Retro Movie Review: రెట్రో మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జయరాం, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాశ్ రాజ్ తదితరులు
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతలు: జ్యోతిక, సూర్య, కార్తీకేయన్ సంతానం, రాజశేఖర్ పాండ్యన్
మ్యూజిక్: సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రాఫర్: శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్: షఫీఖ్ మహ్మద్ ఆలీ
బ్యానర్: స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2025-05-01

స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించే పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ తిలక్ (జోజు జార్జ్) దత్త పుత్రుడు పారివేల్ కన్నన్ (సూర్య). తండ్రి కోసం క్రిమినల్ వ్యవహారాల్లో భాగమౌతాడు. కానీ రుక్మిణి (పూజా హెగ్డే)తో ప్రేమలో పడిన తర్వాత మాఫియా, స్మగ్లింగ్ యాక్టివిటీస్ వదిలేయాలని నిర్ణయించుకొంటాడు. కానీ పెంపుడు తండ్రి తిలక్‌ కావాల్సిన గోల్డ్ ఫిష్ సమాచారం పారివేల్ వద్ద ఉంటుంది. ఈ క్రమంలో అరెస్ట్ అయిన పారివేల్ జైలు నుంచి తప్పించుకొంటాడు. తనపై కోపంతో వదలేసి వెళ్లిన రుక్మిణి ఆచూకీ కోసం వెతుకులాట మొదలుపెడుతాడు.

Retro Tamil Movie Review

పారివేల్‌ను తిలక్ ఎందుకు దత్తత తీసుకొన్నాడు? క్రిమినల్ వ్యవహారాలను వదిలేయాలని అనుకొన్న తర్వాత ఎదురైన పరిస్థితులేమిటి? పెంపుడు తండ్రి తిలక్ కోరుకొంటున్న గోల్డ్ ఫిష్ ఏంటి? గోల్డ్ ఫిష్ వివరాలు పారివేల్ నుంచి సేకరించడానికి మాఫియా వర్గాలు ఎలాంటి ప్రయత్నాలు చేశాయి? రుక్మిణి ఆచూకీ దొరికిందా? మైఖేల్ (విధు) టార్గెట్ ఏంటి? అండమాన్‌లో బానిసలుగా మారిన ప్రజల ముఖాల్లో చిరు నవ్వులు చిందించాలని పారివేల్ అనుకొన్న లక్ష్యాన్ని సాధించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే రెట్రో సినిమా కథ.

రెట్రో స్క్రిప్టు విషయానికి వస్తే.. మూడు నాలుగు లేయర్లుగా మంచి పాయింట్స్ స్టోరీలో కనిపిస్తాయి. కానీ వాటిని అన్నింటిని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కిచిడి చేయడంతో గందరగోళమే క్రియేట్ అయింది. రకరకాల అంశాలు సరిగా లేకపోవడంతో కథ ఎటుపోతుంది? పాత్రలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాయి? వారి మధ్య పోరాటానికి టార్గెట్ ఏమిటనే క్లారిటీ లేకపోవడంతో ప్రేక్షకుడికి ఏం చూస్తున్నామో అర్ధం కాని పరిస్థితి. క్లైమాక్స్‌లో కథ సారాంశాన్ని చెప్పిన తీరు ఒక్కటే కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

కథ, కథనాలతో ప్రేక్షకుడిని మెప్పించడంలో దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ ఫెయిల్ అయినప్పటికీ.. సూర్య తన స్క్రీన్ ప్రజెన్స్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. పారివేల్ పాత్రలో ఉండే డిఫరెంట్ వేరియేన్స్‌ను చక్కగా చూపించాడు. గ్యాంగ్‌స్టర్‌గా, భార్య ప్రేమ కోసం తపించే భర్తగా ఆకట్టుకొనే విధంగా పెర్ఫార్మ్ చేశాడు. ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే.. రోల్ లెంగ్త్ ఎక్కువగా ఉన్నా కానీ.. సినిమాలో ఇంపాక్ట్ ఉండదు. నటించడానికి స్కోప్ లేని డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్‌లో కనిపించింది. ఒక్క పాటలో తప్ప ఏ సీన్‌లో కూడా ఎట్రాక్టివ్‌గా అనిపించదు. జోజు జార్జ్, విధు, ప్రకాశ్ రాజ్ పర్వాలేదనిపిస్తారు.

కథలో విషయం లేనప్పుడు, పస లేనప్పుడు సాంకేతిక విభాగాల పనితీరు కూడా డీలా పడుతాయనే విషయాన్ని రెట్రో మరోసారి స్పష్టం చేసింది. బేసిగ్గా కథలో వేగం, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎలివేట్ కాకుండా పోయాయి. సంతోష్ నారాయణ్ తన వంతుగా బీజీఎంతో న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫి బాగుంది. అండమాన్ ప్రాంతాల్లో సీనిక్ బ్యూటీని చక్కగా కెమెరాల బంధించాడు. జ్యోతిక, సూర్య అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.

రెట్రో గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. కథ, కథనాలు, పాత్రల డిజైన్ పరంగా కార్తీక్ సుబ్బరాజు పూర్తిగా విఫలమయ్యాడు. సూర్య, పూజా హెగ్డే, జోజు, ప్రకాశ్ రాజ్, నాజర్ లాంటి ఆరిస్టులను సరిగా వాడుకోలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. క్రైమ్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నా గ్యాంగ్‌స్టర్ డ్రామా. సూర్య, పూజా హెగ్డే అభిమానులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఎక్కువ అంచనాలు పెట్టుకొని వెళ్తే కొంత నిరాశ చెందవచ్చు. కాబట్టి సూర్య పెర్ఫార్మెన్స్‌ను ఎక్స్‌పీరియెన్స్‌ చేయాలనే మూడ్‌లో వెళ్లండి.. కాస్త రిలీఫ్ ఉంటుందేమో.

More from Filmibeat

Read more about: Retro suriya pooja hegde
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X