Reddy Garintlo Rowdyism review.. సామాజిక సందేశంతో కూడిన ప్రేమ కథ
నటీనటులు: రమణ్, ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష విశ్వనాథ్, వినోద్ కుమార్
దర్శకత్వం: ఎం రమేష్, గోపి
నిర్మాత: కే శిరీషా రెడ్డి
సినిమాటోగ్రఫి: ఏకే ఆనంద్
ఎడిటింగ్: శ్రీనివాస్ పీ బాబు, సంజీవరెడ్డి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శ్రీ వసంత్
మ్యూజిక్: మహిత్ నారాయణ్
ఫైట్స్: అల్టీమేట్ శివ, కుంగ్ ఫూ చంద్రు
బ్యానర్: సిరి మూవీస్
రిలీజ్: 2022-04-08
కులాంతర, ప్రేమ వివాహాలకు బద్ద వ్యతిరేకి ప్రతాప్ రెడ్డి (వినోద్ కుమార్). ప్రాణం కంటే పరువు ప్రతిష్టలను మిన్నగా భావించే ప్రతాప్ రెడ్డి గ్రామంలోని ప్రేమ, పెళ్లిళ్లను వ్యతిరేకిస్తుంటాడు. పొరుగు గ్రామానికి చెందిన శివ చదువు సంధ్యలు లేకుడా బాధ్యతారాహిత్యంగా స్పేహితులతో తిరుగుతుంటారు. అయితే కులాంతర వివాహాలను వ్యతిరేకించే ప్రతాప్ రెడ్డి కుమార్తె సంధ్య (ప్రియాంక రౌరీ))తో శివ ప్రేమలో పడుతాడు.
తన కులానికి చెందని శివతో తన కూతురు ప్రేమ విషయం తెలిసిన ప్రతాప్ రెడ్డి ఏం చేశాడు? శివ, సంధ్యను వేరు చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? శివతో సంధ్య ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? శివ, సంధ్య ప్రేమకు ప్రతాప్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? శివ, సంధ్య ప్రేమకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే రెడ్డిగారింట్లో రౌడీయిజం సినిమా కథ.

పరువు ప్రతిష్టల కోసం పాకులాడే ప్రతాప్ రెడ్డి దృష్టికి తన స్నేహితుడి కూతురు ప్రేమ వ్యవహారం వస్తుంది. అయితే అమ్మాయికి మంచి మాటలు చెప్పి.. ఆ తర్వాత ప్రేమించిన యువకుడిని మట్టుపెట్టే ఓ సీరియస్ ఎపిసోడ్‌తో కథ తీరుతెన్నులను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాన్ని దర్శకులు ఎం రమేష్, గోపి చేశారు. శివ తండ్రి జూనియర్ ఆర్టిస్టు కావడం, అందులో ఆయన జూనియర్ బాలకృష్ణగా పరిచయమై కథను వినోదాత్మకంగా మలిచే ప్రయత్నం జరుగుతుంది. ఇక శివ, సంధ్య మధ్య ప్రేమ సన్నివేశాలు, వారి ప్రేమను తెలుసుకొన్న ప్రతాప్ రెడ్డి ఎలాంటి ఎత్తులు వేశాడనే విషయం సెకండాఫ్‌లో ఆసక్తికరంగా మారుతుంది.
ఊరి పెద్ద ప్రతాప్ రెడ్డిగా సీనియర్ నటుడు వినోద్ కుమార్ గంభీరంగా కనిపించాడు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరితో విభిన్నమైన పాత్రలో కనిపించాడు. విలన్ పాత్రలో సరికొత్తగా నటించాడు. ఇక శివగా రమణ్ తన తొలి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. తొలి చిత్రమైనా రమణ్‌లో బెరుకు కనిపించకుండా అనుభవం ఉన్న నటుడిగా కనిపించాడు. అయితే నటనపరంగా మరికొంత మెరుగుపరచుకొంటే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పవచ్చు. ఇక సంధ్యగా ప్రియాంక రౌరీ చక్కగా నటించింది. ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నారు. మిగితా పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. శ్రీ వసంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కారణంగా సినిమాలోని పలు సన్నివేశాలు హైలెట్ అయ్యాయి. సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం స సినిమాకు ప్లస్‌గా మారిందని చెప్పవచ్చు. ఏకే ఆనంద్ సినిమాటోగ్రఫి బాగుంది. లవ్, యాక్షన్ ఎపిసోడ్స్‌ను బాగా చిత్రీకరించాడు. శ్రీనివాస్ పీ బాబు, సంజీవరెడ్డి ఎడిటింగ్ ఫర్వాలేదనిపించింది. అల్టిమేట్ శివ, కుంగ్‌ఫూ చంద్రు యాక్షన్ సీన్లు కథకు తగినట్టుగా ఉన్నాయి.
రౌడీగారింట్లో రౌడీయిజం చిత్రం సమాజంలో కుల, మతాల అంతరాలను తగ్గించే విధంగా ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పవచ్చు. కులం, మతం కంటే మానవత్వం గొప్పది అనే చెప్పే సందేశాత్మక చిత్రం. పరువు పేరుతో గ్రామాల్లో సాగుతున్న అరాచకాలపై అవగాహన, సామాజిక సృహను కలిగించే చిత్రంగా తెరకెక్కింది. నేటివిటి చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











