Rewind Review: రివైండ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.5/5

మూవీ: రివైండ్ (Rewind)
నటీనటులు: సాయి రోనక్, అమృతా చౌదరి, సురేష్, జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ తదితరులు
స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: కళ్యాణ్ చక్రవర్తి
బ్యానర్: క్రాస్ వైర్ క్రియేషన్స్
మ్యూజిక్: ఆశీర్వాద్
సాహిత్యం: రవివర్మ ఆకుల
సినిమాటోగ్రఫి: శివ రామ్ చరణ్
ఎడిటర్: తుషార పాలా
రిలీజ్ డేట్: 2024-10-18

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసే కార్తీక్ (సాయి రోనక్) తన అపార్ట్‌మెంట్‌లో కనిపించిన శాంతి (అమృతా చౌదరీ) తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తన ఆఫీస్‌లోనే ఉద్యోగంలో చేరడంతో ఇంకా సంతోషపడిపోతాడు. వారిద్దరి మధ్య పరిచయం స్నేహంగా, ఆ తర్వా త ప్రేమగా మారుతుంది. అంతలోనే తన జీవితంలో ఓ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని పరిచయం చేస్తానని చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. అయితే తన తాత (సామ్రాట్) వద్ద ఉన్న టైమ్ మిషన్ గురించి చెబుతుంది.

Rewind Telugu Movie Review

శాంతి జీవితంలోకి వచ్చిన వ్యక్తి ఎవరు? కార్తీక్ ప్రేమకు శాంతి ఇష్టంగా ప్రేమించే పర్సన్ అడ్డంకిగా నిలిచాడా? కార్తీక్‌ను ఐదేళ్ల నుంచి ప్రేమిస్తున్న మరో అమ్మాయి ఎవరు? కార్తీక్ వెంట డ్రగ్స్ ముఠా ఎందుకు వెంటాడుతున్నారు? టైమ్ మిషిన్ ద్వారా కార్తీక్ ఏం చేశాడు? శాంతి ప్రేమను గెలుచుకొన్నాడా? మరణించిన తన తండ్రి (సురేష్) వద్దకు టైమ్ మిషన్‌లో వెళ్లి ఏం చేశాడు? టైమ్ మిషిన్ కార్తీక్ ఏ విధంగా ఉపయోగపడిందనే ప్రశ్నలకు సమాధానమే రివైండ్ (Rewind) సినిమా కథ.

అదిత్య 369 నుంచి ఇప్పటి వరకు టైమ్ మిషన్ కథతో వచ్చిన చిత్రాలకు మంచి ఆదరణే లభించింది. అయితే కల్యాణ్ చక్రవర్తి రాసుకొన్న పాయింట్ చాలా బాగుంది. కథగా విస్తరించే క్రమంలో, పాత్రలను ఎస్టాబ్లిష్ చేసి కాన్సెప్ట్‌ను ఆడియెన్స్‌ను కనెక్ట్ చేయడానికి చేసిన ప్రయత్నం నింపాదిగా సాగడంతో కథను సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో చిక్కు ముడులను వేసిన డైరెక్టర్.. సెకండాఫ్‌లో టైమ్ మిషన్‌ బ్యాక్ డ్రాప్‌తో రాసుకొన్న సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉన్నాయి. దర్శకుడిగా తాను చెప్పాలనుకొన్న కథను నిజాయితీతో చెప్పే ప్రయత్నం చేశారనిపిస్తుంది.

నటీనటులు విషయానికి వస్తే.. యువ హీరో, హీరోయిన్లు సాయి రోనక్, అమృతా చౌదరీ పాత్రల్లో ఒదిగిపోయాడు. రాజధాని ఫైల్స్‌తో ఆకట్టుకొన్న అమృతా చౌదరీ ఈ సినిమాలో గ్లామర్‌తోను, ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. సాయి రోనక్ ఇప్పటికే రకరకాల పాత్రలతో తన కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకొన్నాడు. ఈ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్, లవ్, ఎమోషన్స్‌తో పాత్రలో ఉండే వేరియేషన్స్ చక్కగా చూపించాడు. సురేష్, సామ్రాట్, వైవా రాఘవ, కేఏ పాల్ రాము తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

రివైండ్ సినిమాలోని సాఫ్ట్‌వేర్ బ్యాక్ డ్రాప్‌తో సాగే పాట, సురేష్, సాయి రోనక్ మధ్య వచ్చే పాటలు బాగున్నాయి. సాహిత్యం, డైలాగ్స్ ఫ్రెష్‌గా ఉంది. టైమ్ మిషన్ లాంటి కాన్సెప్ట్‌తో రూపొందిన కథలో పలు సన్నివేశాలను సినిమాటోగ్రఫి ఎలివేట్ చేసింది. దర్శకుడే నిర్మాత కావడంతో కథకు సరిపడే విధంగా, రాజీ పడకుండా నిర్మాణ విలువలను పాటించాడు. ఎడిటింగ్ ఇతర విభాగాల పనితీరు బాగుంది.

ఫాదర్ సెంటిమెంట్, లవ్, ఎమోషన్స్‌తోపాటు ఓ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రూపొందిన చిత్రం రివైండ్. దర్శకుడి విజన్ బాగుంది. టిపికల్‌గా, టెక్నికల్‌గా టఫ్ ఉన్న కథను తన శక్తిమేరకు ప్రేక్షకుడికి రివర్స్ స్క్రీన్ ప్లేతో సులభంగా అర్ధమయ్యేలా చెప్పడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. కానీ కథలో వేగం లేకపోవడం.. పాత్రల మధ్య ఎమోషన్స్ ఇంకా పండించాల్సి ఉంది. టైమ్ మిషన్, లవ్, ఎమోషన్స్ ఆధారంగా రూపొందే సినిమాలను ఆదరించే వారికి రివైండ్ కూడా నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: sai ronak amrutha chowdary rewind
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X