Khiladi First Review రవితేజ మూవీని ఆకాశానికి ఎత్తేస్తూ.. టాప్ క్రిటిక్ రివ్యూపై అనేక అనుమానాలు?

దేశవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో సినీ పరిశ్రమలో రిలీజ్‌ల హంగామా మొదలైంది. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో సానుకూల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్‌తోపాటు ఓటీటీ రిలీజ్‌లు ఊపందుకొంటున్నాయి. ఈ క్రమంలో తెలుగు సినిమాల రిలీజ్ వివరాల్లోకి అలాగే ఖిలాడి మూవీపై ఉన్న అంచనాల విషయాల్లోకి వెళితే..

భారీ సంఖ్యలో సినిమాల రిలీజ్

భారీ సంఖ్యలో సినిమాల రిలీజ్

టాలీవుడ్‌లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 11వ తేదీన రవితేజ నటించిన ఖిలాడీ చిత్రం, ఫిబ్రవరి 12వ తేదీన సిద్దూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, తమిళ నటుడు విష్ణు విశాల్ నటించిన FIR, మరో చిన్న చిత్రం సెహారి రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. అలాగే ఓటీటీలో సుమంత్ నటించిన మళ్లీ మొదలైంది, ప్రియమణి నటించిన భామా కలాపం కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ప్యాన్ ఇండియా మూవీ అంటూ

ప్యాన్ ఇండియా మూవీ అంటూ

ఇక ఖిలాడీ సినిమా విషయానికి వస్తే.. ప్యాన్ ఇండియా లెవెల్‌లో రవితేజ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో డింపుల్ హయత్, మీనాక్షి తదితరులు నటించారు. కోనేరు సత్యనారాయణ నిర్మించగా, రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరగడంతో సినీ, ప్రేక్షక వర్గాల్లో ఖిలాడిపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఖిలాడీ ప్రీ రిలీజ్ బిజినెస్

ఖిలాడీ ప్రీ రిలీజ్ బిజినెస్

ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. నైజాం హక్కులు రూ.9 కోట్లు, సీడెడ్ హక్కులు 3.6 కోట్లు, ఆంధ్రా హక్కులు 11 కోట్లకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 22 కోట్ల మేర బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. దీంతో ఈ సినిమా 23 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రిలీజ్‌కు సిద్దమైంది.

 ముందే కూసిన ఉమేర్ సంధూ

ముందే కూసిన ఉమేర్ సంధూ

అయితే దుబాయ్‌లోని సినీ క్రిటిక్, సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమేర్ సంధూ ఖిలాడీ మూవీపై తన రివ్యూను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. రవితేజ నటనపై, కథ, కథనాలపై భారీగా ప్రశంసలు గుప్పించాడు. దుబాయ్ సెన్సార్ సమయంలో ఖిలాడీ చిత్రాన్ని చూసిన ఆయన ముందే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు, ప్రేక్షకులకు తెలిపే ప్రయత్నం చేశారు.

ఉమేర్ సంధూ రివ్యూ ఇలా..

ఉమేర్ సంధూ రివ్యూ ఇలా..

రవితేజ నించిన మూవీ గురించి ఉమేర్ సంధూ ట్వీట్ చేస్తూ.. ఖిలాడీ చిత్రం మాస్ ఎంటర్‌టైనర్. థ్రిల్లింగ్‌గా ఉండటమే కాకుండా కథనం చాలా వేగంగా ఉంటుంది. రవితేజ పెర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకొంటుంది. వన్ మ్యాన్ షో మాదిరిగా ఉంటుంది. రవితేజ లుక్స్, స్టంట్స్ చూసి ప్రేక్షకులు ఫిదా కావడం గ్యారెంటీ. మీరు తప్పకుండా చూడండి. నా రేటింగ్ 3.5/5 అంటూ ఖిలాడీ సినిమాను ప్రమోట్ చేసే విధంగా ట్వీట్ చేశారు.

గతంలో ఉమేర్ సంధూ రివ్యూలు అట్టర్ ఫ్లాప్

గతంలో ఉమేర్ సంధూ రివ్యూలు అట్టర్ ఫ్లాప్

అయితే ఉమేర్ సంధూ రివ్యూలు చాలా దారుణంగా ఉంటాయనేది పలు సందర్భాల్లో వ్యక్తమయ్యాయి. గతంలో టాలీవుడ్ సినిమాల గురించి ఆయన చేసిన ట్వీట్లు అనుమానాస్పదంగా మారాయి. అజాతవాసి, సర్దార్ గబ్బర్ సింగ్, స్పైడర్, ఇంకా పలు సినిమాల గురించి చెబుతూ బ్లాక్ బస్టర్.. అంటూ ఆకాశానికి ఎత్తేయడంతో ఆయనకు సినిమాలపై జడ్జ్‌మెంట్ లేదనే విషయం స్పష్టమైంది.

సినిమాను పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారనే విమర్శలు కూడా భారీగానే వినిపించాయి. కాబట్టి ఖిలాడీ విషయంలో ఆయన రివ్యూ ఎంత వరకు సమంజసం అనే విషయాన్ని సందేహంగా మారింది. ఖిలాడీ సినిమా అసలు రిలీజ్ తర్వాతే ప్రేక్షకుల ఇచ్చే తీర్పే పర్‌ఫెక్ట్. అంత వరకు ఆవేశపడి జేబుకు చిల్లు వేసుకోకండి అనే అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నది.

Recommended Video

Ravi Teja : Actor Who Redefined Hardwork After Megastar Chiranjeevi | Filmibeat Telugu
ఖిలాడీ మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

ఖిలాడీ మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: రవితేజ, అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరీ, డింపుల్ హయతి, నిక్తిన్ ధీర్, సచిన్ ఖేడ్కర్, ముఖేష్ రుషి, థాకూర్ అనూప్ సింగ్, రావు రమేష్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, అనసూయ భరద్వాజ్, కేశవ్ దీపక్ తదితరులు
రచన, దర్శకత్వం: రమేశ్ వర్మ
నిర్మాత: సత్యనారాయణ కొనేరు, రమేశ్ వర్మ
సినిమాటోగ్రఫి: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు
ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాణ సంస్థ: పెన్ మూవీస్, ఏ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2022-02-11

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X