twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RDX లవ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.0/5

    అలివేలు (పాయల్ రాజ్‌పుత్) ప్రభుత్వ పథకాలను పేదవర్గాలకు చేరవేసే సామాజిక కార్యకర్త. అలివేలును చూసి మీడియా అధినేత గిరి ప్రకాశ్ (ఆదిత్య మీనన్) కుమారుడు సిద్దు తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటంతో వారి పరిచయం ప్రేమగా మారుతుంది. తన సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ సిద్దూతో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తుంటుంది. అలివేలు, సిద్ధూ ప్రేమ విషయం తెలుసుకోవాలని వారిని విడదీయాలని ప్లాన్ వేస్తాడు.

    RDX Loveలో ట్విస్టులు

    RDX Loveలో ట్విస్టులు

    అలివేలుతో ప్రేమను విడగొట్టడంలో సిద్ధూ తండ్రి సఫలమయ్యాడా? తండ్రి చేసిన పనిని సిద్ధు ఎదురించాడా? సీఎంను అలివేలు ఎందుకు కలువాలనుకొంటుంది? ఈ కథలో మోనా డేవిడ్ (ముమైత్ ఖాన్) పాత్ర ఏమిటి? చివరకు అలివేలు, సిద్ధూ ప్రేమ ఏమైందనే ప్రశ్నలకు సమాధానమే RDX లవ్ సినిమా కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    తొలిభాగంలో పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోతకే పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇక తేజస్ ఫ్రెండ్స్ మధ్య నడిచే సన్నివేశాలు చాలా నాసిరకంగా, ఎబ్బెట్టుగా ఉంటాయి. పక్కా అడల్డ్ కంటెంట్‌తో సన్నివేశాలు ఉండటం ఓ దశలో ఇబ్బందిగా మారినంత పని అవుతుంది. కేవలం యూత్‌ను టార్గెట్ చేసి తీసిన సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలు లేని సన్నివేశాలతో తొలి భాగం నడుస్తుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక తన ఆశయాన్ని సాధించేందుకు అలివేలు తన శీలాన్ని కూడా పట్టించుకోకపోవడం సినిమాలో డైజెస్ట్ కానీ అంశంగా కనిపిస్తుంది. సీఎం బాపినీడు, రివర్స్ బ్రిడ్జ్ నర్సయ్య (నరేష్), ఆదిత్య మీనన్ పాత్రల్లో పెద్దగా పస లేకపోవడం వల్ల సన్నివేశాలు మరీ నాసిరకంగా కనిపిస్తాయి. ఓవరల్‌గా పాయల్ అందాల ఆరబోత కోసమే సినిమా తీశారా అనే ఫీలింగ్ కలిగేలా ఉంటాయి

    పాయల్ రాజ్‌పుత్ గ్లామర్

    పాయల్ రాజ్‌పుత్ గ్లామర్

    సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌కే ఎక్కువ మార్కులు వేయాల్సిందే. ఎలాంటి సందేహాలకు లేకుండా శృంగారాన్ని ఒలకబోసింది. ఆమె అందాల ప్రదర్శనకు ఫుల్ మార్కులు వేయాల్సిందే. RX 100 పాయల్ అందాలు ఆరబోసినా.. ఆ సినిమాలో పూర్తిగా క్యారెక్టరైజేషన్ ఉంది. కానీ ఈ సినిమాలో అది లోపించడంతో అలివేలు పాత్ర తేలిపోయింది. తేజస్ మిగితా పాత్రలు అంతంతా మాత్రంగానే ఉన్నాయి.

    దర్శకుడిగా భాను శంకర్

    దర్శకుడిగా భాను శంకర్

    RDX లవ్ సినిమా రిలీజ్‌కు ముందు దర్శకుడు శంకర్ భానుపై భారీ క్రేజ్ ఏర్పడింది. విజువల్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. అలాంటి అంచనాలను శంకర్ భాను అందుకోలేకపోయాడు. కథ, కథనాలు వదిలేసి పాయల్ అందాల ప్రదర్శనకే ప్రాధాన్యం ఇచ్చారా అనే ఫీలింగ్ కలిగించాడు. ఓవరాల్‌గా సగటు ప్రేక్షకుడిని నిరాశపరిచినట్టే చెప్పవచ్చు.

    టెక్నికల్‌గా

    టెక్నికల్‌గా

    సాంకేతికంగా ఈ సినిమాకు సంబంధించి సినిమాటోగ్రఫిని ప్రధానంగా చెప్పుకోవాలి. గ్రామీణ ప్రాంత అందాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు. సీ రాంప్రసాద్ తన శక్తి మేరకు సినిమాను రిచ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ప్రవీణ్ పుడి ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. రాధాన్ మ్యూజిక్ ఒకే అనేలా ఉంది. నిర్మాణ విలవలు ఫర్యాలేదనిపిస్తాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఓవరాల్‌గా RDX లవ్ సినిమా కథ నాసిరకమైన ప్రేమకథ. అడల్డ్ కంటెంట్ తప్ప మరో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ కనిపించదు. కథ, కథనాలు ఏ మాత్రం ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా లేవనే చెప్పవచ్చు. ప్రస్తుతం వస్తున్న విభిన్నమైన చిత్రాల మధ్య RDX లవ్ ఓ పేలవమైన సినిమా అని చెప్పవచ్చు.

    బలం, బలహీనత

    బలం, బలహీనత

    పాయల్ రాజ్‌పుత్ గ్లామర్
    తేజస్ ఫెర్ఫార్మెన్స్

    మైనస్ పాయింట్స్

    మైనస్ పాయింట్స్

    నాసిరకమైన కథ
    అశ్లీల, అసభ్యతతో సన్నివేశాలు
    ఫ్యామిలీ ఆడియెన్స్ దూరంగా
    పేలవంగా సాంకేతిక విలువలు

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచర్ల, వీకే నరేష్, ఆదిత్య మీనన్, నాగినీడు, తులసి తదితరులు
    సంగీతం: రాధాన్
    సినిమాటోగ్రఫి: సీ రాం ప్రసాద్
    ఎడిటింగ్: ప్రవీణ్ పుడి
    నిర్మాత: సీ కల్యాణ్
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శంకర్ భాను
    రిలీజ్ డేట్: 2019-10-11

    English summary
    RDX Love is a romantic entertainer movie directed by Shankar Bhanu and produced by C Kalyan. The movie cast includes Tejus Kancherla and Payal Rajput are in the main lead roles while Radhan scored music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X