కంత్రీ మంచోడే

By Staff

Rating
-జోశ్యుల సూర్య ప్రకాష్
నటీనటులు: ఎన్టీఆర్,ప్రకాష్ రాజ్ ,హన్సికా మెత్వాని,తనీషా,సునీల్,
ధర్మవరపు,అలీ,బ్రహ్మానందం,శాయాజీ షిండే,ఆషిష్ విథ్యార్ధి తదితరులు.
కెమెరా: సమీర్ రెడ్డి
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
సంగీతం: మణిశర్మ
ఫైట్స్: స్టన్ శివ
కథ,మాటలు,స్ర్కీన్ ప్లే,దర్శకత్వం: మొహర్ రమేష్
నిర్మాత: సి.అశ్వనిదత్

ముల్లును ముల్లుతోనే తీయాలి అన్న పాయింటుతో...పగ ప్రతీకారం ..బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మాస్ మసాలా చిత్రం కంత్రి.కథనంలో పోకిరిని గుర్తు చేసే ట్విస్టు ఉన్నా కథ రొటీన్ ది కావటం,సెకండాఫ్ లో కాంఫ్లిక్ట్ తగ్గటంతో పట్టు కోల్పోయింది. దాంతో విపరీతమైన అంచనాలతో వచ్చిన ఈ సినిమాని ఎన్టీఆర్ పూర్తిగా తన భుజాలపైనే మొయ్యాల్సి వచ్చింది.

అనాధైన క్రాంతి(ఎన్టిఆర్) ఓ కంత్రి. అవసరార్ధం పి.ఆర్ (ప్రకాష్ రాజ్)మాఫియా గ్యాంగులో చేరి..అతనికే ఎదురు తిరుగుతాడు.ఈ లోగా అనుకోకుండా పి.ఆర్ అతని తండ్రి అన్న విషయం బయిటపడుతుంది.దాంతో క్రాంతి ఏం చేసాడు.పి.ఆర్ ఎలా రెస్పాండ్ అయ్యాడు..క్రాంతి ..కంత్రి అని ఎలా అనిపించుకుంటాడనేది మిగతా కథ.

క్లైమాక్స్ లో ట్విస్టు బయటపడి ప్రేక్షకుడుని షాక్ చేసే ఈ తరహా కథనాలు విన్న వెంటనే ఎట్రాక్ట్ చేసినా హీరోయిజాన్ని ఎలివేట్ చేయటంలో కొంత వెనుక పడుతాయి.కంత్రి కూడా అదే సమస్య ఎదుర్కొంది.ఇంటర్వెల్ తరువాత హీరో కి విలన్ కి సంథి చేసి కథలో సంఘర్షణ కి చరమగీతం పాడింది.దాంతో కథనం కామిడి వైపు,సెకండ్ హీరోయిన్ తో లవ్ ట్రాక్ వైపు వెళ్ళి దారి తప్పింది.అలాగే దర్శకుడు ఊహించినట్లుగా పోకిరి రేంజ్ లో ఆ ప్రి క్లైమాక్స్ ట్విస్టు అదరలేదు.వెరే సబ్ ప్లాట్ తో కథనం వెళ్ళి హఠాత్తుగా ట్విస్టు పడితే ప్రేక్షకుడి ఊహకి అందేది కాదు.మరింత మజా వచ్చేది.ఇక కథలో మొయిన్ ట్రాక్ బ్లఫ్ మాస్టర్ ని గుర్తు చేస్తే ...లవ్ ట్రాక్ జస్ట్ మై లక్ కి పూర్తి అనుకరణ.ఇవన్నీ ఎలా ఉన్నా ఎన్టీఆర్ తన దైన శైలిలో డాన్సులు,ఫైట్స్ చేసి ఈ లోపాలని కప్పి పుచ్చాడు.అవే సినిమాని పూర్తి స్థాయిలో కాపాడుతాయి.

మణిశర్మ సంగీతం ఇప్పటికే హిట్టవటం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింటు.డైలాగులు మరింత షార్పుగా ఉంటే బాగుండేది.అలీ,కృష్ణ భగవాన్,సునీల్ కామిడి బాగానే నవ్వించాయి.హీరోయిన్లు ఇద్దరు గ్లామర్ పంచటానికే పనికొచ్చారు.

యోది యేమైనా అన్ని మాస్ మసాలాలు కూర్చినా కథనంపై మరింత కష్టపడితే నూతన దర్శకుడు కి మరింత పేరొచ్చి ఉండేది.క్లైమాక్స్ ట్విస్టు నచ్చితే కంత్రి ముందుకు దూసుకుపోతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X