Ravanasura Review రవితేజ డిఫరెంట్ అటెంప్ట్.. కానీ!

Rating: 2/5

నటీనటులు: రవితేజ, సుశాంత్, శ్రీరామ్, అను ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయప్రకాశ్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాత: అభిషేక్ నామా, రవితేజ
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్
కథ, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సెసిరోలియో
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: డీఆర్కే కిరణ్
సీఈవో: పొటిని వాసు
పీఆర్వో: వంశీ శేఖర్
రిలీజ్ డేట్: 2023-04-07

రావణాసుర కథ ఏమిటంటే? : రవీంద్ర అలియాస్ రవి (రవితేజ) లాయర్. కనకమహాలక్ష్మీ (ఫరియా అబ్దుల్లా) వద్ద జూనియర్ లాయర్‌గా పనిచేస్తుంటాడు. ఇదిలా ఉండగా గవర్నమెంట్ ఆఫీసర్ (జయ ప్రకాశ్), పోలీస్ ఆఫీసర్ (మురళీ శర్మ), ఫార్మా కంపెనీ ఎండీ హారిక (మేఘా ఆకాశ్) దారుణ హత్యకు గురవుతారు. సంచలనం రేపిన హత్యల వెనుక రవి హస్తం ఉందని ఏసీపీ హన్మంతు (జయరామ్) అనుమానిస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో హోం మినిస్టర్ (రావు రమేష్) హత్యకు కూడా ప్లాన్ చేస్తారు.

రావణాసురలో ట్విస్టులు :
లాయర్‌గా పనిచేసే రవీంద్రకు జరిగిన ప్రముఖుల హత్యకు సంబంధముందా? సాకేత్ రామ్ (సుశాంత్)ను బ్లాక్ మెయిల్ చేస్తూ, అతడి ప్రియురాలు (దక్ష నగార్కర్)ను రవీంద్ర కిడ్నాప్ ఎందుకు చేశాడు? హోంమంత్రిని చంపడానికి చేసే ప్రయత్నాలను ఏసీపీ హనుమంతు (జయరామ్) అడ్డుకొన్నాడా? సమాజంలో పేరున్న ప్రముఖుల హత్యల వెనుక హస్తం ఎవరిది? ఏ ప్రయోజనాల కోసం హత్యలు జరిగాయి? హోంమంత్రిపై హత్యా ప్రయత్నం జరిగిందా? తన మీద వచ్చి హత్యానేరం ఆరోపణల నుంచి లాయర్ రవీంద్ర ఎలా తప్పించుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే రావణాసుర సినిమా కథ.

Ravanasura Review

రావణసుర ఫస్టాఫ్ అనాలిసిస్ : సీరియల్ మర్డర్స్ బ్రాక్ డ్రాప్‌తో రావణసుర మూవీ చాలా రెగ్యులర్, రొటీన్ కామెడీతో కథ ముందుకెళ్తుంది. రవితేజ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌ను ద‌ృష్టిలో పెట్టుకొని దర్శకుడు సుధీర్ వర్మ సేఫ్ గేమ్ ఆడినట్టు ఫస్టాప్‌లో స్పష్టమవుతుంది. అయితే ఫస్టాఫ్‌లో ట్విస్టులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నప్పటికీ.. కథనంలో ఆసక్తి లేకపోవడం వల్ల రెగ్యులర్ రివేంజ్ డ్రామా చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. సాకేత్ (సుశాంత్) క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత ఇక క్లైమాక్స్ ఏమిటో అనే విషయం ఫస్టాఫ్‌లోనే క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఫస్టాఫ్ మాత్రం రవితేజ ఫెర్ఫార్మెన్స్ కారణంగా బాగుందనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది.

రావణసుర సెకండాఫ్ గురించి : సెకండాఫ్‌లో క్లైమాక్స్ ఏం జరుగుతుందని తెలిసిన తర్వాత.. క్లైమాక్స్ వరకు కథను ఎలా తీసుకెళ్తాడనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అయితే ఏ సినిమాకైనా సెకండాఫ్‌లో స్టోరి డెస్టినేషన్ ఎలా చేరిందనే విషయమే సక్సెస్, ఫెయిల్యూర్‌ను డిసైడ్ చేస్తుంది. రావణాసుర విషయంలో స్టోరి డెస్టినేషన్ చేరడంలో పెద్దగా ఎమోషనల్‌గా, థ్రిలింగ్‌గా, షాకింగ్‌గా లేకపోయిందనే చెప్పాలి. రెగ్యులర్, రొటీన్ స్క్రీన్ ప్లేతో క్లైమాక్స్ వరకు కథను లాగించాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా రావణసుర మాత్రం రవితేజ మార్క్ సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది.

Ravanasura Review

బెంగాలీ సినిమాతో సుధీర్ వర్మ ప్రయోగం : దర్శకుడు సుధీర్ వర్మకు క్రైమ్, థ్రిల్లర్ జోనర్‌లో కొత్త కంటెంట్‌తో ప్రయోగాలు చేస్తాడనే పేరుంది. కానీ రావణసురకు మాత్రం విన్సి డా అనే బెంగాలీ సినిమా మూల కథను బేస్‌గా తీసుకొని రవితేజ, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మార్పులు చేసి మరో ప్రయోగమే చేశాడనే చెప్పాలి. అయితే సెకండాఫ్ విషయంలో దర్శకుడు కమాండ్ కోల్పోయారనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఓవరాల్‌గా పాత్రలను, థ్రిల్లింగ్ మూమెంట్స్ డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

రవితేజ వన్ మ్యాన్ షో : రావణాసుర సినిమాకు కర్త, కర్మ, క్రియ రవితేజ. కేవలం మాస్ మహారాజా సోల్ ఫెర్పార్మెన్స్‌తో సినిమా సాగుతుంది. కానీ కొన్ని సీన్లలో రవితేజ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొంటే.. ఓ వర్గం ప్రేక్షకులు జీర్ణించుకోవడం కష్టమే అనిపిస్తుంది. పాత్ర డిమాండ్ చేసినప్పటికీ.. రవితేజ ఇమేజ్ మాత్రం ఆ క్యారెక్టర్‌ తీరుతెన్నులకు అడ్డుపడినట్టు అనిపిస్తుంది. రవితేజలో కొత్తదనం ఆశించే వారికి, ఫ్యాన్స్‌కు మాత్రం ఆయన ఫెర్ఫార్మెన్స్ పండుగని చెప్పవచ్చు. మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే.. సుశాంత్ క్యారెక్టర్ డిజైన్ కొత్తగా ఉంది. సుశాంత్ టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో మంచి ఈజ్‌ను ప్రదర్శించాడు.

Ravanasura Review

సపోర్టింగ్ క్యారెక్టర్ల గురించి : మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే.. రవితేజ క్యారెక్టర్ చుట్టు అల్లుకొన్నవే. ఏ క్యారెక్టర్‌కు బలమైన బ్యాకప్ లేదనే ఫీలింగ్ కలుగుతుంది. కొంతలో కొంత మేఘా ఆకాశ్, పూజిత పొన్నాడ క్యారెక్టర్లు బెటర్‌గా అనిపిస్తాయి. దక్ష, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా పాత్రలు ఆటలో అరటిపండుగా మాత్రమే కనిపిస్తాయి. మురళీ శర్మ, సంపత్, రావు రమేష్ పాత్రలు అతిథులుగానే కనిపిస్తాయి. జయరామ్ క్యారెక్టర్ కథపై ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంటుంది.

సాంకేతిక విభాగాల పనితీరు ఎలా ఉందంటే? : సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్ పెద్దగా ప్రభావం చూపలేదనే ఫీలింగ్ కలుగుతుంది. రీమిక్స్ చేసిన పాట కూడా సినిమాలో ఆకట్టుకోలేదనే చెప్పాలి. రీరికార్డింగ్ కొన్ని సీన్లలో తప్పా అంతగా ఆకట్టుకోదు ఫైట్స్ ఈ సినిమాలో బాగా డిజైన్ చేశారు. మాస్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు.

ఫైనల్‌గా : క్రైమ్, మిస్టరీ, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, షాకింగ్ స్క్రీన్ ప్లే లాంటి అంశాలతో రూపొందిన చిత్రం రావణాసుర. రవితేజ తన రెగ్యులర్ ఇమేజ్, స్టైయిల్‌ను పక్కన పెట్టి.. సరికొత్తగా ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. సుశాంత్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ లాంటి నటీనటుల ఫెర్ఫార్మెన్స్ అదనపు ఆకర్షణ. థ్రిల్లర్ ఎలిమెంట్స్ సినిమాకు పాజిటివ్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ రెగ్యులర్ ఫార్మాట్‌తో కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉంటుంది. రవితేజ ఫ్యాన్స్, క్రైమ్, మర్డర్ మిస్టరీలను ఇష్టపడే వారికి రావణాసుర నచ్చుతుంది. అతిగా ఆశపడి.. అంచనాలు పెట్టుకొని వెళితే నిరాశపరుస్తుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఎక్కితే రావణాసుర రూపంలో రవితేజకు మరో హిట్ పడే అవకాశం ఉంది.

బలం, బలహీనతలు
పాజిటివ్ పాయింట్స్
రవితేజ ఫెర్ఫార్మెన్స్
సుధీర్ వర్మ టేకింగ్
సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్
సెకండాఫ్
రెగ్యులర్ రివేంజ్ డ్రామా
క్లైమాక్స్ కోసం సాగదీత

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X