ఎన్నారైల సినిమా ఫర్వాలేదు

By Staff

Relax
-జోశ్యుల సూర్యప్రకాష్‌
సినిమా: రిలాక్స్‌
బ్యానర్‌: కాలిఫోర్నియా మీడియా గ్రూప్‌
నటీనటులు: రోహన్‌, అంజలి, మురళీమోహన్‌, విజయచందర్‌,
గిరిబాబు, బ్రహ్మానందం, ఎంఎస్‌ నారాయణ, అలీ, తనికెళ్ళ భరణి, రజిత తదితరులు.
సంగీతం: రమణ గోగుల
కెమెరా: రాజేందర్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కెకె ఆర్‌
నిర్మాతలు: మంజుశ్రీ రెడ్డి, పాపిరెడ్డి, ఎన్‌ వరదన్‌
దర్శకత్వం: ప్రదీప్‌ పి శెట్టి
విడుదల తేదీ: 24-2-05

కొత్త హీరో, కొత్త హీరోయిన్‌, కొత్త డైరెక్టర్‌, కొత్త నిర్మాతలు తీసిన 'రిలాక్స్‌' సినిమా కథ కూడా కొత్తది. ఈ సినిమాకు ఓపెనింగ్స్‌ పెద్దగా లేకపోయినా ప్రేక్షకులను ఆక ట్టుకునే అవకాశముంది.

కథ: సందీప్‌ (నూతన నటుడు రోహన్‌) ఓ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. పుట్టినప్పటి నుండి పట్నంలో చదువు పూర్తయ్యేంతవరకు విశ్రాంతి లేకుండా గడిపిన ఇతను రెస్ట్‌ కోసం హైదరాబాద్‌ నగరానికి చేరుకుంటాడు. రామ్‌ నేపాల్‌ వర్మ (అలీ) అనే వర్ధమాన్‌ యాడ్‌ డైరెక్టరు రూములో ఆశ్రయం పొందుతాడు. అతని యాడ్స్‌లో బలవంతంగా నటిస్తాడు. ఆ క్రమంలో నూతన నటి అంజలి (సినిమాలో కూడా అదే పేరు) పరిచయమవుతుంది. షూటింగ్‌ సమయంలో సందీప్‌ను రకరకాల దుర్మార్గుడుగా ఆమె ఊహించుకుంటూ ఉంటుంది. ఒక సంఘటనతో సందీప్‌ అసలు వ్యక్తిత్వం తెలుసుకున్న అంజలి అతడిని సిన్సియర్‌గా ప్రేమిస్తూ ఉంటుంది.

ఇంతలో హీరోకి సంబంధించిన ఒక ముఖ్య సన్నివేశం వస్తుంది. హీరో సందీప్‌ ఒక ప్రముఖ జ్యోతిష్యుడు శర్మ (విజయ్‌ చందర్‌)తో వాదానికి దిగుతాడు. నీకు జ్యోతిషం గొప్పతనమేమిటో నిరూపిస్తానని శర్మ సవాలు చేస్తాడు. హీరో చెయ్యి చూసి మూడు పాయింట్లు చెబుతాడు. మొదటి పాయింట్‌ అతను లక్షాధికారి అవుతాడని. రెండో పాయింట్‌ శ్రమ పడకుండానే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాడని. మూడో పాయింట్‌ హంతకుడు అవుతాడని. సందీప్‌ నమ్మడు. కానీ మొదటి రెండు పాయింట్లు వాస్తవం కావడంతో హస్తసాముద్రిక జ్యోతిష్యంపై అతనికి నమ్మకం పెరుగుతుంది. మరో విచిత్రకర పరిస్ధితిలో స్వయంగా ముఖ్యమంత్రి గారు హీరోకి నగర మేయర్‌గా అధికార పార్టీ టికెట్‌ ఇస్తాడు. ఈ సంఘటనలతో హీరో హీరోయిన్లకు భయం పట్టుకుంటుంది. తమ నీడను చూసి తాము తామే భయపడాల్సిన మానసిక స్ధితి వస్తుంది. రోహిత్‌ హంతకుడు కాకుండా తప్పించుకుంటాడా? తెర మీద చూడాల్సిందే.

నిర్మాత , దర్శకుడు కొత్తవారు కావడంతో కొంత ప్రయోగం చేయడానికి అవకాశం లభించిందని అనుకోవాలి. కానీ అదే మైనస్‌ పాయింట్‌ కావడంతో సినిమాకు సంబంధించిన ప్రచారం పెద్దగా జరగలేదు. ఓపెనింగ్స్‌ నిరాశ కలిగించినా ఈ సినిమా దీర్ఘకాలంలో పుంజుకునే అవకాశాలున్నాయి. కథ, దర్శకత్వం పరంగా సినిమా బాగున్నా హీరో తనకు వచ్చిన ఆపద నుంచి తప్పుకోడానికి ప్రయత్నించకపోవడం ప్రేక్షకులకు అసహనం కలిగిస్తుంది. హాస్యనటులు తనికెళ్ళ భరణిని, బ్రహ్మానందాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదు.

ఈ సినిమాలో రామ్‌నేపాల్‌ వర్మ పాత్రలో వేణుమాధవ్‌ నటన బాగుంది. సినిమా స్క్రీన్‌ప్లే పకడ్బందీగా ఉండడంతో చివరివరకు హాయిగా సాగిపోతుంది. రమణ గోగుల సంగీతం ఫర్వాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X