twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Republic Movie Review: వ్యవస్థలపై దేవ కట్టా కలం పోటు.. సాయిధరమ్ తేజ్ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్

    |

    Rating:
    3.0/5
    Star Cast: సాయిధరమ్ తేజ్, ఐశ్వర్యరాజేశ్, రమ్యకృష్ణ, జగపతిబాబు, శ్రీకాంత్ అయ్యంగార్
    Director: దేవ కట్టా

    సమకాలీన పరిస్థితులు, రాజకీయాలపై సినీ విమర్శనాస్త్రాలు సంధించే దర్శకుడు దేవ కట్టా మరోసారి అదే అస్త్రాన్ని తెలుగు తెరపై సంధించడానికి రిపబ్లిక్‌ మూవీతో ముందుకొచ్చారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్, ఐశ్వర్యరాజేష్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు నటించిన ఈ చిత్రం అక్టోబర్ 1వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ సాయిధరమ్ తేజ్, ఉండటం, రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ ప్రభుత్వంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విరుచుకుపడటంతో ఈ సినిమాపై ప్రత్యేకమైన అటెన్షన్ ఏర్పడింది. అయితే మెగా అభిమానుల, సినీ ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకొన్నదా? అలాగే దేవ కట్టా మరోసారి తన కథ, కథనాలతో మ్యాజిక్ చేశారా? అనే విషయాలను తెలుసుకోవాలంటే రిపబ్లిక్ కథ, కథనాలను, నటీనటుల ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల ప్రతిభను సమీక్షించాల్సిందే.

    రిపబ్లిక్ కథ ఏమిటంటే..

    రిపబ్లిక్ కథ ఏమిటంటే..

    పంజా అభిరామ్ ( సాయిధరమ్ తేజ్) చిన్నతనం నుంచే అవినీతి, అక్రమాలంటే సహించడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి (జగపతిబాబు) చేసే అవినీతిని ప్రశ్నిస్తుంటాడు? అలా పెరిగిన అభిరామ్ అమెరికాలోని ఎంఐటీలో సీటు సంపాదిస్తాడు. కానీ ఏలూరులోని కొన్ని ప్రాంతాల్లోని పరిస్థితుల కారణంగా అమెరికాకు వెళ్లే ఆలోచనను మానుకొని ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. అదే జిల్లాకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలను చేపడుతాడు? తన జిల్లాకు శాపంగా మారిన తెల్లేరు (కొల్లేరును పేరు మార్చి) సరస్సులో చేపల పెంపకం, అక్కడ ముఖ్యమంత్రి విశాఖ వాణి (రమ్యకృష్ణ) సాగించే అక్రమాలకు చరమగీతం పాడేందుకు సిద్ధమవుతాడు.

     రిపబ్లిక్‌లో ట్విస్టులు ఇలా..

    రిపబ్లిక్‌లో ట్విస్టులు ఇలా..

    ప్రత్యేక అధికారంతో ఐఏఎస్‌గా రిక్రూట్ అయిన అభిరామ్‌కు ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి? తెల్లేరు అక్రమాలపై గ్రామస్థులను చైతన్యం చేయడానికి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? తన తండ్రి చేసిన అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అభిరామ్ తండ్రి (జగపతిబాబు) ఎందుకు అవినీతి అధికారిగా మారాడు? విశాఖవాణి అవినీతి, అక్రమాలకు ఎందుకు పాల్పడింది? చివరకు ఐఏఎస్ అభిరామ్ అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే రిపబ్లిక్ సినిమా కథ.

    సరస్సులో అక్రమాలు, అవినీతిపై టార్గెట్

    సరస్సులో అక్రమాలు, అవినీతిపై టార్గెట్

    రిపబ్లిక్ సినిమా తొలి భాగానికి వస్తే.. ఓట్ల రిగ్గింగ్ అనే ఒక సీరియస్ విషయంతో కథను ఎమోషనల్‌గా మొదలుపెట్టే ప్రయత్నం చేయడంతో ప్రేక్షకులు ఇందులో ఏదో విషయం చెప్పడానికి దర్శకుడు ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతుంది. ఇక తెల్లేరు సరస్సు ఎలా ధ్వంసమైందనే విషయం కోణంలో నింపాదిగా కథ చెప్పే వ్యూహాన్ని దర్శకుడు ఎంచుకోవడం కాస్త అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. కాకపోతే రాహుల్ రామకృష్ణ ఎపిసోడ్, అలాగే కథలో ముఖ్య పాత్రధారి, ఎన్నారై మైరా హ్యాన్సన్ (ఐశ్వర్యరాజేశ్) సన్నివేశాలు మరింత భావోద్వేగంగా కనిపిస్తాయి. తండ్రి, కొడుకుల మధ్య వైరం, అభిప్రాయ బేధాలు లాంటి అంశాలు కథకు మరింత బలంగా మారాయి.

    రాజకీయ వ్యవస్థలపై విమర్శనాస్త్రాలతో

    రాజకీయ వ్యవస్థలపై విమర్శనాస్త్రాలతో

    ఇక సెకండాఫ్‌లో ఎన్నారై డాక్టర్ వరుణ్ హ్యాన్సన్ కిడ్నాప్ వ్యవహారం, తెల్తేరు చుట్టు జరిగే రాజకీయ వాతావరణం సగటు ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఉంటాయి. తల్లి చనిపోయే ఫ్యాష్ బ్యాక్, అలాగే తండ్రి అవినీతి అధికారిగా మారే సన్నివేశాలు అభిరామ్ క్యారెక్టర్‌కు జస్టిఫికేషన్‌ ఇచ్చేందుకు సహకారం అందించాయి. ఇక రిపబ్లిక్ సినిమాలో చివరి 30 నిమిషాలు అత్యంత కీలకం. చాలా ఎమోషనల్‌గా, ప్రస్తుత సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపడంలో దర్శకుడు దేవ కట్టా ప్రయత్నం సఫలమైందనే ఫీలింగ్ కలుగుతుంది. అన్ని సినిమాల మాదిరిగా రొటీన్‌గా, సినిమాటిక్‌గా కథను ముగించకపోవడం ఈ సినిమాకు పాజిటివ్‌గా మారిందని చెప్పవచ్చు.

    దేవ కట్టా దర్శకత్వ ప్రతిభ

    దేవ కట్టా దర్శకత్వ ప్రతిభ

    దర్శకుడు దేవ కట్టా ఎంచుకొన్న ఓ ప్రాంతానికి ప్రాణ నాడిగా మారిన ఓ సరస్సును కలుషితం చేస్తూ రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతి అక్రమ వ్యాపారం అనే పాయింట్‌కు ప్రస్తుత పరిస్థితులను జోడించి చెప్పిన విధానం బాగుంది. రాజకీయ వ్యవస్థ నుంచి బ్యూరోక్రాట్స్‌ను వేరు చేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చనే కోణంలో రిపబ్లిక్‌ను తీర్చి దిద్దిన విధానం బాగుంది. పరిణామాలు, పరిమాణం లాంటి పర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకొంటాయి.

    కాకపోతే సగటు ప్రేక్షకుడిని పట్టించుకోకుండా కమర్షియల్ అంశాలకు దూరంగా సినిమాను కొంత ఏదో అసంతృప్తి కలుగుతుంది. అయితే సాధారణ ప్రేక్షకుడికి కాస్త తికమక కలిగించే పదజాలం, భారమైన డైలాగ్స్‌ను మరికొంత సున్నితంగా చెప్పి ఉంటే బాగుండేదనిపించింది. అలాగే కొన్ని పాత్రలను బలంగా రాసుకొంటే.. విశాఖవాణి పాత్రలో ఏటు తేల్చుకోలేని ఊగిసలాట కనిపిస్తుంది. మిగితా విషయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా తన పంథాను పక్కాగా చెప్పడంలో సక్సెస్ అయ్యారు.

    సాయిధరమ్ తేజ్ ఫెర్ఫార్మెన్స్

    సాయిధరమ్ తేజ్ ఫెర్ఫార్మెన్స్

    పంజా అభిరామ్ పాత్రలో సాయిధరమ్ తేజ్ పలు రకాలు షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో జీవించాడు. సమాజంలో జరిగే అన్యాయాలను ఎదురించే యువకుడిగా, తండ్రి అవినీతిని ప్రశ్నించే కొడుకుగా, ప్రభుత్వాల పనితీరు, రాజకీయ నేతల అక్రమాలను ఎదురించే ఉన్నతాధికారిగా పలు రకాల ఎమోషన్స్‌ను బాగా పండించాడు. ఎప్పటిలానే యాక్షన్, ఎమోషనల్ సీన్లను ఆకట్టుకొన్నాడు. సెకండాఫ్‌లో చివరి 30 నిమిషాల్లో సాయితేజ్ నటుడిగా ఎలా పరిణితి చెందారో స్పష్టంగా కనిపిస్తుంది. స్టార్‌గానే కాకుండా యాక్టర్‌గా కూడా తనలోనే కోణాన్ని బయటపెట్టారు. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే ఫీలింగ్ కలుగుతుంది.

    ఐశ్వర్య రాజేశ్ ఎలా చేశారంటే..

    ఐశ్వర్య రాజేశ్ ఎలా చేశారంటే..

    ఇక ఐశ్వర్య రాజేశ్ మైరాగా ఓ ఎన్నారై యువతిగా అద్భుతమైన పాత్రలో కనిపించింది. డాక్టర్‌గా పనిచేసే సోదరుడు కిడ్నాప్, హత్య ఎపిసోడ్స్‌లో ఐశ్వర్య రాజేష్ నటన బాగుంది. ఇప్పటి వరకు ఐశ్వర్య రాజేశ్ చూసినది ఒక ఎత్తు.. రిపబ్లిక్‌లో ఆమె ఫెర్ఫార్మెన్స్ మరో ఎత్తుగా కనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లలో భావోద్వేగమైన నటనను చూపించింది. అయితే ఈ సినిమాలో ఆమె హీరోయిన్ మెటీరియల్‌గా కాకుండా బలమైన పాత్రలో కనిపించడం సర్‌ప్రైజింగ్ ఎలిమింట్‌గా కనిపిస్తుంది.

    రమ్యకృష్ణ ఏ పాత్రలో అంటే

    రమ్యకృష్ణ ఏ పాత్రలో అంటే

    రమ్యకృష్ణది కథలో ఓ పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా చెప్పుకోవడానికి బలమైన పాత్రే. కానీ తెర మీద ఆ పాత్ర విషయానికి వస్తే పెద్దగా ఇంపాక్ట్ కనిపించదు. ఓ రెండు మూడు సీన్లలో మాత్రమే ఘాటుగా, తన స్టైల్‌ కనిపిస్తుంది. అయితే కథను బలంగా చెప్పాలనే కోణంలో విశాఖవాణి పాత్ర ఇంటెన్సిటీని తగ్గించారా అనే అనుమానం కలుగుతుంది. అయితే గత చిత్రాల్లో మాదిరిగా రమ్యకృష్ణ పాత్రను అతి ఊహించుకొని వెళితే కాస్త భంగపాటు తప్పదనే చెప్పవచ్చు.

    జగపతి బాబు, ఇతర నటులు గురించి

    జగపతి బాబు, ఇతర నటులు గురించి

    మిగితా పాత్రల్లో దశరథ్‌గా జగపతి బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, ఆమని పాత్రలు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలుగా కనిపిస్తాయి. అవినీతి ప్రభుత్వ ఉద్యోగిగా.. జగపతి బాబు తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. శ్రీకాంత్ అయ్యంగార్ కూడా జిల్లా ఎస్పీ పాత్రలో మరోసారి మెరిశారు. ఈ ఇద్దరు నటులు కూడా ఎమోషనల్‌ పాత్రలో కనిపించారు. తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపిస్తారు. సురేఖవాణి, ఆమని పాత్రలు కథలో కీలకమే కానీ.. తమ ప్రతిభను చాటుకోవడానికి అవకాశం దక్కలేదు. మనోజ్‌కు మంచి పాత్ర లభించింది.

    సాంకేతిక విభాగాల పనితీరు.

    సాంకేతిక విభాగాల పనితీరు.

    ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే... సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సుకుమార్ విజువలైజేషన్ బాగుంది. లైటింగ్, ఆర్ట్ విభాగం పనితీరును తెరపైన చక్కగా చూపించారు. యాక్షన్ సీన్లు, ట్రైన్ ఎపిసోడ్స్ ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌ను క్రియేట్ చేశాయి. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్‌‌ విషయంలో ఇంకా కొంచెం కత్తెర్లు పడాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. మణిశర్మ రీరీకార్డింగ్ అదిరిపోయింది. పాటలు పెద్దగా ఆకట్టుకోనేలా లేవు. కథలో వాటి అవసరం కూడా కనిపించలేదనే చెప్పవచ్చు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై పుల్లారావు, భగవాన్ పాటించిన నిర్మాణ విలువలు భేష్‌గా ఉన్నాయి.

    తుది తీర్పు ఇలా..

    తుది తీర్పు ఇలా..

    రిపబ్లిక్ మూవీ విషయానికి వస్తే.. ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని బ్యాక్‌డ్రాప్‌గా చేసుకొని ఏపీలోని కొల్లేరు సరస్సును ప్రధాన అంశంగా తెరకెక్కించిన సినీ విమర్శనాస్త్రం. డైలాగ్స్ ఈ సినిమాకు ప్రాణం. సాయిధరమ్ తేజ్, ఐశ్వర్యరాజేష్, రమ్యకృష్ణ, జగపతిబాబు, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి వాళ్లు సినిమాకు మరింత ఆకర్షణగా మారారు. అయితే క్లైమాక్స్ విషయానికి వస్తే కమర్షియల్ విలువలను ఆశించే వారికి కొంచెం అసహనానికి గురిచేస్తుంది. కోర్టు సీన్లు చాలా సహజత్వంగా ఉంటాయి. సామాజికి అంశాల ఆధారంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి రిపబ్లిక్ మంచి అనుభూతిని కలిగిస్తుంది. కమర్షియల్‌గా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి. అయితే పూర్తిస్థాయిలో ఎమోషనల్‌గా, ఫీల్ కంటిన్యూ కాకపోవడం కొంత మైనస్ అనిచెప్పవచ్చు.

     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    కథ, కథనాలు
    సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ ఫెర్ఫార్మెన్స్
    డైలాగ్స్
    సినిమాటోగ్రఫి

    నెగిటివ్ పాయింట్స్

    నెగిటివ్ పాయింట్స్

    ఫ్యాష్ ఎపిసోడ్స్ రొటీన్‌గా ఉండటం
    స్లో నరేషన్
    పూర్తిస్థాయిలో ఎమోషనల్‌ అంశఆలు పండకపోవడం

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: సాయిధరమ్ తేజ్, ఐశ్వర్యరాజేశ్, రమ్యకృష్ణ, జగపతిబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, ఆమని తదితరులు
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దేవ కట్టా
    స్క్రీన్ ప్లే: కిరణ్ జే కుమార్
    నిర్మాతలు: జే భగవాన్ రావు, జే పుల్లారావు
    సినిమాటోగ్రఫి: ఎం సుకుమార్
    ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
    మ్యూజిక్: మణిశర్మ
    బ్యానర్: జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్
    రిలీజ్ డేట్: 2021-10-01

    English summary
    Republic movie review: Sai Dharam Tej, Deva Katta's Republic is political satire with Emotional elements.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X