For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Crrush Movie review : ఆసక్తి రేకెత్తించిన రవిబాబు అడల్ట్ కామెడీ, ఎలా ఉందంటే?

  |

  Rating:
  2.0/5
  Star Cast: అభయ్ సింహా, కృష్ణ బూరుగుల, చరణ్ సాయి, అంకిత మనోజ్, పర్రీ పాండే, శ్రీ సుధారెడ్డి
  Director: రవిబాబు

  మొదటి నుంచి విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైన నటుడు, దర్శకుడు రవిబాబు పూర్తిగా అడల్ట్ కామెడీ జానర్లో తెరకెక్కించిన సినిమా క్రష్. ఈ సినిమా ప్రకటించినప్పటి పోస్టర్లు మొదలు ఈ సినిమా టీజర్, ఈ సినిమా ట్రైలర్ కూడా సినిమా మీద యూత్ లో ఎక్కువ క్రేజ్ సంపాదించి పెట్టేలా చేసింది. బోల్డ్ సీన్స్ గట్టిగా ఉంటాయని టీజర్, ట్రైలర్ లు తేల్చి చెప్పడంతో ఈ సినిమా మీద యూత్ కూడా గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ ఎన్నో అంచనాలతో జీ5 యాప్ లో రిలీజ్ అయిన ఈ సినిమా వారి అంచనాలను అందుకుందా ? లేదా ? అనేది సమీక్ష తెలుసుకుందాం.

  కథ ఏమిటంటే

  కథ ఏమిటంటే

  పై చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు ఎదురుచూస్తున్న ముగ్గురు కుర్రాళ్ళ కథ ఇది.. రవి (అభయ్ సింహా), వంశీ(కృష్ణ బూర్గులra), తేజు(చరణ్ సాయి) తమ కంటే సీనియర్ అయిన ఒకరు అమెరికా వెళ్లి సెలవులకు వస్తే ఆ సెలవుల్లో వచ్చి ఇచ్చిన ఒక ఐడియా వీరి జీవితాలను ఎలా మలుపు తిప్పింది అనేదే ఈ సినిమా కథ.. అమెరికా వెళ్లి వచ్చిన సదరు వ్యక్తి అమెరికాలో వర్జిన్ అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరని, ఒక వింత జంతువును చూసినట్లు చూస్తారు అని చెప్పడంతో పాటుగా ఎలా అయినా ఇక్కడే వర్జినిటీ కోల్పోయి అమెరికా రావాలని సలహా ఇస్తాడు. ఆ సలహా పాటిస్తూ ఈ ముగ్గురు వర్జినిటీ కోల్పోవడానికి ఎవరెవరితో ట్రైల్స్ వేశారు, ఆ ట్రైల్స్ ఎంతవరకు సఫలీకృతం అయ్యాయి. అనేదే ఈ సినిమా కధ.

  కథలో ట్విస్టులు

  కథలో ట్విస్టులు

  ఈ సినిమా కథలో మనం ఎలాంటి ట్విస్టులు ఊహించే అవకాశం ఇవ్వలేదు దర్శకుడు. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ముగ్గురి కుర్రాళ్ల దృష్టి శృంగారం అనేది దాని చుట్టూనే తిప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే వారు చేస్తున్న ప్రయత్నాలు, టీనేజ్ లో ఉండే కుర్రాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ? ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అనే విషయాలను చూపించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. ముందు నుంచి ఇది పూర్తిస్థాయి అడల్ట్ కామెడీ సినిమా అని చెప్పడంతో కేవలం 18 ప్లస్ 35 లోపు వాళ్లకు మాత్రమే ఈ సినిమా చూస్తే కనెక్ట్ అవ్వగలరు. మిగతా వారికి ఇది ఒక బూతు సినిమా లాగానే కనిపిస్తుంది.

  దర్శకుడి మేకింగ్

  దర్శకుడి మేకింగ్

  ఒకప్పుడు వరుస హిట్ సినిమాలు తీస్తూ వచ్చిన రవిబాబు ఈ మధ్య కాలంలో దర్శకుడిగా సరిగ్గా ఆకట్టుకోలేక పోతున్నాడు అనే చెప్పాలి. ఈ సినిమా విషయంలో కూడా అదే ట్రెండ్ కొనసాగింది. శృంగారం అనే టాపిక్ తీసుకొని కథను దాని చుట్టూనే రాసుకున్నట్టు అనిపించింది.. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా వెళ్లే లోపు వర్జినిటీ కోలుకోవాలని ప్రయత్నిస్తున్న యువకులు అందు కోసం ఎంతకైనా తెగిస్తారు వారి వయసు ప్రభావం అలాంటిది అనే విషయాలను చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఆయన మార్క్ లో సినిమా లేదని చెప్పచ్చు.

  నటీనటుల ప్రతిభ

  నటీనటుల ప్రతిభ

  ఈ సినిమాలో నటించిన అర్జున్ రెడ్డి ఫేమ్ శ్రీ సుధ సహా ముగ్గురు, నలుగురు తప్ప మిగతా అన్ని కొత్త ముఖాలు కావడంతో ఎవరికీ సినిమా త్వరగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. నిజానికి నరేష్ ఇలాంటి హీరోలను తెరకు పరిచయం చేసిన రవిబాబు ఈ సినిమాలో క్యాస్టింగ్ విషయం మీద పెద్దగా దృష్టి పెట్టినట్లు అనిపించలేదు.. అయితే ఎవరి ప్రతిభ మేరకు వారు నటించినా సరే కాస్త పేరున్న నటీనటులను తీసుకుంటే జనానికి సినిమా చేరువై ఉండేది అని చెప్పక తప్పదు. అభయ్ సింహా, కృష్ణ బూరుగుల, చరణ్ సాయి, అంకిత మనోజ్, పర్రీ పాండే, శ్రీ సుధా రెడ్డి ఎవరి పరిధిలో వారు నటించారు.

  టెక్నికల్ పరంగా చూస్తే

  టెక్నికల్ పరంగా చూస్తే

  టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాలో అడపాదడపా వచ్చిన పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కథ మధ్యలో ఇరికించాలి కాబట్టి ఇరికించినట్లుగా అనిపిస్తాయి. ఎలాంటి పాటలు లేకుండా ఈ సినిమా పూర్తి చేయవచ్చు కానీ పాటల మీద దృష్టి పెట్టడంతో మొదటికే మోసం వచ్చినట్లు అనిపించింది. నిజానికి సినిమా 2 గంటల 9 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుంది అయినా చాలా సేపు చూస్తున్న ఫీలింగ్ మాత్రం చూసేవారికి కలుగకమానదు.. ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ ఇంకాస్త తన కత్తెరకు పని చెప్పి ఉంటే బాగుండేది.

  Swapnika Exclusive Interview Part 4 | Sarkaru Vaari Paata AD ​| Filmibeat Telugu
  ఫైనల్ గా చెప్పాలంటే

  ఫైనల్ గా చెప్పాలంటే

  ఇది కేవలం 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న వారికి మాత్రమే సంబంధించిన సినిమా. 18 ఏళ్ల తరువాత వయసు ప్రభావం, ఆడ, మగ శరీరంలో కలిగే మార్పులు, ఆ సమయంలో ఏం జరుగుతుంది అనే అంశాలను సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.. అందుకే ఆ 18 ఏళ్ళ లోపువారు చూస్తే ఎబ్బెట్టుగా, 35 దాటిన తర్వాత చూస్తే వారికి అసహ్యంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓటిటిలో రిలీజ్ చేశారు కాబట్టి అడల్ట్ కామెడీ ఇష్టపడే వారు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. మనోభావాలు దెబ్బ తినడానికి ఎలాంటి డైలాగులు లేవు కానీ ఫ్యామిలీతో చూడకుండా ఉండటం వెయ్యి రెట్లు మేలు.

  English summary
  Ravi Babu’s Crrush Movie started streaming on Digital OTT Platform Zee5 from 9th July 2021. for the Frist Time this creative director has come with a very bold content. here is the review
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X