Changure Bangaru Raja Review రంగు రాళ్ల వేట బ్యాక్ డ్రాప్‌తో మర్డర్ మిస్టరీ.. ఛాంగురే బంగారు రాజా ఎలా ఉందంటే
Rating: 2.5/5
మూవీ: ఛాంగురే బంగారు రాజా
నటీనటులు: కార్తీక్ రత్నం, సత్య, రవిబాబు, ఎస్తేర్ నోరోన్హా, గోల్డీ నిస్సీ, రాజ్ తిరందాస్ తదితరులు
రచన, దర్శకత్వం: సతీష్ వర్మ
మాటలు: జనార్ధన్ పసుమర్తి
సినిమాటోగ్రఫి: ఎన్‌సీ సుందర్
మ్యూజిక్: కృష్ణ సౌరబ్
నిర్మాత: మాస్ మహారాజా రవితేజ
బ్యానర్: ఆర్టీ ( రవితేజ) టీమ్ వర్క్స్
రిలీజ్ డేట్: 2023-09-15
నర్సీపట్నంకు సమీపంలోని దుగ్గాడలో బంగార్రాజు అనే యువకుడు బైక్ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. ఆ ప్రాంతంలో ప్రజలంతా రంగు రాళ్ల వేట సాగిస్తూ.. ఉన్నట్టుండి లక్షలు సంపాదించాలనే ఆశతో బతుకుతుంటాడు. బంగర్రాజు, తన స్నేహితుడు తాతారావు (సత్య) కూడా అదే పనిలో ఉంటాడు. రంగురాళ్ల వేట విషయంలో ఈ ఇద్దరంటే సోమునాయుడు (రాజ్ తిరందాసు)కు నచ్చదు. ఈ ముగ్గురి మధ్య వైరం కొనసాగుతుంటుంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి సోము నాయుడు దారుణ హత్యకు గురవుతాడు.
బంగార్రాజుకు ఉన్న మూడు ఎకరాల పొలం వివాదం ఏమిటి? సోము నాయుడికి బంగార్రాజుకు మధ్య వైరానికి కారణం ఏమిటి? సోము నాయుడు హత్య ను ఇన్స్‌పెక్టర్ (అజయ్) ఎలా దర్యాప్తు చేశాడు? బంగార్రాజును ప్రొఫెషనల్ కిల్లర్ గాటీలు (రవిబాబు) ఎందుకు చంపాలనుకొన్నాడు? ఎమ్మెల్యే భార్య (ఎస్తేరా నోరొన్హా)తో గాటీలుకు ఉన్న అక్రమ సంబంధం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? సోము నాయుడి హత్య వెనుక ఎవరి కుట్ర ఉందనే ప్రశ్నలకు సమాధానమే ఛాంగురే బంగారు రాజా మూవీ కథ.

రంగురాళ్ల వేట బ్యాక్ డ్రాప్‌తో ఓ మర్డర్ మిస్టరీ అనే పాయింట్ బాగుంది. కానీ దర్శకుడు సతీష్ వర్మ ఆ పాయింట్‌ను పూర్తి స్థాయి ఎమోషనల్ డ్రామాగా మలచడంలో తడబాటుకు గురయ్యారనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్‌గా కమర్షియల్ అంశాలను పూర్తి స్థాయిలో ఎమోషనల్‌గా కనెక్ట్ చేసి ఉంటే మంచి హ్యూమర్‌తో కూడిన మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అయి ఉండేదనిపించింది. బంగర్రాజు క్యారెక్టర్ వెనుక ఉన్న ఎమోషనల్ పాయింట్‌ను కొంత డీటైల్‌గా చెప్పి ఉంటే కథకు న్యాయం జరిగి ఉండేది. ఫస్టాఫ్‌లో సత్య లవ్ ట్రాక్, సెకండాఫ్‌లో రవిబాబు లవ్ ట్రాక్ కథకు బలంగా మారలేకపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో ఎమ్మెల్యే క్యారెక్టర్ చుట్టూ సాగిన డ్రామా కొంత మేరకు ఆకట్టుకొంటుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. బంగార్రాజు క్యారెక్టర్‌లో కార్తీక్ రత్నం చక్కగా ఒదిగిపోయాడు. తన క్యారెక్టర్‌లో ఉండే డెప్త్‌కు తగినట్టుగా ఎమోషన్స్ పలికించాడు. సత్య కామెడీ అక్కడక్కడా పేలింది. సోము నాయుడు మర్డర్ మిస్టరీని చేధించే తీరు ఆసక్తిగా సాగపోవడం వల్ల ఆ ట్రాక్ చుట్టూ ఉంటే క్యారెక్టర్లు ఇన్స్‌పెక్టర్, కానిస్టేబుల్స్ కారెక్టర్స్ ఎలివేట్ కాలేకపోయాయి. సెకండాఫ్‌లో రవిబాబు కామెడీ పర్వాలేదనిపిస్తుంది. ఎస్తేరా గ్లామర్‌గా ఆకట్టుకొన్నప్పటికీ.. ఆమె క్యారెక్టర్ గుర్తుండిపోయేలా లేకపోయింది.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. దర్శకుడిగా సతీష్ వర్మ టేకింగ్ బాగుంది. కథపై ఇంకా కసరత్తు చేసి ఉంటే.. డీసెంట్ మర్డర్ మిస్టరీగా అయి ఉండేది. కృష్ణ సౌరబ్ మ్యూజిక్, సుందర్ సినిమాటోగ్రఫి, ఇతర విభాగాల పనితీరు ఒకే అనిపించేలా ఉంది. రవితేజ టీమ్ వర్క్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

గ్రామీణ వాతావరణంతో సాగే మర్డర్ మిస్టరీ ఛాంగురే బంగారు రాజా. కార్తీక్ రత్నం, సత్య, రవిబాబు, ఎస్తేరా లాంటి వారి ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మర్డర్ మిస్టరీని గ్రిప్పింగ్‌గా చెప్పలేకపోవడం కొంత మైనస్. ఎమోషనల్ కంటెంట్ మిస్ కావడం వల్ల మంచి సస్సెన్స్ థ్రిల్లర్‌గా మారే ఛాన్స్ మిస్ అయిందనిపిస్తుంది. కామెడీ, క్రైమ్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. అంచనాలు లేకుండా వెళ్తే ఓ రకమైన అనుభూతిని పొందే ఛాన్స్ లేకపోలేదు.


Click it and Unblock the Notifications











