Revolver Rita Movie Review: రివాల్వర్ రీటా మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. పేలని కిర్తీ సురేష్ రివాల్వర్

Rating:
1.5/5

నటీనటులు: కీర్తి సురేష్, రాధిక శరత్ కుమార్, సునీల్, రెడిన్ కింగ్ల్సే, అజయ్ ఘోష్, జాన్ విజయ్, కల్యాణ్ మాస్టర్ తదితరులు
కథ, దర్శకత్వం: జేకే చంద్రు
నిర్మాతలు: సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి
సినిమాటోగ్రఫి: దినేష్ బీ కృష్ణన్
ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
మ్యూజిక్: సీన్ రోల్డాన్
బ్యానర్: ప్యాషన్ స్టూడియోస్, ది రూట్
రిలీజ్ డేట్: 2025-11-28

పాండిచ్చేరిలో తిరుగులేని డాన్ డ్రాక్యుల్లా పాండియన్ (సూపర్ సుబ్బరాయన్). పాండియన్‌ను చంపడానికి రెడ్డి (అజయ్ ఘోష్) ముఠా వెంటాడుతుంది. ఓ పార్టీకి రప్పించి పాండియన్‌ను మర్డర్ చేయాలని రెడ్డి ముఠా ప్లాన్ వేస్తుంది. అయితే రీటా సిస్టర్ బర్త్ డే పార్టీ జరుగుతుండగా అనుకోకుండా పాండియన్ ఆ ఇంట్లోకి దూరుతాడు. అక్కడ జరిగిన గొడవలో రీటా చేతిలో పాండియన్ యాక్సిడెంటల్‌గా మర్డర్ అవుతాడు. ఆ తర్వాత రీటా ఫ్యామిలీకి తాము చంపిందేవరో అనే విషయం తెలుస్తుంది. దాంతో పాండియన్‌ మృతదేహాన్ని మాయం చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో కనిపించకుండా పోయిన పాండియన్‌ గురించి తన తమ్ముడు డ్రాక్యుల్లా బాబీ (సునీల్) వెతకడం మొదలు పెడుతాడు.

Revolver Rita Movie Review

పాండియన్, రెడ్డి గ్రూపుల మధ్య పగలు ఎందుకు ఏర్పడ్డాయి? ఉరిశిక్ష పడిన తర్వాత పాండియన్‌ను రెడ్డి గ్రూప్ చంపాలని ఎందుకు ప్రయత్నించింది? పాండి తలకు 5 కోట్ల రూపాయల వెలను ఎందుకు కట్టింది? రీటా చేతిలో పాండియన్ ఎలా చనిపోయాడు? తమ చెతిలో చనిపోయిన పాండియన్ మృతదేహాన్ని మాయం చేయడానికి రీటా ఫ్యామిలీ ఎలాంటి కష్టాలు పడింది? పాండియన్ మరణం తర్వాత బాబీ రియాక్షన్ ఏమిటి? పాండియన్ మర్డర్ అయ్యాడని తెలిసిన అజయ్ ఘోష్ రియాక్షన్ ఏమిటి? ఐదు కోట్ల రూపాయల ఎవరికి దక్కాయి? ఇంకా ఈ కథలో కీలక ట్విస్టులు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే రివాల్వర్ రీటా సినిమా కథ.

చదవడానికి ఈ సినిమా కథ బాగానే అనిపిస్తుంది. కానీ తెర మీద మాత్రం సహనానికి పరీక్షగానే ఉంటుంది. కథలో లాజిక్కులకు చోటే కనిపించదు. పాండిచ్చేరిని వణికించే పాండియన్ క్యారెక్టర్ ఎంపిక చేసిన క్యారెక్టర్ చాలా పేలవంగా ఉంది. ఆయనను చూస్తే డాన్ అనే ఫీలింగ్ కలగదు. పెద్ద జోకర్‌లా కనిపిస్తాడు. అదే ఈ సినిమా మైనస్. ప్రేక్షకుడు కనెక్ట్ కాకపోవడానికి అదే ప్రధానమైన లోపం. అసలు కొత్తదనం లేకుండా సినిమా తీయవచ్చో అనే విషయాన్ని దర్శకుడు జేకే చంద్రు తెలియచెప్పాడు.

బేకరీలో పనిచేసే అమ్మాయిగా రీటా క్యారెక్టర్ డిజైన్ బేసిక్స్ మిస్ అయ్యాయి. కీర్తీ సురేష్ చుట్టు కథ అల్లుకొని మర్డరీ మిస్టరినీ డార్క్ కామెడీగా చేద్దామని ప్లాన్ చేసినట్టు ఉంటుంది. ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా తన మార్కును చూపించే కీర్తీ సురేష్.. తన రోల్‌ ఎంత ఎలివేట్ చేయాలో అంత వరకు చేసింది. కానీ ఇలాంటి క్యారెక్టర్లకు దూరంగా ఉంటేనే మంచిది.

పేలవంగా సాగే ఈ కథలో చెల్లెమ్మ (రాధిక శరత్ కుమార్), చీటా (రెడిన్ కింగ్స్‌లే) కామెడీ ప్రేక్షకుడికి జోష్ పుట్టించింది. క్లైమాక్స్ కొంత కామెడీ వర్కవుట్ కాకపోతే ఈ సినిమా మరింత దారుణంగా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతంత మాత్రంగానే చెప్పుకోవాలి. సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి నిర్మాతలు చేసిన ప్రయత్నం, అనుసరించిన నిర్మాణలు బాగుంది. కానీ కథ, కథనాలు, నటీనటుల ఎంపిక విషయంలో జాగ్రత్త పడాల్సిందనిపిస్తుంది. థియేటర్‌కు వెళ్లి చేసే కన్నా.. ఓటీటీ వరకు వెయిట్ చేయడమే మంచిందనేది నా అభిప్రాయం.

ఫైనల్‌‌గా.. కీర్తీ సురేష్ సినిమా అంటే ఫ్యామిలీ అందరూ ఎదురు చూస్తుంటారు. ఇటీవల కాలంలో ఆమె ఎంపిక చేసుకొంటున్న సినిమాలు చూస్తుంటే పరిస్థితి వేరేలా ఉంది. ఇప్పటి వరకు మంచి పాత్రల్లో నటించి మహానటి అనిపించుకొన్న కీర్తీ సురేష్ మహానటి కాదు అని నిరూపించుకొనే ప్రయత్నం చేసినట్టులా ఉంది ఈ సినిమా. చాలా నాసిరకమైన సినిమా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X