Asalu Review: ఆన్ లైన్ క్లాసులో లైవ్ మర్డర్.. పూర్ణ, రవిబాబు 'అసలు' ఆకట్టుకుందా?

రేటింగ్: 2.5/5

టైటిల్: అసలు
నటీనటులు: పూర్ణ, రవిబాబు, సూర్య, సత్య కృష్ణన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని
దర్శకత్వం: ఉదయ్, సురేష్
సంగీతం: ఎస్ఎస్ రాజేష్
కథ, నిర్మాత, పర్యవేక్షణ, నిర్మాత: రవిబాబు
విడుదల తేది: ఏప్రిల్ 13, 2023
ఓటీటీ వేదిక: ఈటీవీ విన్

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రవిబాబు. ఆయన దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక హీరోయిన్ పూర్ణ, రవిబాబు కాంబినేషన్ లో అవును, అవును 2 వంటి చిత్రాలు వచ్చాయి. వాటిలో అవును చాలా బాగా బిట్ అయింది. అయితే రవిబాబు తెరకెక్కించే చిత్రాలకు టైటిల్ మొదటి అక్షరం 'అ'తోనే ఎక్కువగా ఉన్నాయి. అలాంటి అల్లరి, అనసూయ, అమరావతి, అవును సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన పర్యవేక్షణలో వచ్చిన మూవీనే 'అసలు'. నేరుగా ఓటీటీ ఈటీవీ విన్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

 asalu

కథ:
నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ ఫొరెన్సిక్ ప్రొఫెసర్ వెంకటేశ్ చక్రవర్తి (సూర్య) వద్ద అసిస్టెంట్ గా వందన (పూర్ణ). కాలేజీ స్టూడెంట్స్ కు ఫొరెన్సిక్ విషయాలపై ప్రొఫెసర్ తో ఆన్ లైన్ లో జూమ్ వీడియో కాల్ నిర్వహిస్తుంటుంది వందన. ఈ ఆన్ లైన్ టీచింగ్ లోనే ప్రొఫెసర్ చక్రవర్తిని ముసుగు వేసుకున్న వ్యక్తి దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేస్తాడు. దీంతో ఈ కేసు విచారణను సీఐడీ ఆఫీసర్ రంజిత్ రావు (రవిబాబు)కు అప్పగిస్తారు.

ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన రంజిత్ కేసును ఎలా సాల్వ్ చేశాడు. ప్రొఫెసర్ అసిస్టెంట్ వందన అతనికి ఎలా సహాయపడింది? హత్య కేసులో అనుమానితులుగా ఉన్న వాళ్ల నుంచి పోలీసులు ఎలాంటి నిజాలు తెలుసుకున్నారు? వాళ్లకు ప్రొఫెసర్ కు ఉన్న సంబంధం ఏంటి? హాస్పిటల్ లో షాక్ కు గురై ట్రీట్మెంట్ తీసుకుంటున్న శిరీష ఎవరు? ఆమె పరిస్థితికి కారణం ఎవరు? అసలు ప్రొఫెసర్ ను హత్య చేసింది ఎవరో పోలీసులు కనిపెట్టారా? వంటి థ్రిల్లింగ్ విషయాల సముహారమే 'అసలు' (Asalu Movie Review).

విశ్లేషణ:
ఇది ఒక రొటీన్ క్రైమ్ అండ్ రివేంజ్ థ్రిల్లర్. అయితే సినిమా టైటిల్స్ పూర్తయ్యేలోపు మర్డర్ సీన్ చూపించి నేరుగా కథలోకి తీసుకెళ్లి ఆసక్తి పెంచారు. తర్వాత వెంటనే మరో మర్డర్ ను ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయడం, రంగంలోకి ఆఫీసర్ రంజిత్ దిగడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మర్డర్ కేసులు డీల్ చేసెటప్పుడు ఫొరెన్సిక్ ఎలా ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ చెప్పే క్లాసులోనే మర్డర్ చేయడమనేది ఆసక్తిగా అనిపిస్తుంది. ఇక హత్య చేసింది ఎవరో కనిపెట్టేందుకు ఉపయోగించే థియరీ అంతా బాగుంది. కానీ అదంతా సాదా సీదాగా అనిపిస్తుంది.

 asalu

సిల్లీ సీన్లు

నలుగురు వ్యక్తులను సస్పెక్ట్ చేయడం, వారే హత్య చేసింది అన్నట్లుగా చూపించడం ఇదంతా ఇప్పటి వరకు వచ్చిన ప్రతి క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో చూడొచ్చు. తెరకెక్కించిన విధానం అంతా బాగానే ఉన్నా రొటీన్ గా అనిపించడం మైనస్ గా మారింది. ప్రొఫెసర్ కు, అనుమానించే నలుగురు వ్యక్తులకు ఉన్న మధ్య సంబంధం తాలుకు సన్నివేశాలు అంతా బాగున్నాయి. అయితే ఫొరెన్సిక్ వంటి విషయాలపై మంచి పట్టు ఉన్న ఒక ప్రొఫెసర్ కు కొత్త ఫోన్ లో కన్ఫిగరేషన్స్ సెట్ చేసుకోవడం, గూగుల్ పే డౌన్లోడ్ చేసుకోవడం వంటివి తెలియకపోడవం సిల్లీగా అనిపిస్తుంది.

కన్విన్సింగ్ గా

ఇంటర్వెల్ తర్వాత మర్డర్ ఎవరో చేశాక వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. మర్డర్ ఎలా చేశారో రంజిత్ డీకోడ్ చేస్తూ చెప్పే విషయాలు ఆసక్తిగా ఉంటాయి. అయితే ఇందులోనే ఎక్కువగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు అనిపిస్తుంది. దాన్ని భర్తీ చేసేందుకు క్లైమాక్స్ లో ఎయిర్ పోర్ట్ వద్ద సన్నివేశంతో ఇలా కూడా చేయొచ్చు, తప్పించుకోవచ్చు అని కన్విన్సింగ్ గా చూపెట్టే ప్రయత్నమైతే చేశారు. దర్శకనిర్మాతల ఎఫర్ట్ బాగుంది. కానీ కథ పరంగా ఎమోషన్స్ అంతగా పండలేదు. ఇక సినిమాలో క్రైమ్, మెడికల్ కు సంబంధించిన ఇన్ఫర్మేషనల్ నాలెడ్జ్ పరంగా ఉపయోగకరంగా ఉంటుంది.

 asalu

ఎవరెలా చేశారంటే?

సీఐడీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా రవిబాబు ఆకట్టుకున్నారు. అక్కడక్కడ సీరియస్ మొహంతోనే కౌంటర్స్ వేస్తూ కామెడీ పండించేందుకు ట్రై చేశారు. హీరోయిన్ పూర్ణ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఇక డిఫరెంట్ వేరియెషన్స్ ఉన్న పాత్రలో సీనియర్ నటుడు సూర్య కూడా అలరించారు. మిగతా వారంతా పరిధి మేరకు పర్వలేదు. పాటలు లేవు, బీజీఎమ్ ఓకే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అంతా బాగుంది.

ఫైనల్ గా చెప్పాలంటే

ఇప్పటి వరకు ఇంగ్లీష్, మలయాళం క్రైమ్ థ్రిల్లర్స్ చూసినవారికి ఇది పెద్దగా ఎక్కకపోవచ్చు. కానీ ఇందులో చూపించే క్రైమ్, మెడికల్, ఫొరెన్సిక్ వంటి తదితర ఇన్ఫరేషన్ కోసం వీకెండ్ లో ఫ్రీగా ఉంటే ఓసారి ట్రై చేయవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X