకా పూర్తి చేశాడు. ఆ తర్వాత భారత్‌లో రాజకీయ మార్పులు, ఇందిరాగాంధీ ఓటమి, మురార్జీ దేశాయ్ ప్రధాని కావడం అంశాలతో కథ ముందుకు సాగుతుంది.

    దేశభక్తికి, ప్రేమ కథను జోడించి

    దేశభక్తికి, ప్రేమ కథను జోడించి

    ఇక పాక్‌లో రాజకీయ సంక్షోభం, జుల్ఫీకర్ అలీ భుట్టోను పదవి నుంచి దింపేసి జియా ఉల్ హక్ అధ్యక్షుడిగా మారడం లాంటి అంశాలతో చరిత్రను నేటితరానికి చ చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఇలాంటి పరిణామాల మధ్య కథను థ్రిల్లింగ్‌గా చెప్పడంలో దర్శకుడు తడబాటుకు లోనయ్యాడని చెప్పవచ్చు. ఇక ప్రేమ కథ, ఎమోషనల్ అంశాలు కూడా పెద్దగా వర్కువట్ కాలేదు. కానీ చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలను సినిమాకు హైలెట్‌గా అనిపిస్తాయి.

    సిద్దార్థ్ మల్హోత్రా ఫెర్ఫార్మెన్స్

    సిద్దార్థ్ మల్హోత్రా ఫెర్ఫార్మెన్స్

    దేశం కోసం ప్రాణాలు అర్పించే త్యాగధనుడిగా సిద్దార్థ్ మల్హోత్రా మరోసారి మెచ్యురిటీతో కూడిన ఫెర్ఫార్మెన్స్ చేశాడు. టైలర్ తారిఖ్‌గా, దేశం కోసం పనిచేసే అమన్ దీప్ అనే రా ఏజెంట్‌గా రెండు రకాల పాత్రల్లో ఒదిగిపోయాడు. క్లైమాక్స్‌లో భార్య నస్రీన్‌తో ఉండే సన్నివేశాలు కొంత ఎమోషనల్ కనిపిస్తాయి. దుబాయ్‌కి చేరుకొన్న నస్రీన్‌కు తన భర్త ఎవరో అనే విషయం ఎమోషనల్‌గాను, సినిమాటిక్‌గాను అనిపిస్తాయి.

    అంధ యువతిగా రష్మిక మందన్న

    అంధ యువతిగా రష్మిక మందన్న

    నస్రీన్‌గా రష్మిక మందన్నకు కెరీర్ పరంగా పెద్దగా ఉపయోగపడే సినిమా కాదనే చెప్పవచ్చు. నస్రీన్ పాత్ర ద్వారా ఎమోషన్స్ పండించడానికి అవసరం ఉన్నా.. ఆ పాత్రకు అవకాశం కల్పించలేదనేది స్పష్టంగా తెలుస్తుంది. తన పాత్ర పరిధి మేరకు అంధ యువతిగా రష్మిక న్యాయం చేసే ప్రయత్నం చేసింది. ఆర్ ఎన్ కావ్‌గా పర్మీత్ సేథి, జుల్ఫీకర్ అలీ భుట్టోగా రజిత్ కపూర్, మురార్జీ దేశాయ్‌గా అవిజిత్ దత్, జనరల్ జియాగా అశ్వత్ భట్, ఇందిరా గాంధీని పోలిన పాత్రలో అవంతికా అక్రేర్కర్ నటించారు.

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. పాక్ వాతావరణాన్ని ఎలివేట్ చేయడంలో బిజితేష్ దే సినిమాటోగ్రఫి ఆకట్టుకొన్నది. యాక్షన్ సీన్ల కొన్ని ఆలరించాయి. కేతన్ సోదా మ్యూజిక్ భారీగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సాంకేతిక అంశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. RSVP Movies బ్యానర్‌పై రోనీ స్కూవాలా అనుసరించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    పోక్రాన్ అణు పరీక్షల తర్వాత భారత్‌పై ప్రతీకారం తీర్చుకొనేందుకు పాకిస్థాన్ ప్రారంభించిన మిషన్‌ సీక్రెట్స్‌ను బట్టబయలు చేసే కథతో మిషన్ మజ్ను సినిమా తెరకెక్కింది. ఆకలితో చావడానికైనా సిద్దమే.. గడ్డి తిని ఆకలిని తీర్చుకొందాం అంటూ పాక్ ప్రధాని చెప్పే కుట్రపూరితం కథలో కనిపిస్తుంది. కానీ నరాలు ఉప్పొంగే భావోద్వేగాన్ని తట్టి లేపే కథ మిషన్ మజ్ను సినిమాలో కనిపించదు.

    స్పై థ్రిల్లర్‌గానా? లేదా ప్రేమ కథాగా చెప్పాలా? అనే ఊగిసలాట కథలో కనిపిస్తుంది. గతంలో పాకిస్థాన్‌లో గూఢచారి కథతో వచ్చిన సినిమాలకు ధీటుగా మిషన్ మజ్ను లేదనే చెప్పాలి. దేశభక్తి, పాక్, భారత్ మధ్య వార్, వివాదాలతో వచ్చే సినిమాల ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. చివర్లో వచ్చే సీన్లు చూస్తే.. ఈ సినిమా తెరకెక్కించడం వెనుక బీజేపీ ఎజెండా ఏదైనా ఉందా అనుమానం కలుగుతుంది.

    మిషన్ మజ్నులో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    మిషన్ మజ్నులో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: సిద్దార్థ్ మల్రోత్రా, రష్మిక మందన్న, పర్మిత్ సేథి, రజిత్ కపూర్ తదితరులు
    దర్శకత్వం: శంతను బాగ్చీ
    రచన: పర్వీజ్ షేక్, అసీమ్ అరోరా
    నిర్మాతలు: రోని స్క్రూవాలా, అమర్ బుటాలా, గరిమా మెహతా
    సినిమాటోగ్రఫి: బిజితేష్ దే
    ఎడిటింగ్: నితిన్ బేద్, సిద్దార్థ్ ఎస్ పాండే
    మ్యూజిక్: కేతన సోదా
    ఓటీటీ రిలీజ్: నెట్ ఫ్లిక్స్
    ఓటీటీ రిలీజ్ డేట్: 2023-01-20

    English summary
    Rashmika Mandanna and Sidharth Malhotra's Mission Majnu is a Spy Thirller based on Indo Pak incidents after Pokran Nuclear test. This movie is streaming on Netflix OTT.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X