Razor Movie Review: రేజర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: రవిబాబు, తనీష్, తేజల్ విఖ్యాతి, బెనర్జీ, మిర్చి హేమంత్, వీరయ్య చౌదరీ, సిద్దా వెంకట్, ఇనయా సుల్తానా తదితరులు
దర్శకత్వం: రవిబాబు
స్క్రీన్ ప్లే: సత్యానంద్
సినిమాటోగ్రఫి: చరణ్ మాధవనేని
యాక్షన్: సతీష్ పల్లోజు
బ్యానర్: ఫ్లయిగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్
రిలీజ్ డేట్: 2026-05-08

కనకరాజు అనే రాజకీయ నేత ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకొంటాడు. అయితే సీఎం పదవి చేపట్టే క్రమంలో తన నేర చరిత్రను బయటపెడుతాడనే అనుమానంతో సెక్యూరిటీ కెమెరా టెక్నిషియన్ విష్ణుధర్ (తనీష్)‌తో ఆయన భార్యను దారుణంగా చంపుతాడు. అయితే ఈ దాడి నుంచి విష్ణు కూతురు తేజు (తేజల్ విఖ్యాతి) తప్పించుకొంటుంది. అయితే తేజును చంపడానికి ప్రయత్నిస్తుండటంతో డాగ్ సంరక్షుడు రుద్ర ప్రతాప్ (రవిబాబు) అడ్డుకొంటాడు. కాబోయే సీఎం ముఠాను రవిబాబు ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు.

Razor Movie Review and Rating

విష్ణుధర్‌ను కాబోయే సీఎం ఎందుకు టార్గెట్ చేశాడు? పొలిటిషియన్ కనకరాజు చేసిన నేరం ఏమిటి? కనకరాజు చేసిన నేరానికి, విష్ణుకు సంబంధం ఏమిటి? విష్ణు ఫ్యామిలీని చంపిన కనకరాజు చిన్నారి తేజును ఎందుకు టార్గెట్ చేశాడు? తేజును రక్షించడానికి రుద్ర ప్రతాప్ చేసిన రిస్క్ ఏమిటి? కుక్కల సంరక్షకుడిగా ఉన్న రుద్ర ప్రతాప్ గతం ఏమిటి? అసలు రుద్ర ప్రతాప్ ఎవరు? అసాంఘీక శక్తులపై రుద్ర ప్రతాప్ పోరాటం ఎందుకు? తేజూను కాపాడే ప్రయత్నంలో రుద్ర ప్రతాప్ ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి? సీఎం పీఠానికి ఒక్క అడుగు దూరంలో కనకరాజును రుద్ర ప్రతాప్ ఎలా నిలువరించారు? అసలు రేజర్ అనే టైటిల్‌కు కథకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే రేజర్ సినిమా కథ.

క్రైమ్, హారర్, సస్పెన్స్ చిత్రాలను నిర్మించడంలో నటుడు, దర్శకుడు రవిబాబుది అందె వేసిన చేయి. గతంలో కూడా క్రైమ్ థ్రిల్లర్లతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు. అయితే రేజర్ సినిమా విషయానికి వస్తే.. అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్. ఇటీవల వచ్చిన కిల్, మార్కో సినిమాలకు ఏ మాత్రం తీసిపోని హింస, రక్తపాతంతో ఈ సినిమాను రూపొందించారు. అయితే కేవలం హింసపైనే ఆధారపడకుండా దేశభక్తి, ఉగ్రవాదం, సీక్రెట్ ఏజెంట్ అంశాలతో చైల్డ్ సెంటిమెంట్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమా స్టోరీ ఐడియా బాగుంది. కానీ ఇంటెన్స్‌గా, బలమైన కాన్సెప్ట్, కథ, కథనాలతో రూపొందించి ఉంటే మంచి క్రైమ్ థ్రిల్లర్ అయి ఉండేది. కేవలం హింసనే నమ్ముకోవడం వల్ల ఓ వర్గం ఆడియెన్స్‌కే పరిమితమయ్యేలా చేసిందనే ఫీలింగ్ కలుగుతుంది.

ఫస్టాఫ్‌లో డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. సెకండాఫ్‌కు వచ్చే సరికి అవే యాక్షన్ సీన్లు రొటీన్‌గా అనిపిస్తాయి. పొడుపు కథలతో సినిమాను నడిపించిన విధానం బాగుంది. హింసాత్మక సన్నివేశాలకే పరిమితం కాకుండా ఎమోషనల్ కంటెంట్‌పై దృష్టిపెట్టి ఉంటే డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ అయి ఉండేది. కథలో ఏం జరగబోతుందనే విషయం సాధారణ ఆడియెన్స్‌కు ఆర్థం కావడం వల్ల పోను పోను సినిమాపై ఆసక్తి సన్నగిల్లడం లాంటి అంశాలు మైనస్‌గా నిలుస్తాయి.

యాక్టింగ్ విషయానికి వస్తే.. రవిబాబు తన రుద్ర ప్రతాప్ పాత్రలో జీవించాడనే చెప్పాలి. యాక్షన్ సీన్లలో బాడీ లాంగ్వేజ్ సింపుల్‌గా బాగుంది. సెకండాఫ్‌లో తన ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ ఎపిసోడ్‌లో రవిబాబు పెర్ఫార్మెన్స్ బాగుంది. అయితే ఈ సినిమాలోని ఇతర పాత్రల కోసం తీసుకొన్న నటీనటులు చాలా వరకు తెలియని ముఖాలే. సీఎం పాత్ర కోసం ఎంచుకొన్న యాక్టర్‌ పాత్రపరంగా తేలిపోయాడు. దాంతో కథలో ఉండాల్సిన జోష్ తగ్గిపోయింది. నాసిరకమైన నటులత ఈ సినిమాను చుట్టేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ కథ డిమాండ్ చేసినట్టు మంచి యాక్టర్లతో ఇంకా బెటర్‌గా తీయడానికి స్కోప్ ఉందనే భావన కలుగుతుంది.

రవిబాబు సినిమా అంటే టెక్నికల్‌గా బాగుంటుంది. గ్రాఫిక్ అంశాలు, లేటేస్ట్ టెక్నాలజీని తెరమీద చూపించిన విధానం బాగుంది. చరణ్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్. సతీష్ కొరియోగ్రఫి చేసిన యాక్షన్ సన్నివేశాలను చరణ్ బాగా పిక్చరైజ్ చేశాడు. రవిబాబు అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి కావాల్సిన అంశాలు ఉన్నాయి.

Read more about: ravi babu tollywood Razor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X