twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Reyiki Veiyi Kallu OTT Review.. ఆసక్తికరమైన ట్విస్టులతో సాగే మర్డర్ మిస్టరీ

    |

    Rating: 2.75/5

    నటీనటులు: అరుల్ నిధి స్టాలిన్, అజ్మల్ అమీన్, మహిమా నంబియార్, ఆనంద్ రాజ్, జాన్ విజయ్, ఆడుకాలమ్ నరేన్ తదితరులు
    దర్శకత్వం: ము మారన్
    నిర్మాత: జీ దిల్లి బాబు
    సినిమాటోగ్రఫి: అరవింద్ సింగ్
    ఎడిటింగ్: సాన్ లోకేష్
    మ్యూజిక్: సామ్ సీఎస్
    బ్యానర్: యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
    ఓటీటీ రిలీజ్: ఆహా
    ఓటీటీ రిలీజ్ డేట్: 2022-09-30

    భరత్ (అరుల్ నిధి స్టాలిన్) క్యాబ్ డ్రైవర్. సుశీల (మహిమ నంబియార్)‌తో ప్రేమలో పడుతాడు. అమ్మాయిలను బుట్టలో వేసుకొని బ్లాక్‌మెయిల్ దందాలకు పాల్పడే గణేష్ (అజ్మల్ అమీన్) సుశీలను చూసి వెంటపడి వేధిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో బిజినెస్ మ్యాన్ మురుగన్ (ఆనంద్ రాజ్), వసంత్ (జాన్ విజయ్) దంపతులను బెదిరింపులకు పాల్పడి గణేష్ భారీగా డబ్బు లాగేస్తాడు. ఈ క్రమంలో తన ప్రేయసిని వేధిస్తున్న గణేష్‌ను భరత్ వెంటాడుతున్న సమయంలో అనుమానాస్పద పరిస్థితుల్లో గణేష్‌తో ముఠాలో ఉండే మాయ హత్య జరుగుతుంది. మాయ హత్యా నేరం భరత్‌పై పడుతుంది.

    సుశీలను వేధించడం వెనుక గణేష్ ప్లాన్ ఏమిటి? తన ప్రియురాలు సుశీలను వేధిస్తుంటే.. భరత్ ఎలా గుణపాఠం చెప్పాలని ప్రయత్నించాడు. గణేష్ చేతిలో బిజినెస్ మ్యాన్ మురుగన్‌ ఎలా మోసపోయాడు? అలాగే వసంత్ భార్య గణేష్‌ను ఎందుకు కలిసింది? మురుగన్‌ను గణేష్ మోసగించాడు? గణేష్ చేతిలో మోసానికి గురైన మురుగన్ ప్రతీకారం కోసం ప్రయత్నించాడా? భరత్‌పై మాయ హత్యానేరం ఎందుకు పడింది? మాయ హత్యానేరం నుంచి తప్పించుకోవడానికి భరత్ ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే రేయికి వేయ్యి కళ్లు.

     Reyiki Veiyi Kallu OTT Review: Interesting murder mystery with action drama on Aha

    భరత్, సుశీల మధ్య ఫీల్‌గుడ్ లవ్ స్టోరీతో కథ ఫీల్‌గుడ్‌గా మొదలవుతుంది. అందమైన అమ్మాయిలతో కలిసి బలవంతపు వసూళ్లు, బ్లాక్‌మెయిల్ దందాలు చేసే గణేష్ పాత్ర ఎంట్రీ‌తో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇక 50 ఏళ్ల వయసులో 25 అమ్మాయితో సహజీవనం చేయాలనుకొనే బిజినెస్ మ్యాన్ ఎపిసోడ్, ఇష్టంలేని పెళ్లి చేసుకొని అయిష్టంగా కాపురం చేసే వసంత్ దంపతుల వ్యవహారం సినిమా కథను మలుపు తిప్పేలా చేస్తాయి. ఇలాంటి అంశాలు సాగుతున్న సమయంలో మాయ హత్య సినిమాను మరో మలుపు తిరుగుతుంది. మాయ హత్య తర్వాత గణేష్ కూపీ లాగుతుండటంతో అనేక ట్విస్టులు బయటపడుతాయి. వసంత్ భార్య బ్లూ ఫిలిం వీడియో వ్యవహారం, బ్లాక్ మెయిల్ లాంటి ఊహించని మలుపులుగా మారుతాయి. మామను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనే విషయాలు మరింత క్యూరియాసిటీని పెంచుతాయి.

     Reyiki Veiyi Kallu OTT Review: Interesting murder mystery with action drama on Aha

    ఇక నటీనటులు విషయానికి వస్తే.. అరుల్ నిధి స్టాలిన్ పక్కింటి అబ్బాయిగా భరత్ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్, లవ్ సీన్లలో ఆకట్టుకొన్నాడు. సెకండాఫ్‌లో అరుల్ నిధి నటన మరింత ఆకట్టుకొంటుంది. ఇక ఎప్పటిలానే అజ్మల్ అమీన్ సాఫ్ట్ విలనిజంతో చెలరేగిపోయాడు. రంగం, నేత్రికన్ సినిమాల తర్వాత అజ్మల్ విలనిజంతో మరోసారి రాటుదేలిపోయాడు. ఇక అనంద్ రాజ్, జాన్ విజయ్ పాత్రలు కొంత ఫన్ క్రియేట్ చేయడంతోపాటు కథకు మంచి ట్విస్టులుగా మారాయి. మహిమా నంబియార్ క్యూట్‌గా, బబ్లీగా కనిపించారు. మిగితా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

    రేయికి వెయ్యి కళ్లు సినిమా సాంకేతిక విషయాల్లోకి వెళితే.. ఈ మూవీకి సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పలు సన్నివేశాలను, అలాగే సినిమా మూడ్‌ను బెటర్‌గా మార్చడంలో మ్యూజిక్ కీ రోల్ పోషించింది. ఇక అరవింద్ సింగ్ సినిమాటోగ్రఫి బాగుంది. నైట్ ఎఫెక్ట్ షాట్స్ బాగున్నాయి. ఢిల్లీ బాబు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    లవ్, యాక్షన్, సస్పెన్స్, మిస్టరీ అంశాలతో రూపొందిన చిత్రం రేయికి వెయ్యి కళ్లు. తమిళంలో 50 రోజులపాటు థియేటర్‌లో ప్రేక్షకులకు అనుభూతిని పంచిన ఇరువక్కు ఆయిరమ్ కంగళ్ సినిమా తెలుగులోకి డబ్ చేసి ఆహాలో రిలీజ్ చేశారు. మర్డర్ మిస్టరీ ఛేదించే క్రమంలో ఎదురయ్యే ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి. ఆహా ఓటీటీలో రిలీజైన సినిమా మంచి అనుభూతిని పంచడం ఖాయం. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి రేయికి వెయ్యి కళ్లు తప్పక నచ్చుతుంది.

    English summary
    Reyiki Veiyi Kallu movie hits the Aha OTT. This movie is dubbed into Telugu form Tamil Original Iravukku Aayiram Kangal. Here is the Filmibeat Telugu's Exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X