Razor Censor Review: రేజర్ మూవీ సెన్సార్ రివ్యూ
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో హీరో రవిబాబు నటించి దర్శకత్వం వహించిన చిత్రం రేజర్. ఈ చిత్రాన్ని రవిబాబు ప్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. చరణ్ మాధవనేని ఈ సినిమాకు సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. ఈ చిత్రం మే 8వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్నది. అయితే ప్రచార కార్యక్రమాలు కూడా లేకుండా కేవలం రవిబాబు తన ఇంటర్వ్యూల ద్వారా సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. పూర్తిస్థాయిలో హింస, యాక్షన్, చైల్డ్ సెంటిమెంట్ అంశాలతో రూపొందిన ఈ సినిమా గురించిన సెన్సార్ రిపోర్టు వివరాల్లోకి వెళితే..
రవిబాబు డాగ్ లవర్‌గా తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. అయితే ఊహించని విధంగా పవర్ పొలిటిషన్‌ను, క్రిమినల్ ముఠాను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓ చిన్నారిని చంపేందుకు రాజకీయ నేతకు చెందిన క్రిమినల్స్ ప్రయత్నిస్తుంటే.. వారికి అడ్డుగా నిలుస్తాడు. ప్రాణాలకు తెగించిన చిన్నారిని కాపాడేందుకు సిద్దమవుతాడు. అయితే చిన్నారిని రాజకీయ నేత ఎందుకు చంపేందుకు ప్లాన్ చేశాడు? డాగ్ లవర్ అయిన రవిబాబు ఎందుకు ఆ పాపను కాపాడేందుకు కంకణం కట్టుకొన్నాడు? చివరకు పాప ప్రాణాలను ఎలా కాపాడాడు? పవర్‌ఫుల్ పొలిటిషియన్‌ను ఎలా ఎదురించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

వయోలెన్స్ ప్రధాన అంశంగా రూపొందిన ఈ సినిమాలోని సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పలు సన్నివేశాల్లో రక్తపాతం ఎక్కువగా ఉండటంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. హింస ఉన్న సీన్ల నిడివిని తగ్గించాలి. కొన్ని సీన్లను తొలగించాలని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే కొన్ని సీన్లను సెన్సార్ సూచనలకు అనుగుణంగా మార్చారు. కొన్ని సీన్ల గురించి వివరణ ఇచ్చారు. దాంతో కొంత మేరకు సంతృప్తిని చెందిన ఈ చిత్రం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే ఈ చిత్రంలో హింస ఎక్కువగా ఉండటంతో ఈ మూవీకి ఏ (A) సర్టిఫికెట్ జారీ చేశారు. దాంతో ఈ సినిమాను 18 ఏళ్లు నిండిన వారే చూడాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు చూడటానికి అనుమతి లేదని సెన్సార్ సర్టిఫికెట్ జారీ సందర్భంలో స్పష్టం చేశారు. దాంతో ఈ సినిమా పెద్దలకు మాత్రమే అనేది స్పష్టమైంది.
ఇక మూవీ స్టోరీలో పెద్దగా వైవిధ్యం లేకపోవడం వల్ల నిడివి కూడా తక్కువగానే ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ సినిమా నిడివి 2 గంటల 6 నిమిషాలు అంటే.. 126 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో చైల్డ్ సెంటిమెంట్‌తో కూడిన అంశాలు ఫీల్‌గుడ్‌గా ఉంటాయనే విషయం సెన్సార్ తర్వాత ఫీడ్ బ్యాక్ వచ్చింది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ కథనాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications