For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RGV D-Company Movie: రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.5/5

  నటీనటులు : అశ్వంత్ కాంత్ , రుద్ర కాంత్, నైనా గంగూలీ, అప్సర రాణి, ఇర్రా మోర్
  దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.
  నిర్మాత: సాగర్ మాచనూరు
  సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి
  మ్యూజిక్ డైరెక్టర్: పాల్ ప్రవీణ్
  ఎడిటర్: సంఘ ప్రతాప్ కుమార్
  రిలీజ్ డేట్: 2021-05-15
  రిలీజ్: స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫాం

  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా సినిమా 'డి కంపెనీ'. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ గా పేరుపొందిన దావూద్ ఇబ్రహీం జీవిత కథ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు వర్మ. నిజానికి ఈ సినిమాను మార్చి 26వ తేదీన ధియేటర్లలో విడుదల చేయాలని వర్మ భావించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడడంతో థియేటర్లన్నీ మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమాను స్పార్క్ అనే ఒక కొత్త ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా రిలీజ్ చేశారు. ముంబై అండర్ వరల్డ్ ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించే అంశాలు ఏ మేరకు ఉన్నాయి అనేది సమీక్షలో తెలుసుకున్నాం.

  కథ ఏమిటంటే :

  కథ ఏమిటంటే :

  ఇప్పుడు ప్రపంచం మొత్తానికి అండర్ వరల్డ్ కింగ్ గా తెలిసిన దావూద్ ఇబ్రహీం అసలు ఎక్కడి నుంచి మొదలు అయ్యాడు ? ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి ? ఒక కానిస్టేబుల్ కొడుకు ఈ గ్యాంగ్ వార్స్ కి ఎందుకు ప్రభావితం అయ్యాడు ? అనే అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పుడు ముంబై ప్రశాంతంగా ఉంది, కానీ నలభై ఏళ్ళ క్రితం దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ లోకి అడుగు పెట్టే సమయానికి అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ? దావూద్ ఇబ్రహీం తక్కువ కాలంలోనే ఒక గ్యాంగ్ స్టర్ గా ఎలా ఎదిగాడు అనే కథాంశంతో మొదటి భాగం తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. అన్నతో కలిసి దందా చేసే దావూద్ ఇబ్రహీం సొంతంగా దావూద్ గ్యాంగ్ ను ఎలా ఏర్పరిచారు అనేది మొదటి భాగం కథ.

  డీ కంపెనీ ట్విస్టులు

  డీ కంపెనీ ట్విస్టులు

  ఒకరి నిజ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తే అందులో పెద్దగా ట్విస్టులు ఉండవు అని అందరూ భావించవచ్చు. ముందే తెలిసిన కథ కావడంతో సినిమాటిక్ టచ్ ఉండకపోవచ్చు అనే భావన కలుగుతుంది, కానీ ఈ సినిమా చూశాక అది ఖచ్చితంగా తప్పని తేలుతుంది. ఇప్పుడు ప్రపంచానికి దావూద్ ఇబ్రహీం పరిచయమే కానీ 40 ఏళ్ల క్రితం ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది అనేది ఆయనతో మొదటి నుంచి ఉన్న అతి కొద్ది మందికి తప్ప ఎవరికీ తెలియదు. అలాంటి చిన్న చిన్న విషయాలను కూడా సేకరించి వర్మ ఈ సినిమాలో చూపించగలిగారు. అసలు ముంబైలో అండర్ వరల్డ్ ఎలా పుట్టింది ? అంతకు ముందు గ్యాంగ్ వార్స్ ఎలా ఉండేవి ? పోలీసులతో వారికి సంబంధాలు ఎలా ఉండేవి ? లాంటి అంశాలను అనేక మలుపులతో సినిమాలో ప్రెజెంట్ చేశారు.

  దర్శకుడి ప్రతిభ

  దర్శకుడి ప్రతిభ

  ఈ మధ్యకాలంలో వివాదాస్పద సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న వర్మ ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ చూపించారు. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ టైటిల్స్ పడేవరకు ఆద్యంతం సినిమాలో వర్మ మార్క్ కనిపించింది.. ఇప్పటికే ముంబై అండర్ వరల్డ్ గురించి చాలా సినిమాల్లో కళ్లకు కట్టినట్లు చూపించిన వర్మ ఈ సినిమాలో కూడా మళ్ళీ అలాంటి ప్రయత్నం చేశారు. దర్శకుడిగా వర్మ పనితనం చాలా చోట్ల కనిపించింది. మరీ ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం జీవితానికి సంబంధించి చిన్న చిన్న విషయాలను కూడా మిస్ కాకుండా వర్మ చూపగలగడం సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దావూద్ ఇబ్రహీం కుర్రతనం మొదలు ఒక గ్యాంగ్ నడిపే స్థాయికి ఎలా వచ్చాడు అనే అంశాన్ని వర్మ మిస్ కాకుండా తెరకెక్కించారు. వర్మ సీనియారిటీ ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది.

  నటీనటుల పెర్ఫార్మెన్స్

  నటీనటుల పెర్ఫార్మెన్స్

  ఈ సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దావూద్ ఇబ్రహీం లో కనిపించిన అశ్వంత్ కాంత్ అలాగే ఆయన సోదరుడు సాబీర్ గా కనిపించిన రుద్ర కాంత్ ఇద్దరూ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక దావూద్ ఇబ్రహీం ప్రేయసి సుజాతగా కనిపించిన నైనా గంగూలీ, అలాగే సాబీర్ ప్రేయసి చిత్రగా ఇర్రా మోర్ ఇద్దరూ కూడా కనిపించింది తక్కువే సేపు అయినా తమదైన నటనతో ఆకట్టుకున్నారు.. ఇక ఈ మధ్య కాలంలో వర్మ సినిమాలతో పాపులర్ అయిన అప్సర రాణి ఐటెం సాంగ్ తో అదరకొట్టింది.. ఇక మిగిలిన నటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.

  టెక్నికల్ విభాగం పనితీరు విషయానికి వస్తే

  టెక్నికల్ విభాగం పనితీరు విషయానికి వస్తే

  ఈ సినిమా టెక్నికల్ విభాగాల పనితీరు కూడా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ముఖ్యంగా కథను నెరేట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ సినిమా మీద ఆసక్తి పెంచారు. నిర్మాతగా వ్యవహరించిన సాగర్ మాచనూరు నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాకి రామ్ గోపాల్ వర్మతో కలిసి హరీష్ ఎం కొటియన్ కథ అందించారు. అలాగే పాల్ ప్రవీణ్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోకపోయినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది. అలాగే మల్హర్ బట్ జోషి సినిమాటోగ్రఫీ కూడా వర్మ స్టైల్ లోనే ఉంది. కొన్ని చోట్ల కెమెరా యాంగిల్స్ వర్మ పాత సినిమాలను జ్ఞప్తికి తెచ్చాయి. ఇక వర్మ ఈ సినిమా కోసం గొంతు సవరించుకుని ఒక పాట పాడారు. ఈ సినిమాకు చీఫ్ ఎడిటర్ సంఘ ప్రతాప్ కుమార్ పనితనం కూడా సినిమాలో కనిపించింది. అనవసరమైన సన్నివేశాలు సినిమాలో ఎక్కడా కనిపించలేదు.

  Actress Surekha Vani Panchekattu Video Goes Viral
  ఫైనల్ గా

  ఫైనల్ గా

  అండర్ వరల్డ్ మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు, అలాగే వర్మ అభిమానులు ఈ సినిమా తప్పక చూడచ్చు. వర్మ మార్కు ఎక్కడా మిస్ కాకుండా ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కాకపోతే తెలుగు వారికి అన్నీ తెలియని ముఖాలు కావడంతో కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ సినిమా మాత్రం ఆసక్తికరంగా సాగింది. దాదాపుగా అందరూ బాలీవుడ్ నటీనటులే కనిపిస్తారు. హీరోయిన్స్ ఇద్దరూ గతంలో తెలుగు సినిమాలు చేసి ఉన్న కారణంగా వాళ్లు తెలుగు వారికి పరిచయమే. కానీ అన్నిఇతర పాత్రల్లో నటించిన వారు బాలీవుడ్ నటులు కావడంతో తెలుగు వారు అంత త్వరగా కనెక్ట్ కాలేరు. అయితే వర్మ మార్క్ సినిమా కావడంతో కచ్చితంగా సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

  English summary
  RGV D-Company Movie Review And Rating
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X