Record Break Review రైతుల సమస్యతో స్పోర్ట్స్ డ్రామా.. రికార్డు బ్రేక్ సమీక్ష
నటీనటులు: నిహర్ కపూర్, నాగార్జున, సత్య కృష్ణన్, రగ్తా ఇష్టాకర్, టీ ప్రసన్నకుమార్. జాకీర్, సంజన, శాంతి తివారి, సోనియా, కాశీ విశ్వనాథ్ తదితరులు
నిర్మాత: చదలవాడ పద్మావతి
దర్శకత్వం: చదలవాడ శ్రీనివాసరావు
సినిమాటోగ్రఫి: కంతేటి శంకర్
మ్యూజిక్: సాబు వర్గీస్
కథ: అంగిరెడ్డి శ్రీనివాస్
బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్
రిలీజ్ డేట్: 2023-03-28
సంపన్న కుటుంబానికి చెందిన చంటి, బంటి (నిహిర్ కపూర్, నాగార్జున) ఇద్దరు అనాథలు. శారీరకంగా అత్యంత బలవంతులు. ఆకలి బాధలు తీర్చుకొనేందుకు తమ బలాన్ని ఉపయోగించుకొంటారు. బతుకు తెరువు కోసం టింబర్ డిపోలో చేరిన సమయంలో వారి జీవితం మలుపు తిరుగుతుంది. గ్రామస్థాయి నుంచి ప్రపంచస్థాయిలో WW ఛాంపియన్లుగా ఎదుగుతారు.

చంటి, బంటి ఎందుకు అనాథలుగా మారారు. అనాథలను చేరే తీసే ఓ యువతి వారిని ఎందుకు, ఏ పరిస్థితుల్లో చేరదీసింది. చంటి, బంటికి కలెక్టర్ (సత్యకృష్ణన్) ఎలా సహాయం అందించింది. టింబర్ డిపో యజమాని (చలపతిరావు)కు ఎదురైన సమస్యలు ఏమిటి? ఈ కథలో విలన్ (ప్రసన్న కుమార్) పాత్ర ఏమిటి? ప్రపంచస్థాయి క్రీడాకారులుగా ఎలా ఎదిగారు అనే ప్రశ్నలకు సమాధానమే రికార్డ్ బ్రేక్ సినిమా కథ.
బలవంతులైన యువకుల పాత్రలకు తగినట్టుగా నిహిర్, నాగార్జున కరెక్టుగా సూట్ అయ్యారు. ఇలాంటి పాత్రలను డిజైన్ చేసినప్పుడు.. నిర్మాత చెప్పినట్టు..వారు తప్ప ఎవరూ చేయలేరనిపిస్తుంది. పూర్తిస్థాయిలో చంటి, బంటి పాత్రలకు వారు న్యాయం చేశారు. చలపతిరావు పాత్రను మరింత బెటర్‌గా డిజైన్ చేయాల్సి ఉందనిపిస్తుంది. విలన్‌గా ప్రసన్న కుమార్ మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. చాలా రోజులకు సత్యకృష్ణన్ మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.
రికార్డు బ్రేక్ సినిమా కథ, పాత్రలకు ఎంపిక చేసిన నటుల్లో కొంత లోపం ఉన్నప్పటికీ.. వాటిని సాంకేతిక అంశాలు వాటిని పూరించాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగుంది. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం, టేకింగ్ బాగుంది. సాబు వర్గీస్ మ్యూజిక్, అంగిరెడ్డి శ్రీనివాస్ అందించిన స్టోరీ పాయింట్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రైతుల సమస్య, సాామాజిక అంశాలు, రూరల్, స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











