Retro First Review: రెట్రో మూవీ ఫస్ట్ రివ్యూ.. సూర్య, పూజా హెగ్డే హిట్ కొట్టారా?
తమిళ సూపర్ స్టార్ సూర్య, పూజా హెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రెట్రో (Retro Review). కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై కార్తీకేయన్ సంతానం, సూర్య, జ్యోతిక నిర్మాతలుగా మారి నిర్మించారు. తమిళంలో పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయరాం, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాపత్ంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా కోసం దుబాయ్‌లో జరిగిన సెన్సార్ ప్రీమియర్ షో వీక్షించిన క్రిటిక్ వెల్లడించిన రివ్యూ, ఆయన అభిప్రాయం వివరాల్లోకి వెళితే..
రెట్రో మూవీ ఇండియన్ సెన్సార్ విషయానికి వస్తే.. ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రం కావడంతో కొన్ని భాగాల్లో మితి మీరిన హింస ఉంది. కాబట్టి ప్రేక్షకులపై వాటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి.. కొన్ని సన్నివేశాలపై కత్తెర వేయాలి అని సెన్సార్ బోర్డు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు కొన్ని సీన్లను తొలగించడం.. కొన్ని డైలాగ్స్‌కు బీప్స్ వేయడం జరిగిందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక రెట్రో మూవీకి సాధారణ చిత్రాలకు ఉండే నిడివి కంటే ఎక్కువగానే ఉందనే విషయం చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా మొత్తం రన్ టైమ్ సుమారుగా 168 నిమిషాలు అంటే.. రెండు గంటల 48 నిమిషాలపాటు సాగుతుంది. యాక్షన్ సన్నివేశాలతోపాటు రొమాంటిక్, ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కొంత భాగం సాగదీసినట్టు రెగ్యులర్‌గా రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అనే ఫీలింగ్ కలుగుతుంది అని తెలిపారు.
ఇదిలా ఉండగా, దుబాయ్‌లో సెన్సార్ స్క్రీనింగ్ చూసిన క్రిటిక్ ఉమేర్ సంధూ తన అభిప్రాయాన్ని షార్ట్ రివ్యూ రూపంలో వెల్లడించారు. ఈ సినిమా సూర్య టాప్ రేంజ్ పెర్ఫార్మెన్స్‌తో పవర్ ప్యాక్డ్ కల్ట్ క్లాసిక్ మూవీ. ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులు కూడా అద్బుతంగా నటించారు. వారి పెర్ఫార్మెన్స్‌తో సినిమా మంచి ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది అని తన రివ్యూలో పేర్కొన్నారు.
గత కొద్దికాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న సూర్య.. ఈ రెట్రో సినిమా ద్వారా బిగ్ బ్యాంగ్‌తో కమ్ బ్యాక్ ఇస్తాడు. ఈ సినిమాలోని డైలాగ్స్‌కు ప్రేక్షకుల చప్పట్లు మోగుతూనే ఉంటాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే క్లైమాక్స్ మంచి అనుభూతిని పంచుతుంది. ఈ సినిమా ఓవరాల్‌గా పైసా వసూల్ మూవీ అని పేర్కొన్నారు.
హీరోయిన్ పూజా హెగ్గే విషయానికి వస్తే.. గత రెండు, మూడు సంవత్సరాలుగా డిజాస్టర్ సినిమాలతో కెరీర్ క్లోజ్ అయిందా? అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఈ సినిమాతో పూజా హెగ్డే హిట్ కొట్టబోతుంది. ఈ సినిమాలో ఆమెకు నటించడానికి స్కోప్ ఉన్న పాత్ర లభించింది. ఈ సినిమాకు నా రేటింగ్ 3.5/5 అంటూ ఉమేర్ సంధూ తన రేటింగ్ ఇచ్చాడు. ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాపై ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











