Retro Twitter Review: రెట్రో మూవీ ట్విట్టర్ రివ్యూ

తమిళ సూపర్ స్టార్ సూర్య, పూజా హెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రెట్రో (Retro Review). కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై కార్తీకేయన్ సంతానం, సూర్య, జ్యోతిక నిర్మాతలుగా మారి నిర్మించారు. తమిళంలో పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయరాం, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీమియర్లు ఓవర్సీస్‌లోను, అలాగే తమిళనాడు, కర్ణాటకలో ఎర్లీ షో ప్రారంభమయ్యాయి. ఈ షోల ద్వారా నెటిజన్లు, అభిమానులు వెల్లడించిన అభిప్రాయలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం రొమాంటిక్, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీగా రూపొందింది. ఈ సినిమాకు టాప్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వర్క్ చేయడం వల్ల బడ్జెట్ భారీగానే అయింది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 70 కోట్ల రూపాయలతో పూర్తి చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Retro Tamil Movie Twitter Review i

రెట్రో సినిమా చూశాను. ఫస్టాఫ్ స్లోగా ఉంది. సెకండాఫ్ పర్వాలేదనిపిస్తుంది. సూర్య ట్రాన్స్‌ఫర్మేషన్ బాగుంది. స్లోగా నడిచే యాక్షన్ సినిమా. ఒకసారి చూడొచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

సూర్య నటించిన రెట్రో సినిమా ఇంటెన్స్, యాక్షన్ థ్రిల్లర్. మితీ మీరిన హింస ఉంది. కాబట్టి ఈ సినిమాకు 15 రేటింగ్. తన భార్య కోసం మాజీ గ్యాంగ్‌స్టర్ ఎలాంటి పోరాటం చేశాడనేది సినిమా కథ. పూజాహెగ్డే, జయరాం, జోజు జార్జ్ యాక్టింగ్ బాగుంది అని బ్రిటీష్ బోర్డు రివ్యూ వెల్లడించింది.

రెట్రో సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామా. కొన్ని సీన్లు చాలా డిస్ట్రబ్ చేస్తాయి. ఓ గ్యాంగ్‌స్టర్ లవ్ స్టోరీతో సాగే యాక్షన్ డ్రామా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నా రేటింగ్ 3.5 అంటూ కామెంట్ చేశాడు.

రెట్రో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో సూర్యకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విష్ చేస్తూ.. సూర్యా అన్నా.. మీరు కార్తీక్ లాంటి గొప్ప డైరెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మీ ఇద్దరి కాంబోకు భారీ విజయం తప్పుదు. నిర్మాత జ్యోతిక గారికి, పూజా హెగ్డే గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్, తెలుగులో రిలీజ్ చేస్తున్న నాగవంశీ గారికి, చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ సూర్యకు స్టార్ హీరో శింబు అభినందనలు సోషల్ మీడియాలో తెలిపారు. రెట్రో గ్రాండ్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు. సూర్య అన్నా, కార్తీక్ సుబ్బరాజు, పూజా హెగ్డే, అలాగే సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్‌కు నా బెస్ట్ విషెస్. మీ అందరికి బిగ్ డే కావాలని కోరుకొంటున్నాను అని శింబు ఆకాంక్షించారు.

ఒన్ ఓన్లీ సూర్య సార్ అంటూ యాక్టర్, యాంకర్ ఆర్జే బాలాజీ ట్వీట్ చేశారు. కార్తీక్ సుబ్బరాజు, సంతోష్ నారాయణ్‌కు నా అభినందనలు. ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సూర్య సార్‌తో పాటు చిత్ర యూనిట్‌ అందరికీ నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

సూర్య నటించిన రెట్రో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇళయదళపతి విజయ్ ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోబోతున్న సూర్య సార్, రెట్రో చిత్ర యూనిట్‌కు మా శుభాకాంక్షలు అని విజయ్ తరుఫున ఆయన ఫ్యాన్స్ శుభాకాంక్షలు అందించారు.

More from Filmibeat

Read more about: Retro suriya pooja hegde
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X