twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మతిపోగొట్టే..ముగ్గురు(రివ్యూ)

    By Srikanya
    |

    సంస్థ: సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి.
    నటీనటులు: నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌, రాహుల్‌, రీమాసేన్‌, శ్రద్దాదాస్‌, సంజన, సౌమ్య, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్‌, అలీ తదితరులు
    సంగీతం: కోటి,
    నిర్మాత: డా||డి.రామానాయుడు
    దర్శకత్వం: వి.ఎన్‌.ఆదిత్య


    ముగ్గురు అత్యాశ గల అబ్బాయిలు..ముగ్గురు అందమైన అమ్మాయిలు..వీరి మధ్య నడిచే కథ,కధనం తెలుగుకు కొత్తేమీ కాదు.ముఖ్యంగా అప్పట్లో వచ్చిన సందడే సందడి చిత్రాన్ని కొద్దిగా తిప్పి ఈ కాలానికి మార్చి,మలేషియా బ్యాక్ డ్రాప్ అల్లినట్లున్న కథ,కథనం ముగ్గురు.అయితే కాన్సెప్ట్ ని అయితే ఎత్తుకొచ్చారు కానీ కామిడీని లిప్ట్ చేయలేకపోయారు.దాంతో ఈ సినిమాని లిప్ట్ చేయటం ప్రేక్షకులకు చాలా కష్టంగా ఉంది.మనసంతా నువ్వే వంటి ఫీల్ గుడ్ ఫిలిం ను తీసిన ఆదిత్య ఇలాంటి పస లేని కామిడీని తీస్తాడని ఊహించలేం.

    పవన్‌, మారుతి, అంజి (నవదీప్‌, రాహుల్‌, అవసరాల శ్రీనివాస్‌) అనే ముగ్గురు వాయుపుత్రుల కథ ఇది. అంటే వీళ్లు పనీపాటా లేకుండా గాలికి తిరుగుతుంటారు. కానీ కోరికలు మాత్రం చాలా ఎక్కువ.ఆ కోరికలు తీర్చుకోవటానకి కావాల్సిన మనీ కోసం ఓ కిడ్నాప్ ని మార్గంగా ఎంచుకుంటారు.మలేషియాలో సెటిలైన పెద్ద పారిశ్రామిక వేత్త జేపీ(ఆహుతి ప్రసాద్)ని టార్గెట్ చేస్తారు.అయితే వీళ్ళ అదృష్టమో..దురదృష్టమో కానీ కిడ్నాప్ అయిన అయిన జేపీ కి హార్ట్ స్ట్రోక్ వస్తుంది.దాంతో వీళ్ళు వెంటనే రిస్క్ ఎందుకని హాస్పటిల్ కి తీసుకువెళ్థారు.ఈ కిడ్నాప్ విషయం తెలియని ఆయన వీళ్లు తన ప్రాణం రక్షించారని నమ్ముతాడు.అంతేగాక తన ముగ్గురు కూతుళ్ళు షాలినీ, యామిని, మోహిని (శ్రద్ధాదాస్‌, సంజన, సౌమ్య)లను వీరికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు.అయితే అనుకోని విధంగా వీరి జీవితాల్లోకి బాల త్రిపుర సుందరి (రీమాసేన్‌)రంగ ప్రవేశంతో ఈ ఆరుగురి జీవితాలు మలుపు తిరుగుతాయి. అదేంటి? వాయుపుత్రుల కల ఎలా నెరవేరింది? అనేదే కథ.

    ఇక మొదటి నుంచీ కామెడీ సినిమా గా ప్రమోట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రతీ చోట నవ్వించాలని దర్శకుడు,రచయిత శతవిధాలుగా ప్రయత్నించటం అడుగడుక్కి కనపిస్తుంది.అయితే ఆ ప్రయత్నాలు ఈ పాత కాలం కథలో పారలేదు.నిజానకి ఈ కథలో పండే ఎలిమెంట్ ఇలాంటి వెధవలు ఎలా ఎరుక్కుని బుద్ది తెచ్చుకున్నారనే స్కీమ్ లోనే కామిడీ వస్తుంది.అలాంటి ఇరుక్కుపోవటం అనేది సినిమాలో లేదు.హీరోలు తమ తెలివితో అందరినీ బకరాలను చేస్తూంటే వినోదం పండించటానకి స్కోప్ ఉండదు.ఇక అలామొదలైంది లో క్లీక్ అయిన తాగుబోతు రమేష్ క్యారెక్టర్ మీద,క్లైమాక్స్ లో వచ్చే బ్రహ్మానందం పాత్రమీద బాగా ఆధారపడ్డారు కానీ అవి వర్కవుట్ కాలేదు.

    అలాగే ఇవివి స్టైల్లో అందరి హీరోలు,బ్రహ్మానందం మీద పాట పెట్టి నవ్వించే ప్రయత్నం చేసారు కానీ సరైన ఫలితాన్ని ఇవ్వలేదు.వటీనటుల్లో నవదీప్ ఎప్పటిలాగానే బాగానే చేసినా ఫలతం లేదు.రాహుల్,అవసరాల శ్రీనివాస్ కూడా రాణించలేకపోయారు.ఇక హీరోయిన్స్ కి అయితే అంగాంగ ప్రదర్శనే తప్ప క్యారక్టైజేషన్ మీద దృష్టే పెట్టలేదు.కథలో సర్పైజ్ గా అనుకున్న రీమా సేన్ లో వయస్సు మీద పడిన ఛాయలు కనపడుతూండటం నీరస పరిచే అంశం.సంగీత పరంగా కోటి బాగానే కష్డపడ్డాడు.అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కుదరలేదు.కెమెరా,ఎడిటింగ్ బాగానే ఉన్నాయి.

    ఫైనల్ గా కామెడీ సినిమా చూద్దామనుకునే వారికి ఏడుపు మిగిల్చే చిత్రం ఇది.కాబట్టి కాస్త ఆలోచించి అటు వైపు వెళ్ళటం బెస్ట్.ఎలాగూ టీవిల్లో వేస్తారుగా కొద్ది రోజులు ఆగితే అని ఫిక్సైతే మరీ బెస్ట్.అలా కాకుండా డైరక్టర్ గత సినిమాలు,నిర్మాత హిట్ సినిమాలు విని సినిమాకి వెళ్తే మట్టైపోతాం.

    English summary
    V N Aditya’s latest film ‘Mugguru’relesed with Disaster talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X