twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కథే' నాయకుడు

    By Staff
    |

    బ్యానర్ :వైజయింతి మూవీస్
    తారాగణం: రజనీకాంత్,జగపతిబాబు,నయనతార,మీనా,ప్రభు,సునీల్,
    బ్రహ్మానందం,ధర్మవరపు,దువ్వాసి మోహన్,అలీ,ఎమ్.ఎస్,
    విజయ్ కుమార్,మమతా మోహన్ దాస్ ,సోనా,తణికెళ్ళ తదితరులు.
    సంగీతం: జివి ప్రకాష్
    కథ :శ్రీనివాసన్
    డైలాగ్స్ :మరుధూరి రాజా
    ఆర్ట్ :తోట తరణి
    ఎడిటింగ్: శరవరణ
    యాక్షన్: దళపతి దినేష్
    సినిమాటోగ్రఫి: అరవింద్ కృష్ణ
    దర్శకుడు: పి.వాసు
    నిర్మాత :అశ్వనీ దత్
    రిలీజ్ డేట్: 1 ఆగస్టు 2008

    అరుదై పోతున్న మానవ సంభంధాలు,స్నేహ బాంధవ్యాలు నేపధ్యంలో రూపొందిన కథా నాయుకుడు చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. రజనీకాంతో 'శివాజీ' తర్వాత వచ్చిన ఈ చిత్రానికి భారీ ఎత్తున ఓపినింగ్స్ అంతటా వచ్చాయి. మళయాళంలో 'కథా పరియంబోల్' చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రానికి కమర్షియల్ హంగులు దిద్ది పి.వాసు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. కథానాయుకుడుగా రజనీకాంత్ తన నిజజీవిత పాత్రను చేసి తనదైన స్టైల్స్ ,మేనరిజమ్స్ తో ఓ ప్రక్క ఆకట్టు కుంటూనే క్లైమాక్స్ కళ్ళు చెమర్చేలా చేసాడు.కథే నాయుకుడు గా వచ్చిన ఈ చిత్రం సగటు ప్రేక్షకుడుకి నచ్చేలా ఉండటంతో తప్పనిసరిగా ఫ్యామిలీలుకు వెల్ కమ్ చెప్తుంది.

    ఓ పల్లెలో బాలు(జగపతి బాబు) తరతరాలుగా వస్తున్న క్షురక వృత్తినే నమ్ముకున్న నిక్కిచ్చి మనిషి.అతన్ని అర్ధం చేసుకునే భార్య (మీనా),ముగ్గురు పిల్లలే అతని ఆస్ధి. ఆధునికతను ఎడాప్ట్ చేసుకోకపోవటంతో వృత్తిలో పోటీ పెరిగి ఆర్దికంగానూ,సామాజికంగానూ నలగి పోతూంటాడు. ఆ సమయంలో అతనుండే ఊరికి షూటింగ్ నిమిత్తం సూపర్ స్టార్ అశోక్ కుమార్ (రజనీకాంత్ )వస్తాడు.ఆ హీరో మన బాలు కి బాల్య మిత్రుడు.కానీ అతను ఎదిగిపోవటంతో బాలు అతనిని కలవటానికి సంశయిస్తాడు.భార్య,పిల్లలు,ఊరివారు అతన్ని అశోక్ కుమార్ కి పరిచయం చేయమని బలవంతం పెట్టినా ఒప్పుకోడు. అలాంటి స్ధితిలో ఆ బాల్య మిత్రులిద్దరూ ఎలా కలిసారన్నది మిగతా కథ.

    నిజానికి ఫెరఫార్మన్స్ పరంగా రజనీ గురించి చెప్పుకునే పనేలేదు.ఆయనెప్పుడూ అభిమానులను నిరాశపరచడు.తన సూపర్ స్టైల్స్, వెరైటీ గెటెప్స్ ఆయనెప్పుడూ యువ హీరోలు పోటీ ఇస్తూనే ఉంటారు.ఇక జగపతి బాబు ఈ పాత్రలో జీవించారనే చెప్పాలి.ధర్మవరపు,సునిల్ కామెడీ చాలా బాగుంది.నయనతార తన మేజిక్ ని మరో సారి ప్రధర్సించింది. మీనా మిడిల్ క్లాస్ మహిళగా ఒదిగిపోయింది.బ్రహ్మానందాన్ని సరిగా ఉపయోగించుకోలేదు.

    కాన్సెప్ట్ కృష్ణ ,కుచేల కథ నుండి వచ్చిందైనా స్నేహ బంధాన్ని తన దైన శైలిలో సృజనాత్మకంగా ఆవిష్కరించింది.అయితే స్క్రీన్ ప్లే మరింత బాగా చేసుండవచ్చుననే ఫీలింగ్ ని ఈ సినిమా మిగిలిస్తుంది.అలాగే కథా క్రమం కూడా స్లో గా ఉండటం కొంత ఇబ్బందే.అయితేనేం క్లైమాక్స్ లో అన్నీ కొట్టుకుపోతాయి.అలాగే రహమాన్ మేనల్లుడు జివి.ప్రకాష్ అందించిన సంగీతం అధ్భుతం కాదు గానీ బావుందనిపిస్తుంది. కెమారా పనితనం మెచ్చుకోతగిన రీతిలో ఉంది.డైలాగు రచయిత కూడా బాగానే కృషి చేసాడు.

    అయితే కామిడీ,కథనంలో వేగం మరింత కావాలనిపించే ఈ సినిమా ప్యామిలీ ఆడియన్స్ కి పడితే తిరుగు లేదు.సాంగ్స్ మిస్ ప్లేస్ మెంట్ గా అవటం,సంగీతం ఆకట్టుకునే స్ధాయిలో లేకపోవటం డెప్త్ నివ్వని దర్శకత్వం సినిమాకు మైనస్ గా నిలిచాయి. అలాగే రజనీకాంత్ హీరో కదా అని ఫిక్స్ అయి సినిమా చూస్తే కొంత నిరాశ పడక తప్పదు. కథలో సూపర్ స్టార్ వల్ల చివరలో ఆ ఊరికి ఏం ఉపయోగం జరిగిందన్నది స్పష్టం చేస్తే ...అలా పల్లెలనుండి ఎదిగి పెద్ద స్ధాయికి వెళ్ళిన వారు తన తల్లి లాంటి పల్లెలకు ఏదైనా చేసేందుకు ప్రేరణ నిచ్చినట్లయ్యేది. మరింత అధ్బుతమనిపించేది.సినిమా మంచి హిట్టయితే తెలుగులో ఇలాంటి మరెన్నో మానవత్వపు విలువలున్న చిత్రాలు రావటానికి ఆస్కారం ఉంటుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X