twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పంచ్ ల పులి('బెంగాల్ టైగర్' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    చాలా సార్లు...చాలా సినిమాలు ఫస్టాఫ్ ఉన్నంత కిక్..ఎందుకనో సెంకడాఫ్ ఇవ్వలేకపోతూంటాయి. దాంతో ఇంటర్వెల్ కు అద్బుతం, బ్లాక్ బస్టర్ అనిపించిన సినిమా...పూర్తయ్యే సరికి జస్ట్ ఓకే అనిపిస్తూంటుంది. అందుకు కారణాలు ఏమైనా అవి పూర్తి స్ధాయిలో రిజల్ట్ పై చూపిస్తూంటాయి. అలాంటి సిట్యువేషనే 'బెంగాల్ టైగర్' చూస్తూంటే కలిగింది. ఫస్టాఫ్..ఫన్ రైడ్ లా వరసపెట్టి కామెడీ సీన్స్ తో సాగిపోయిన ఈ టైగర్..సెకండాఫ్ లో దూకుడు పూర్తిగా తగ్గించి యాక్షన్ కే పరిమితమై...సాగింది. ముఖ్యంగా ఫస్టాఫ్ ని ఒంటిచేత్తో నిలబెట్టిన , పోసాని - పృధ్వీల కామెడీ ని సెకండాఫ్ లో కంటిన్యూ చేయకపోవటం చాలా ఇబ్బంది అనిపించింది. ఫార్స్ తో నడిచిన సినిమా అదే ఫ్లోలో చివరి వరకూ వెళ్లిపోయి ఉంటే రవితేజకు మరో డాన్ శీను స్ధాయి హిట్ దొరికేది. దర్శకుడు పంచ్ ల మీద, ప్రాస ల మీద పెట్టిన శ్రద్ద...సెకండాఫ్ కథనం పైన కూడా పెట్టి ఉంటే బాగుండేది.

    ఊళ్లో మంచి పనులు లాంటి జులాయి పనులు చేస్తూండే రెగ్యులర్ తెలుగు సినిమా హీరోలాంటి కుర్రాడు ఆకాష్ నారాయణ్(రవితేజ). అతను ఓ పెళ్లి చూపులకు వెళితే..అక్కడ పెళ్లి కూతురు(అక్ష) తను ఫేమస్ అయిన వాడినే చేసుకుంటానని రిజెక్టు చేస్తుంది. దాంతో హఠాత్తుగా ఫేమస్ అయిపోవాలని ఫిక్స్ అయిన ఆకాష్...తమ ఊరికి వచ్చిన అగ్రికల్చర్ మినిస్టర్(షాయేజి షిండే)ని రాయితో కొట్టి మీడియాకు ఎక్కుతాడు. అయితే ఫేమస్ అవటం కోసం చాలా ధైర్యంతో మినిస్టర్ ని కొట్టిన విధానం నచ్చిన మినిస్టర్ అతన్ని తన అనుచరుడుగా పెట్టుకుంటాడు. (ఫేమస్ అవటం కోసం రాయితో కొట్టడమేంటి..వాడికి ఏమన్నా పిచ్చా లేక..తింగరా అని ఆలోచించడు మినిస్టర్...ఇక్కడ దర్శకుడు ...పొలిటీషన్స్ కు బుర్ర ఉండదు అనే విషయాన్ని చక్కగా చెప్పాడు) అక్కడ నుంచి అతన్ని హోం మినిస్టర్ నాగప్ప (రావురమేష్ )కి పరిచయం చేస్తాడు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    హోం మినిస్టర్..తన కూతురు శ్రద్ధ(రాశీ ఖన్నా)కి బాడీ గార్డ్ గా ఆకాష్ ని నియమిస్తాడు. (అదేంటి తన కూతురుకే సెక్యూరిటీ ఇవ్వలేనివాడు హోం మినిస్టర్ ఏంటి...రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఫోర్స్ అతని చేతులో ఉంటుంది కదా అనకండి..అతనికి ఆ టైమ్ లో అది గుర్తుకు రాకపోయి ఉండవచ్చు). అక్కడ నుంచి మన హీరో ఆకాష్ ...హోం..కూతురుని ప్రేమలో పడేసి, పెళ్లి దాకా తెస్తాడు. పెళ్లి విషయాన్ని ఎనౌన్స్ చేద్దామనుకున్న సమయంలో ...అతను దానికి నో చెప్పి..తాను సిఎం సిఎం అశోక్ గజపతి(బొమన్ ఇరానీ) కుమార్తె మీర(తమన్నా)ని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అసలు ఆకాష్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఇదంతా కేవలం తను ఫేమస్ అవ్వడం కోసమే చేసాడా? లేక దీని వెనుక ఏదన్నా గతం ఉందా? ఉంటే అదేంటి అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

    రవితేజ హిట్...డాన్ శీను ని దాదాపు పూర్తిగా అనుకరిస్తూ సాగే ఇలాంటి కథలు మనకు,రవితేజకు కొత్తేమీ కాదు. హీరోకు చిన్న గతం...ఆ ప్లాష్ ని అనుసరిస్తూ...హీరో రివేంజ్ తీర్చుకునేందుకు స్కెచ్..అదంతా దాచి ఫన్ తో ఫస్టాఫ్ నడిపి..తర్వాత తీరిగ్గా ఇదీ కథ ..ఇందుకోసం మీకు కామెడీ సీన్స్ అందించాం అని ఫ్లాష్ బ్యాక్ చెప్పి, ఫైట్ సీక్వెన్స్ తో కథ ముగుస్తూంటారు. అయితే ఇంటర్వెల్ కు వచ్చేసరికి అయినా ...హీరో ఏ విలన్ తో పోరాడుతున్నాడో క్లారిటీ వచ్చేస్తే...అక్కడ నుంచి ఎత్తుకు పై ఎత్తులు ఎప్పుడూ బాగుంటాయి. అయితే సెకండాఫ్ సగంలో ప్లాష్ బ్యాక్ పూర్తయ్యే దాకా అది జరగదు. ఇదే సమస్య ఈ సినిమాకూ వచ్చింది.

    ఈ చిత్రం మొదటే చెప్పుకున్నట్లు కేవలం కామెడీ సీన్స్, డైలాగ్స్ మీద ఆధారపడి ప్లాన్ చేసుకున్నాడు. అయితే స్క్రీన్ ప్లే మరింత టైట్ గా ఉంటే బాగుండేది .దాన్ని లైట్ తీసుకున్నాడు. ముఖ్యంగా అప్పటివరకూ ఫార్స్ గా సాగి నవ్వించిన సినిమా ఫ్లాష్ బ్యాక్ నుంచి దారి తప్పి సీరియస్ నోట్ తో నడిపారు. దాంతో ఈ ఫార్స్ కు ఈ సీరియస్ నోట్ కు సింక్ చేసుకోవటం చూసేవారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్ దాటిన కాస్సేపటికి కథ మెయిన్ రొటీన్ ట్విస్ట్ రివీల్ అవగానే సినిమా తర్వాత సీన్స్ లో ఏం జరుగుతూందో పూర్తిగా అర్దమైపోతుంది. దానికి తోడు...ఓ పెద్ద యాక్షన్ క్లైమాక్స్ విసుగు తెప్పిస్తుంది. క్లైమాక్స్ ఫైట్ లెంగ్త్ తగ్గించి, దాన్ని ఫన్ తో కలిపితే (శ్రీను వైట్ల స్కూల్ లాగ) కాస్త ఇబ్బంది తగ్గేది.

    స్లైడ్ షోలో మిగతా రివ్యూ...

    యాజ్ యూజవల్

    యాజ్ యూజవల్

    రవితేజ పాత్ర కొత్తదేమీ కాదు.. ఆయనే చాలా సార్లు చేసిందే. కానీ కెరీర్ ప్రారంభంలో ఉన్న అదే ఎనర్జీ ని ఇప్పటివరకూ మెయింటైన్ చేయటం మాత్రం మూమాలు విషయం మాత్రం కాదు.

    మేనరిజం

    మేనరిజం

    ఈ సినిమా హైలెట్స్ లో రవితేజ చిటెకల మేనరిజం ఒకటి, పృద్వీ, రవితేజ మధ్య వచ్చే చిటికెల సన్నివేశాలు సూపర్బ్ అనిపిస్తాయి

    పవన్ ని ఉద్దేశించి..

    పవన్ ని ఉద్దేశించి..

    సినిమాలో మెయిన్ హైలెట్స్..సంపత్ నంది రాసిన పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ పంచ్ డైలాగ్స్, అత్తారింటిది దారేది ట్రాక్ ని పేరడీ చేస్తూ పృధ్వీ ప్యారెడీ డైలాగ్స్, పోసాని కృష్ణ మురళి..పవన్ కళ్యాణ్ ని అనుసరిస్తూ చేసిన విన్యాసాలు.

    పాటలు, ఫైట్స్

    పాటలు, ఫైట్స్

    సినిమాలో పాటలు, నేపధ్య సంగీతం రెండూ బాగున్నాయి. ఫైట్స్ లో బురదలో తీసిన ఫైట్ కు మంచి అప్లాజ్ వచ్చింది.

    బికిని గ్లామర్

    బికిని గ్లామర్

    సినిమాలో రవితేజ గ్లామర్ ని సిజితో కవర్ చేస్తే...మరో ప్రక్కన రాశి ఖన్నా, తమన్నా తమ గ్లామర్ తో అదరకొట్టారు. రాశి ఖన్నా అయితే ఫెరఫార్మెన్ కన్నా గ్లామర్ కే ప్రయారిటీ ఇస్తూ బికినిలో కనపించి మరీ వేడిక్కించింది.

    ఫెయిల్...సూపర్

    ఫెయిల్...సూపర్

    అమలాపాల్ గా బ్రహ్మానందం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. హీరో ప్రెండ్ గా షకలక శంకర్ కనిపించాడు కాని పెద్దగా నవ్వించలేకపోయాడు. సిఎం గా బొమన్ ఇరాని సూపర్ గా చేసాడనే చెప్పాలి

    ప్యూచర్ స్టార్

    ప్యూచర్ స్టార్

    ఈ సినిమాలో ప్యూచర్ స్టార్ గా పృద్వీ ..ఒంటిచేత్తో నిలబెట్టాడు. ఫృద్వీ లేని ఫస్టాఫ్ ని ఊహించలేం. బాగా నవ్వించి..నిజంగానే టాలీవుడ్ ఫ్యూచర్ సినిమా కమిడయన్ అనిపించాడు.

    తెరవెనక,ముందు

    తెరవెనక,ముందు

    బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌,
    నటీనటులు:ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హర్ష వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు
    కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌,
    ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు,
    ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌,
    ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌,
    సంగీతం భీమ్స్‌,
    నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌,
    క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.
    విడుదల తేదీ : 10-12-2015.

    ఫైనల్ గా ఫస్టాఫ్ బాగానే నవ్వుకున్నాం కదా.. సెకండాఫ్ ని ఎడ్జెస్ట్ చేసుకుందాం అనేవారికి బాగా నచ్చుతుంది. అలాగే..కిక్ 2 కన్నా చాలా బాగున్న ఈ సినిమా రవితేజ అభిమానులకు నచ్చటం మాత్రమే కాక, బి,సి సెంటర్లలలో వర్కవుట్ అయ్యే అవకాసం కనపడుతోంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Director Sampath Nandi's much-awaited Telugu movie "Bengal Tiger" released today with divide talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X